Kurnool Crime: కర్నూలు జిల్లాలో దారుణం జరిగింది. కావేరి ట్రావెల్స్‌కు చెందిన వోల్వో ప్రైవేటు బస్సులో మంటలు ఎర్పడ్డాయి. ఈ బస్సు హైదరాబాద్(Hyderabad) నుంచి బెంగళూరు(Bangalore) వెళ్తున్నది. ఈ క్రమంలో శుక్రవారం తెల్లవారుజామున 3.30 గంటల సమయంలో కర్నూలు శివారు చిన్నటేకూరు సమీపంలో ఓ బైకును ఢీకొట్టింది. దీంతో ఒక్కసారిగా బస్సులో మంటలు చెలరేగాయి. క్రమంగా అవి బస్సు మొత్తానికి విస్తరించడంతో భారీగా అగ్నికీలలు చెలరేగాయి. దీంతో చూస్తుండగానే బస్సు మొత్తం అగ్నికి ఆహుతైంది.
బస్సులోనే చిక్కుకొని దుర్మరణం
బస్సులో ఉన్నవారంతా నిద్రిస్తున్న సమయంలో ప్రమాదం జరగడంతో పలువురు బస్సులోనే సజీవదహనం అయ్యారు. ప్రమాదం సమయంలో బస్సులో 42 మంది వరకు ప్రయాణిస్తున్నారు. బస్సులో ప్రమాదం జరిగినపుడు ఎమర్జెన్సీ డోర్ నుంచి 20 నుంచి 25 మంది వరకు బయటపడినట్లు అక్కడి వారు తెలిపారు. మరో 20 మంది బస్సులోనే చిక్కుకొని దుర్మరణం చెందినట్లు సమాచారం. అయితే బైక్‌పై వెళ్తున్నవారు కూడా మరణించారు. దీంతో సమాచారం అందుకున్న పోలీసులు, ఎస్‌డీఆర్‌ఎఫ్ సిబ్బంది ఘటనా స్థలానికి హుటా హుడిన చేరుకున్నారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం
.కర్నూల్(Karnulu) జిల్లా బస్సు ప్రమాదం పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Recanth Reddy) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం సీఎం తెలిపారు. ఆంధ్రప్రదేశ్(AP) అధికారులతో మాట్లాడి అవసరమైన సహాయక చర్యలు తీసుకోవాలని రాష్ట్ర అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. జరిగిన ప్రమాదం పైన రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ తో మాట్లాడిన సీఎం పూర్తి వివరాలు తెలుసుకున్నారు. తక్షణమే హెల్ప్ లైన్ ఏర్పాటు చేయాలని సూచన చేశారు. సమీపంలోని అక్కడి గద్వాల్ కలెక్టర్, ఎస్పీ సంఘటన స్థలానికి వెళ్ళాలని సిఎం ఆదేశించారు.
Also Read: New Moon: అంతరిక్షంలో అద్భుతం.. భూమికి రెండో చంద్రుడు.. 2080 వరకే ఛాన్స్..!
ఘోర ప్రమాదం.. బస్సు దగ్ధం..
కర్నూల్ జిల్లా చిన్నటేకూరు వద్ద వోల్వో బస్సులో భారీ అగ్ని ప్రమాదం
బెంగుళూరు నుంచి హైద్రాబాద్ వెళ్తున్న బస్సులో చెలరేగిన మంటలు
భారీగా ప్రాణ నష్టం
బస్సులో 40 మంది ప్రయాణీకులు ఉన్నట్లు సమాచారం
అత్యవసర ద్వారం పగలగొట్టి స్వల్ప గాయాలతో బయటపడ్డ 12 మంది… pic.twitter.com/zpNZgVXIMb
— BIG TV Breaking News (@bigtvtelugu) October 24, 2025
Also Read: Karimnagar: ఆ గ్రామానికి బస్సు సర్వీస్ ప్రారంభం.. 30 ఏళ్ల కల నెరవేరిన వేళ గ్రామస్తుల హర్షం!
బస్సు ప్రమాద ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి..
మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలిపిన సీఎం రేవంత్ రెడ్డి
ఆంధ్రప్రదేశ్ అధికారులతో మాట్లాడి అవసరమైన సహాయ చర్యలు తీసుకోవాలని రాష్ట్ర అధికారులకు ఆదేశం https://t.co/mohou6wJ5X pic.twitter.com/DHI8Qsz1XR
— BIG TV Breaking News (@bigtvtelugu) October 24, 2025
