Kurnool Bus Accident (Image Source: Twitter)
ఆంధ్రప్రదేశ్

Kurnool Bus Accident: బస్సు ప్రమాదంలో తీరని విషాదం.. ఒకే ఫ్యామిలీలో నలుగురు మృత్యువాత

Kurnool Bus Accident: మృత్యువు ఏ రూపంలో వచ్చి కబళిస్తుందో చెప్పడం కష్టమే. ఒక్కోసారి కూర్చున్న చోటే కొందరు కుప్పకూలుతుంటారు. మరికొందరు అప్పటివరకూ ఎంతో సరదాగా డ్యాన్స్ చేస్తూ ఒక్కసారిగా మృత్యుఒడిలోకి జారుకుంటారు. తాజాగా కర్నూలు జిల్లాలో జరిగిన బస్సు యాక్సిడెంట్ ఘటన కూడా ఈ కోవకు చెందిందే. ఓ ద్విచక్రవాహనం వెనకనుంచి ఢీకొట్టడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగి ఏకంగా 22 మంది వరకూ ప్రాణాలు కోల్పోయారు. అయితే ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ప్రాణాలు కోల్పోవడం విషాదాన్ని మరింత పెంచుతోంది.

వివరాల్లోకి వెళ్తే..

కర్నూలు జిల్లా బస్సు ప్రమాద ఘటనలో నెల్లూరు జిల్లాకు చెందిన ఒక కుటుంబం ప్రాణాలు కోల్పోయింది. వింజమూరు మండలం గోళ్లవారిపల్లికి చెందిన గొల్ల రమేష్ (37), అనూష (32), మనీష్ (12), మన్విత (10) అగ్నికి ఆహుతయ్యారు. కంపెనీ ట్రిప్ లో భాగంగా గొల్ల రమేష్.. తన ఫ్యామిలీని తీసుకొని ఇటీవల హైదరాబాద్ కు వచ్చారు. ట్రిప్ ముగించుకొని గురువారం రాత్రి వేమూరి కావేరి ట్రావెల్ బస్సు (Vemuri Kaveri Travel Bus)లో బెంగళూరుకు ప్రయాణమయ్యాడు. బస్సు కర్నూలు శివారులోని చిన్నటేకూరు సమీపానికి రాగానే ఓ బైక్ అకస్మాత్తుగా వచ్చి ఢీకొట్టింది. దీంతో బస్సులో మంటలు చెలరేగి 22 మంది వరకూ ప్రాణాలు కోల్పోగా.. వారిలో గొల్ల రమేష్ ఫ్యామిలీ కూడా ఉంది. దీంతో గోళ్లవారిపల్లిలో విషాదఛాయలు అలుముకున్నాయి.

Also Read: Kurnool Crime: కర్నూలు జిల్లాలో దారుణం.. ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సు దగ్ధం 20 మంది మృతి!

సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు

ప్రస్తుతం దుబాయి పర్యటనలో ఉన్న ఏపీ సీఎం చంద్రబాబు (CM Chandrababu).. కర్నూలు జిల్లా బస్సు ప్రమాద ఘటన తెలిసి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఏపీ సీఎస్ సహా ఇతర ఉన్నతాధికారులతో ఫోన్ లో మాట్లాడి ప్రమాద వివరాలను తెలుసుకున్నారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. మరోవైపు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) స్పందిస్తూ.. ప్రమాద ఘటన తన మనసును కలిచివేసిందని అన్నారు. భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా రవాణా శాఖ అన్ని రకాలుగా భద్రతా చర్యలు చేపట్టాలని ఎక్స్ వేదికగా విజ్ఞప్తి చేశారు. ఐటీ మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) స్పందిస్తూ.. ఈ ఘటన అత్యంత బాధాకరమని అన్నారు. ప్రభుత్వం ఇప్పటికే అన్నిరకాల చర్యలు చేపట్టిందని చెప్పారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని భగవంతుడ్ని ప్రార్థించారు.

Also Read: Kurnool Bus Accident: కర్నూలు బస్సు ప్రమాదం.. రాష్ట్రపతి, ప్రధాని దిగ్భ్రాంతి.. సీఎం చంద్రబాబు, పవన్ సంతాపం

వైఎస్ జగన్ దిగ్భ్రాంతి

కర్నూలు జిల్లా బస్సు యాక్సిడెంట్ ఘటనపై వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) ఎక్స్ వేదికగా స్పందించారు. ఈ ఘటన తనను తీవ్రంగా కలిచివేసిందని ఆయన పేర్కొన్నారు. దుర్ఘటనలో తమ ఆత్మీయులను కోల్పోయిన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. గాయపడ్డ వారికి మెరుగైన వైద్యం అందించే విధంగా ప్రభుత్వ చర్యలు చేపట్టాలని కోరారు. మరోవైపు కాంగ్రెస్ ఏపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల (YS Sharmila) సైతం ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో పలువురు ప్రయాణికులు సజీవ దహనం కావడం విచారకరమని ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. మృతుల సంఖ్య మరింత పెరగకుండా క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని, మృతుల కుటుంబాలను అన్ని విధాలుగా రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.

Just In

01

NIMS Hospital: నిమ్స్ ఆసుపత్రిలో అక్రమ నియామకాలు.. శాంతి కుమారి కమిటీ రిపోర్ట్‌లో సంచలనాలు..?

Twitter toxicity: సినిమాలపై ట్విటర్‌లో ఎందుకు నెగిటివిటీ పెరుగుతుంది?.. ట్విటర్ టాక్సిక్ అయిపోయిందా?

Ashanna: మావోయిస్టు పార్టీ ఆరోపణలను ఖండించిన ఆశన్న

Viral Video: అయ్యప్ప మాల దీక్షను తీసుకుని మద్యం సేవించిన స్వామి.. వీడియో వైరల్

Ramchandra Rao: జూబ్లీహిల్స్‌లో రెండు రాష్ట్రాల నేతలు కలిసి పని చేస్తాం..?