Gold oct 26 ( Image Source: Twitter)
బిజినెస్

Gold Price Today: తగ్గిన గోల్డ్ రేట్స్.. కొనాలనుకునేవారికీ ఇదే మంచి ఛాన్స్!

Gold Price Today: తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు గత రెండు రోజులుగా తగ్గడంతో గోల్డ్ లవర్స్ సంతోషం వ్యక్తం చేశారు. ఈ రోజు ధరలు మరింత భారీగా దిగిరావడంతో జ్యువెలరీ షాపుల వైపు పరుగులు తీస్తున్నారు. బంగారం అంటే కేవలం ఆభరణం మాత్రమే కాదు, అది మన సంస్కృతి, సంప్రదాయాల్లో ఓ ముఖ్యమైన భాగం.

పెళ్లిళ్లు, పండుగలు, శుభకార్యాల్లో బంగారం ధరించడం మహిళలకు ఒక ప్రత్యేకమైన గౌరవం, సంతోషం. కానీ, ఇటీవలి ఆర్థిక ఒడిదొడుకులతో బంగారం ధరలు ఆకాశాన్ని అంటడం మొదలై, కొనుగోలుదారులను కంగారు పెడుతోంది. ధరలు దిగితే జనం షాపులకు ఉరకలేస్తారు, పెరిగితే మాత్రం “అబ్బా, ఇప్పుడేం కొంటాము.. వద్దు!” అంటూ వెనక్కి తగ్గుతారు.

గత కొన్ని రోజులుగా బంగారం ధరలు కాస్త తగ్గినట్లు కనిపించినా, మళ్లీ ఒక్కసారిగా ఊపందుకున్నాయి. నిపుణులు చెబుతున్న దాని ప్రకారం, అంతర్జాతీయ మార్కెట్‌లో డాలర్ విలువలో హెచ్చుతగ్గులు, సరఫరా-డిమాండ్ అసమతుల్యతలు ఈ ధరల ఒడుదొడుకులకు కారణమని అంటున్నారు. అక్టోబర్ 26, 2025 నాటికి తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు తగ్గాయి. అయినప్పటికీ, నిపుణుల అంచనాల ప్రకారం రాబోయే రోజుల్లో ఈ ధరలు మరింత మార్పులకు లోనవ్చని, కొనుగోలుదారులకు ఇది ఒక్కసారి సంతోషాన్ని, మరోసారి ఆందోళనను తెప్పిస్తుంది.

ఈ రోజు బంగారం ధరలు ( అక్టోబర్ 26, 2025)

అక్టోబర్ 25 తో పోలిస్తే, ఈ రోజు గోల్డ్ రేట్స్ తగ్గాయి. తగ్గిన గోల్డ్ రేట్స్ చూసి మహిళలు బంగారం షాపుకు వెళ్తున్నారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో 22 క్యారెట్, 24 క్యారెట్ బంగారం ధరలు ఇలా ఉన్నాయి..

హైదరాబాద్

22 క్యారెట్ (10 గ్రాములు): రూ.1,15,150
24 క్యారెట్ (10 గ్రాములు): రూ.1,25,620
వెండి (1 కిలో): రూ.1,70,000

విశాఖపట్నం

22 క్యారెట్ (10 గ్రాములు): రూ.1,15,150
24 క్యారెట్ (10 గ్రాములు): రూ.1,25,620
వెండి (1 కిలో): రూ.1,70,000

విజయవాడ

22 క్యారెట్ (10 గ్రాములు): రూ.1,15,150
24 క్యారెట్ (10 గ్రాములు): రూ.1,25,620
వెండి (1 కిలో): రూ.1,70,000

వరంగల్

22 క్యారెట్ (10 గ్రాములు): రూ.1,15,150
24 క్యారెట్ (10 గ్రాములు): రూ.1,25,620
వెండి (1 కిలో): రూ.1,70,000

వెండి ధరలు

వెండి ధరలు కూడా ఇటీవల గణనీయంగా పెరిగాయి. నాలుగు రోజుల క్రితం కిలో వెండి ధర రూ.1,73,000 గా ఉండగా, రూ.3,000 తగ్గి ప్రస్తుతం రూ.1,70,000 కి చేరింది. అయితే, ఈ ధరలు కూడా రోజువారీ హెచ్చుతగ్గులకు లోనవుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో వెండి ధరలు ఈ విధంగా ఉన్నాయి.

విశాఖపట్టణం: రూ.1,70,000
వరంగల్: రూ.1,70,000
హైదరాబాద్: రూ.1,70,000
విజయవాడ: రూ.1,70,000

 

Just In

01

Swetcha Effect: స్వేచ్ఛ కథనంతో సంచలనం.. రంగంలోకి దిగిన నిఘా వర్గాలు డీఎస్పీ అరాచకాలకు తెర!

Ellamma movie: బలగం వేణు ‘ఎల్లమ్మ’ సినిమాకు సంగీత దర్శకుడు ఎవరంటే?

Liquor License: వైన్​ షాపుల లాటరీకి హైకోర్టు గ్రీన్ సిగ్నల్!

Telugu States Disasters 2025: ప్రకృతి గట్టిగానే హెచ్చరిస్తుందిగా.. లోకంలో పాపాలు ఆపకపోతే ఇలాంటి వినాశనాలు తప్పవా?

Aryan second single: విష్ణు విశాల్ ‘ఆర్యన్’ సెకండ్ సింగిల్ వచ్చేసింది.. చూసేయండి మరి..