Indian Defence (imagecredit:twitter)
జాతీయం

Indian Defence: రక్షణ రంగానికి ఊతం.. రూ 79 వేల కోట్ల ప్రతిపాదనలు

Indian Defence: భారత రక్షణ రంగం మరింత బలోపేతం కానున్నది. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. రూ.79 వేల కోట్ల విలువైన సైనిక పరికరాల కొనుగోళ్లకు అనుమతినిచ్చింది. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్(Defence Minister Rajnath Singh) అధ్యక్షతన జరిగిన రక్షణ కొనుగోళ్ల మండలి సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఫలితంగా భారత సైన్యం, నావికాదళం, వాయు సేనల యుద్ధ(Air Force combat) సామర్థ్యాన్ని ఇది గణనీయంగా పెంచేందుకు తోడ్పడుతుందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. నాగ్ మిస్సైల్ వ్యవస్థ, గ్రౌండ్ బేస్డ్ మొబైల్ సిస్టమ్స్(Ground Based Mobile Systems) అందుబాటులోకి తీసుకొచ్చేలా ముందుకెళ్లనున్నారు.

Also Read: Asim Munir: ‘నువ్వు మగాడివైతే మాతో పెట్టుకో’.. పాక్ ఆర్మీ చీఫ్‌కు తాలిబన్స్ సవాల్!

ల్యాండింగ్ ప్లాట్‌ఫామ్..

దీనివల్ల శత్రువుల యుద్ధ వాహనాలు, బంకర్లు, దుర్భేద్యమైన నిర్మాణాలను విధ్వంసం చేసే సామర్థ్యం కలుగుతుంది. 24 గంటల ఎలక్ట్రానిక్ ఇంటెలిజెన్స్, టాక్టికల్ సమాచార సేకరణకూ ఈ నిధులు సహాయపడతాయని రక్షణ శాఖ అధికారులు తెలియజేశారు. డైవర్స్ టెరైన్లలో లాజిస్టిక్స్ మద్దతును మెరుగుపరచడానికి హై మొబిలిటీ వెహికల్స్ కూడా కొనుగోళ్ల జాబితాలో చేర్చారు. నావికాదళానికి ల్యాండింగ్ ప్లాట్‌ఫామ్ డాక్స్ 30 మి.మీ. నావల్ సర్ఫేస్ గన్స్ కొనుగోళ్లకు సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ రక్షణ రంగ కొనుగోళ్లు భారత రక్షణ వ్యవస్థ మరింత ఆధునికీకరణకు తోడ్పడతాయని అధికారులు తెలిపారు.

Also Read: JDCC Recruitment 2025: బీటెక్ పూర్తి చేసిన వాళ్ళకి గుడ్ న్యూస్.. వెంటనే, అప్లై చేయండి!

Just In

01

NIMS Hospital: నిమ్స్ ఆసుపత్రిలో అక్రమ నియామకాలు.. శాంతి కుమారి కమిటీ రిపోర్ట్‌లో సంచలనాలు..?

Twitter toxicity: సినిమాలపై ట్విటర్‌లో ఎందుకు నెగిటివిటీ పెరుగుతుంది?.. ట్విటర్ టాక్సిక్ అయిపోయిందా?

Ashanna: మావోయిస్టు పార్టీ ఆరోపణలను ఖండించిన ఆశన్న

Viral Video: అయ్యప్ప మాల దీక్షను తీసుకుని మద్యం సేవించిన స్వామి.. వీడియో వైరల్

Ramchandra Rao: జూబ్లీహిల్స్‌లో రెండు రాష్ట్రాల నేతలు కలిసి పని చేస్తాం..?