Kurnool Bus Accident: కర్నూలు బస్ దగ్దం దుర్ఘటనలో మెదక్ జిల్లా శివ్వాయిపల్లికి చెందిన తల్లి కూతురు దుర్మరణం చెందారు. తెల్లవారుజామున జరిగిన ప్రమాదంలో మెదక్ జిల్లా (Medak District) మండలం శివ్వాయిపల్లి చెందిన సుధారాణి(43,కుమార్తె చందన(23) లు సజీవ దహనం అయ్యారు. మెదక్ మండలం శివ్వాయిపల్లి కి చెందిన ఆనంద్ గౌడ్ దుబాయ్ లో ఉద్యోగరీత్యా స్థిరపడ్డాడు. ఆనంద్ గౌడ్ కు పాపన్నపేట కు చెందిన సుధారాణికి వివాహం జరిగింది. వీరికి కుమారుడు శ్రీవల్లభ్ గౌడ్, కుమార్తె చందన(23) ఉన్నారు. కుమారుడు అలహాబాద్ లో విద్యను అభ్యసిస్తున్నాడు. కుమార్తె చందన బెంగుళూరులో సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తూ అక్కడే ఉంటుంది. ఆనంద్ గౌడ్ సుధారాణిలు దుబాయ్ లో ఉంటూ అప్పుడప్పుడు వచ్చి పోతుంటారు. పాపన్నపేటలో ఉన్న తల్లిదండ్రుల ఇంటికి సుధారాణి భర్త పిల్లలతో కలిసి ఇటీవల వచ్చారు.
Also Read: Kurnool Bus Accident: బస్సు ప్రమాదంలో తీరని విషాదం.. ఒకే ఫ్యామిలీలో నలుగురు మృత్యువాత
ఆ ఇద్దరి తల్లి కూతురిని సజీవ దానం
రెండు రోజుల క్రితం ఆనంద్ గౌడ్, వల్లభ గౌడ్ వెళ్లిపోగా సాయంత్రం సంధ్యారాణి, చందనలు చింతల్ నుంచి ప్రైవేట్ బస్సులో బెంగళూరు బయలుదేరారు. కూతురు చందనను బెంగుళూరులో దింపివేసి అక్కడ నుంచి దుబాయ్ వెళ్లేందుకు సంధ్యారాణి అని ఏర్పాటు చేసింది. కానీ తెల్లవారుజామున అగ్ని రూపంలో వచ్చిన మృత్యువు ఆ ఇద్దరి తల్లి కూతురిని సజీవ దానం చేసింది. బస్సు ప్రమాదంలో 20 మందికి పై మృత్యువాత పడగా అందులో మెదక్ జిల్లా మెదక్ మండలం శివ్వా యి పలికి చెందిన తల్లి కూతురు ఉండడంతో ఆ గ్రామంలో తీవ్ర విషాదం అలుకుంది. విదేశాల్లో ఉన్న అప్పుడప్పుడు కుటుంబీకులు పలకరించేందుకు వచ్చి వెళ్లే ఆనంద్ కుటుంబం ఇలా ప్రమాదంలో మృతి చెందడంతో పలువురు కన్నీరు పెట్టుకున్నారు. పాపన్నపేటకు చెందిన మాజీ సర్పంచ్ గురుమూర్తి సోదరి సంధ్యారాణి మృతి చెందడంతో ఆ గ్రామంలో కూడా విషాదం అలుముకుంది.
