Jishnu Dev Varma ( image credit: swetcha reporter)
నార్త్ తెలంగాణ

Jishnu Dev Varma: సమాజ మార్పుకు విద్యార్థులు దిక్సూచి కావాలి : గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ

Jishnu Dev Varma: వ్యవసాయ ఉత్పత్తిని, సాంకేతికతన, పరిశోధనలను అభివృద్ధి చేయడానికి విజ్ఞానాన్ని వినియోగించుకోవాలని రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ పేర్కొన్నారు. సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలం పాములపర్తి పరిధిలోని కావేరి విశ్వవిద్యాలయం మరియు సీడ్ కంపెనీలను  గవర్నర్ సందర్శించి పలు విభాగాలను పరిశీలించారు. ఈ సందర్భంగా వర్మ మాట్లాడుతూ విద్యార్థు లు సమాజ మార్పుకు దిక్సూచిగా ఉండాలని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగంలో తీసుకుంటున్న కార్యక్రమాల గురించి వివరించారు. కావేరి యూనివర్సిటీ సందర్శించి ప్రొఫైల్ ను పరిశీలించారు. ఎంటమాలజీ, పాథాలజీ , సాయిల్ సైన్స్ ,బ్రీడింగ్, ఫిజియాలజీ ల్యాబ్స్ ను తర్వాత విద్యార్థు ఏర్పాటుచేసిన ఎగ్జిబిషన్ లలో వివిధ రకాలైన డ్రోన్ టెక్నాలజీ, రోబో టెక్నాలజీ, 3డీ ప్రింటింగ్, ఏఆర్ అండ్, వి ఆర్ మోడల్స్ మరియు అగ్రికల్చర్ ఇన్నోవేషన్ను పరిశీలించారు.

 Also Read:Governor Jishnu Dev Varma: వేగం కన్న ప్రాణం మిన్న.. రోడ్డు సేఫ్టీపై ప్రజల్లో అవగాహన కల్పించాలి.. గవర్నర్ కీలక వ్యాఖ్యలు

అధునాతన పనితీరును అభినందన 

వర్మీ కంపోస్ట్ తయారీ ని పరిశీలించిన అనంతరం ఇంటిగ్రేటెడ్ రీసెర్చ్ సెంటర్ ను గవర్నర్ ప్రారంభించారు. ఈ రిసెర్చ్ సెంటర్లో టిష్యూ కల్చర్, జీనోమిక్స్, బ్రీడింగ్ ప్లాంట్, హెల్త్ ల్యాబ్స్, జీన్ బ్యాంకులను సందర్శించి అధునాతన పనితీరును అభినందించారు. కావేరి యూనివర్సిటీ ఛాన్స్లర్ మాట్లాడుతూ విద్యార్థులు, అభివృద్ధి కోసం విశ్వవిద్యాలయం తీసుకుంటున్న ప్రతిపాదన గురించి వివరించారు. గవర్నర్ కు యూనివర్సిటీ ఛాన్స్ లర్ భాస్కరరావు వైస్ చాన్స్లర్ డాక్టర్ బి ప్రవీణ్ రావు స్వాగతం పలికారు. జిల్లా కలెక్టర్ హైమావతి, పోలీస్ కమిషనర్ విజయ్ కుమార్, ఆర్డీవో చంద్రకళ, యూనివర్సిటీ రిజిస్టర్ శ్రీనివాసులు, డైరెక్టర్ హర్ష పూలసాని ,అగ్రికల్చర్ డీఎన్ఏ ప్రతాప్ కుమార్ రెడ్డి, ఇంజనీరింగ్ డాక్టర్ కొండా శ్రీనివాస్, ప్రొఫెసర్ శాస్త్రవేత్తలు విద్యార్థులు పాల్గొన్నారు.

 Also Read: Zubeen Garg death: స్కూబా డైవింగ్ చేస్తుండగా ప్రముఖ గాయకుడు మృతి.. ఏం జరిగింది అంటే?

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!