Pamela Satpathy: రైతులు ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించి మద్దతు ధర పొందాలని కలెక్టర్ పమేలా సత్పతి సూచించారు. రామడుగు మండలం వెదిర రైతు వేదిక ప్రాంగణంలో జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ- టీ సెర్ఫ్ ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను కలెక్టర్.. చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ పమేలా సత్పతి మాట్లాడుతూ ప్రభుత్వం వరి ధాన్యం క్వింటాలుకు ఏ గ్రేడ్ రకం రూ.2389, సాధారణ రకం ధాన్యానికిరూ.2369అందిస్తుందని.. రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రభుత్వం మద్దతు ధరతో పాటు సన్న రకాలకు అదనంగా క్వింటాకు రూ.500 బోనస్ అందిస్తుందని పేర్కొన్నారు.
Also Read: Pamela Satpathy | అధికారులకు మెమోలు జారీ చేసిన కలెక్టర్
ప్రభుత్వం అదనంగా 500 ను బోనస్
రైతులు తమ పంటను తక్కువ ధరకు వ్యాపారులకు అమ్ముకొని నష్టపోవద్దన్నారు. కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా తాగునీరు, ప్యాడి క్లీనర్లు, టార్పాలిన్లు, గన్ని సంచులు తదితర వసతులు కల్పించాలని నిర్వాహకులను ఆదేశించారు. చొప్పదండిఎమ్మెల్యేమేడిపల్లిసత్యంమాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ అన్ని వసతులు కల్పిస్తుందన్నారు. సన్న రకం వడ్లు పండించే రైతులను ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అదనంగా 500 ను బోనస్ గా ఇస్తుందన్నారు. రైతులకు ఇబ్బంది లేకుండా కొనుగోలు కేంద్రాల్లో అన్ని వసతులు కల్పిస్తున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి అనిల్ ప్రకాష్, పలు శాఖల అధికారులు మార్కెట్ కమిటీ చైర్మన్ బొమ్మెర వేణి తిరుమల తిరుపతి వైస్ చైర్మన్ పిండి సత్యం జిల్లా మహిళా అధ్యక్షురాలుకర్ర సత్య ప్రసన్న పులి ఆంజనేయులు గౌడ్ మండల అధ్యక్షులు కాంగ్రెస్ పార్టీ జవాజి హరీష్ అంజనీ ప్రసాద్ కోలా రమేష్ పంజాల శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
Also Read: Huzurabad Collector: మద్యం షాపులో అంగన్‌వాడీ గుడ్లపై.. కలెక్టర్ ఆగ్రహం
