ACB Rides (imagecredit:swetcha)
క్రైమ్

ACB Rides: ఏసీబీ వలలో గ్రామ పరిపాలన అధికారి.. దేవుడే పట్టించేనా..!

ACB Rides: లంచం తీసుకుంటూ ఏసీబీ(ACB) అధికారులకు గ్రామ పరిపాలన అధికారి పట్టుబడ్డాడు. భద్రాద్రి కొత్తగూడెం(Bhadradri Kothagudem) జిల్లా ములకలపల్లి(Mulakalapally) మండలం పూసుగూడెం గ్రామానికి చెందిన ఓ రైతు వ్యవసాయ భూమి రిజిస్ట్రేషన్ చేసేందుకు రూ. 60 వేలు గ్రామ పరిపాలన అధికారి శ్రీనివాస్(Srinivas) డిమాండ్ చేశాడు. రైతు వద్ద నుంచి ఇప్పటికే 40000 తీసుకోగా, మరో 15 వేలు తీసుకుంటూ ఏసీబీ అధికారులకు గ్రామ పరిపాలన అధికారి భానోత్ శ్రీనివాస్ నాయక్(Srinivas Nayak) సోమవారం రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడు.

పారదర్శకంగా పనులు

గత ప్రభుత్వంలో ఉన్న ధరణి వెబ్సైట్(Dharani website) ద్వారా రైతులకు, ఇతర భూములకు సంబంధించి సమస్యలు తిష్ట వేయడంతో కాంగ్రెస్(Congress) ప్రభుత్వం ఏర్పడ్డాక ధరణి ని తీసివేసి భూభారతి చట్టాన్ని తీసుకొస్తామని చెప్పిన నేపథ్యంలోనే గ్రామ పరిపాలన అధికారులను ప్రభుత్వం నియమించింది. రైతులకు, ఇతర భూములకు సంబంధించిన సమస్యలను గ్రామస్థాయిలోనే పూర్తి పరిష్కార మార్గం చూపేందుకు గ్రామ పరిపాలన అధికారులను నియమించింది. దీంతో రైతులకు, గ్రామాల్లో ఉన్న వారికి అక్కడే భూ సమస్యల పరిష్కారం జరుగుతుందని భావించి నూతనంగా గ్రామ పరిపాలన అధికార వ్యవస్థను కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చింది.

Also Read: Australia Cricketers: ఇండోర్‌లో షాకింగ్ ఘటన.. ఆసీస్ మహిళా క్రికెటర్లను అసభ్యకరంగా తాకిన ఆకతాయి

రెవెన్యూ అంటేనే లంచాలా..

తహసిల్దార్ కార్యాలయాలు లంచాలకు కేరాఫ్ అడ్రస్ గా మారుతున్నాయి. ఎంత పకడ్బందీగా ప్రభుత్వం వ్యవహరించి ఏసీబీ(ACB) అధికారులను క్షేత్రస్థాయిలో పర్యవేక్షణకు పురమాయించిన అధికారుల తీరులో మార్పు రావడం లేదు. ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ ఇటీవల బాధితుల వద్ద నుంచి డబ్బులు తీసుకుంటూ పట్టుబడుతున్న అధికారులే సాక్షాలుగా నిలుస్తున్నారు. నిత్యం లంచాలు ఎక్కువగా తీసుకునే కార్యాలయాల చుట్టూ నిజాన్ని పెట్టినప్పటికీ ఏమాత్రం జంకడం లేదు. డబ్బులు కనిపిస్తే చాలు తీసుకోవడమే లక్ష్యంగా రెవెన్యూ శాఖలో అధికారులు పనిచేస్తున్నారు. సోమవారం బాధిత రైతు ఫిర్యాదుతో రంగంలోకి దిగి గ్రామ పరిపాలన అధికారి బానోత్ శ్రీనివాస్(Banothu Srinivas) ను అదుపులోకి తీసుకున్నట్లు ఖమ్మం(Khammam) ఏసీబీ డీఎస్పీ వై రమేష్(Y.Ramesh) వెల్లడించారు.

Also Read: Pak Targets Salman: సల్మాన్ ఖాన్‌పై పగబట్టిన పాకిస్థాన్.. ఉగ్రవాదిగా ముద్ర వేసేందుకు భారీ కుట్ర!

Just In

01

Chiranjeeva Trailer: రాజ్ తరుణ్ ‘చిరంజీవ’ ట్రైలర్ ఎలా ఉందంటే..

Huzurabad: హుజూరాబాద్‌లో కాంగ్రెస్ నేత సుడిగాలి పర్యటన.. సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ

Sreeleela: పెళ్లి తర్వాత అలాంటి పాత్రలే ఎక్కువ చేస్తా.. వైరల్ అవుతున్న శ్రీలీల బోల్డ్ కామెంట్స్

Telangana: ‘దూపదీప నైవేథ్యం’ స్కీమ్‌.. ఆలయాల నుంచి భారీగా దరఖాస్తులు.. అధికారుల మల్లగుల్లాలు!

Maa Inti Bangaram: సమంత ‘మా ఇంటి బంగారం’ షూటింగ్ అప్డేట్.. వీడియో వైరల్