Cardamom Tea: “ఆరోగ్యమే మహాభాగ్యం” అని మన పెద్దలు ఉరికే అనలేదు. కానీ, ఈ రోజుల్లో ఆరోగ్యం అనేది చాలామందికి చేజారిపోతోంది. ఇష్టం వచ్చినట్టు జంక్ ఫుడ్ తినడం, ఫిట్‌నెస్‌ను పట్టించుకోకపోవడం. ఇలా ఒకటి కాదు చాలానే ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నాయి. కానీ, వాతావరణం మారుతున్న ఈ సీజన్‌లో ఒక సింపుల్ హాక్‌తో ఆరోగ్యాన్ని రీఛార్జ్ చేయొచ్చు. అదే యాలకుల టీ. దీనిని ఎలా తయారు చేయాలో ఇక్కడ తెలుసుకుందాం..
Also Read: MLA Murali Naik: విద్యార్థులకు ఇబ్బందులు కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం : ఎమ్మెల్యే మురళీ నాయక్
యాలకుల టీ ఎందుకు స్పెషల్?
హార్మోన్స్ బూస్ట్: యాలకులు వేసిన టీని మరిగించి తాగితే, శరీరంలో హార్మోన్స్ ఉత్పత్తి జరుగుతుంది. మానసిక స్థితి కూడా ఉత్సాహంగా మారుతుంది. ఒత్తిడి, ఆందోళనలకు బైబై చెప్పొచ్చు.
జీర్ణశక్తి జోరు: తిన్న ఆహారం త్వరగా జీర్ణమవుతుంది. మలబద్ధకం, గ్యాస్ ట్రబుల్ వంటి సమస్యలు కూడా దూరమవుతాయి. బొజ్జ ఫ్రీ, లైట్ ఫీలింగ్ గ్యారంటీ.
శ్వాస సమస్యలకు చెక్: యాలకుల టీ శ్వాస ప్రక్రియను స్మూత్ చేస్తుంది. జలుబు, దగ్గు లాంటి సీజనల్ ఇబ్బందులకు ఇది సహజ ఔషధం. అంతేకాదు, నోటి దుర్వాసనను కూడా తరిమేస్తుంది. ఫ్రెష్ బ్రెత్ బోనస్.
షుగర్, బీపీ కంట్రోల్: డయాబెటిస్, రక్తపోటు ఉన్నవారికి యాలకుల టీ ఒక వరం. రోజూ ఒక కప్పు తాగితే, ఈ సమస్యలను అదుపులో ఉంచడంలో సహాయపడుతుందని వైద్యులు చెబుతున్నారు.
ఎలా తయారు చేయాలి?
ఒక కప్పు నీటిలో 2 నుంచి 3 యాలకులు వేసి, బాగా మరిగించండి. మరిగిన తర్వాత టీ పౌడర్, తేనె లేదా చక్కెర (షుగర్ ఫ్రీ ప్రిఫర్ చేస్తే బెటర్) జోడించి, సిప్ చేయండి. ఉదయం లేదా సాయంత్రం తాగితే ఫుల్ ఎనర్జీ వస్తుంది. ప్రస్తుతం, మారుతున్న వాతావరణంలో జలుబు, ఫ్లూ, అలసట వంటి సమస్యలు సర్వసాధారణం. అలాంటి సమయంలో యాలకుల టీ మీ ఆరోగ్యానికి బెస్ట్ ఫ్రెండ్. రోజూ ఒక కప్పు ఈ సుగంధ టీని తాగి, ఆరోగ్యాన్ని రీ చేసుకోండి. “యాలకుల టీతో 100 రోగాలకు ఇలా ఈజీగా చెక్ ” సో, ఇకపై టీ తాగేటప్పుడు యాలకులు మర్చిపోవద్దు – ఆరోగ్యం మీ చేతుల్లోనే.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘స్వేచ్ఛ’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.
