Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 రేటింగ్స్ పరంగా మంచిగానే దూసుకెళ్తుంది. గత సీజన్లతో పోలిస్తే కొంచెం ఊపు తగ్గినట్టుగా అనిపించినా, ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రం ఫుల్ గా ఉందనడంలో సందేహమే లేదు. ఈ సీజన్‌లో కామనర్స్ vs సెలెబ్రిటీల (Commoners vs Celebrities) ఫార్మాట్ తో వర్కువుట్ అయినా కూడా నెటిజన్స్ మాత్రం ఈ షో ని వ్యతిరేకిస్తున్నారు.
కంటెస్టెంట్స్ తమ గొడవలు, డ్రామాలు, బుజ్జగింపులతో ఆడియెన్స్ ను ఫుల్ ఎంగేజ్ చేస్తున్నారు. ఎక్కడైనా జోష్ తగ్గినట్లు అనిపిస్తే, బిగ్ బాస్ స్వయంగా రంగంలోకి దిగి కొత్త రచ్చ రేపడానికి రెడీగా ఉంటాడు. కాంట్రవర్సీ క్వీన్ అలేఖ్య చిట్టి పికిల్స్ రమ్య మోక్ష (Ramya Moksha) వైల్డ్ కార్డ్ ఎంట్రీతో ( Wildcard Entry Drama) రచ్చ చేస్తుందనే అనుకున్నారు. కానీ, ఎవరూ ఊహించని విధంగా ఇంట్లోకి వెళ్లిన మొదటి వారమే ఎలిమినేట్ అయింది. అయితే, రమ్య మోక్ష ఎలిమినేషన్ పై నెటిజెన్స్ ఒక్కోలా రియాక్ట్ అవుతున్నారు.
మేము ఇలాంటి షో ని ఎప్పుడూ చూడలేదు. ఒకప్పుడు నాని, ఎన్టీఆర్ చేసేటప్పుడు కొంచం చూడాలని అనిపించేది. కానీ, ఇప్పుడు మాత్రం అస్సలు బాలేదు. కామనర్స్ అని చెప్పి వారిని ఇంట్లో పెట్టి ఎదో హైప్ ను తెద్దాం అని చెప్పి, మొదటి వారమే వారిని ఎలిమినేట్ చేసి మైండ్ గేమ్ భలే ఆడారు. అక్కడితో ఆగకుండా తర్వాత వారాల్లో కూడా కామనర్స్ నే టార్గెట్ చేసి ఒక్కొక్కరుగా ఎలిమినేట్ చేస్తూ వచ్చారు. ఇక వాళ్లు అలా చేయడంతో ఇదంతా స్క్రిప్టెడ్ అని అందరికీ అర్ధమైపోయింది. అయినా కామనర్స్ కి ఒక రూల్, సెలబ్రిటీలకు ఒక రూల్ నా అని నెటిజన్స్ ప్రశ్నిస్తున్నారు.
ఓ పాప అంత ఓవరాక్షన్ అవసరమా.. ?
కొందరు ” మేము అయితే రమ్య కోసమే షో చూశాము. స్టూడెంట్స్ నుంచి కుర్రాళ్ల వరకు ఆమె ఎప్పుడు కనిపిస్తుందా అని చూశాము. కానీ, సీన్ మొత్తం రివర్స్ అయింది. గేమ్ ఆడకుండా అందరితో గొడవ పడింది. అది కరెక్ట్ కాదు. వెళ్లిన మొదటి రోజు నుంచే అందర్ని గమనించాలి. ఆ తర్వాత ఎదుటి వాళ్ళని ఈమె కూడా అలా మాట్లాడి ఉంటే బావుండేది. మాధురితో గొడవ పెట్టుకుంటే ఏం వస్తాది. అసలు ఈమె చేసిన మొదటి తప్పు.. ఇంట్లోకి వెళ్ళగానే అందర్ని జడ్జ్ చేసి మాట్లాడింది. అది ప్రేక్షకులకు అస్సలు నచ్చలేదు. ఇక ఏం చేయాలో అలా చేసి ఇంట్లోనుంచి ఎలిమినేట్ చేసి పంపించారు.
