Viral ( Image Source: Twitter)
Viral

Vastu Shastra: చెప్పులు సరైన ప్లేస్ లో లేకపోతే దరిద్ర దేవత వస్తుందా ?.. వాస్తు శాస్త్రం ఏం చెబుతుందంటే?

Vastu Shastra: మనం రోజూ బయట నుండి ఇంటికి చేరుకున్నప్పుడు చెప్పులు, బూట్లను ఎక్కడ బడితే అక్కడ వదిలేస్తాం. ఈ చిన్న అలవాటు మన ఇంటికి పెద్ద ముప్పుగా మారవచ్చని వాస్తు శాస్త్రం హెచ్చరిస్తోంది. చెప్పులను సరైన స్థలంలో ఉంచకపోతే, అవి ప్రతికూల శక్తిని ఆకర్షించి, కుటుంబంలో అనవసర గొడవలు, ఆర్థిక ఇబ్బందులు, మానసిక ఆందోళనలకు కారణమవుతాయి. మీ ఇల్లు ఆనందం, శాంతితో నిండాలంటే, కొన్ని ప్రదేశాల్లో చెప్పులను అస్సలు ఉంచకూడదు. అవేంటో ఇప్పుడు చూద్దాం!

1. బెడ్‌రూమ్‌లో చెప్పులు – పెద్ద పొరపాటు

బెడ్‌రూమ్ అనేది మనం రోజంతా అలసి పోయిన తర్వాత ప్రశాంతంగా విశ్రాంతి తీసుకునే స్థలం. ఇక్కడ మంచం కింద లేదా గదిలో ఎక్కడైనా చెప్పులు ఉంచడం వాస్తు దృష్ట్యా పెద్ద తప్పు. బూట్ల నుండి వెలువడే ప్రతికూల శక్తి మీ నిద్రను భంగపరచడమే కాక, దంపతుల మధ్య అపార్థాలు కారణమవుతుంది. ఇది వైవాహిక జీవితంలో ఒడిదొడుకులను తెచ్చిపెడుతుంది. కాబట్టి, పాదరక్షలను బెడ్‌రూమ్ బయట, ఒక నిర్దిష్ట షూ రాక్‌లో ఉంచండి.

Also Read: Sleep Health: నిద్రలేమి సమస్యతో బాధ పడుతున్నారా? అయితే, ఈ చిట్కాలు మీ కోసమే!

2. వంటగది – అన్నపూర్ణ దేవి నివాసం

వంటగదిని అన్నపూర్ణాదేవి నెలకొన్న పవిత్ర స్థలంగా భావిస్తాం. ఇక్కడ మనం తయారు చేసుకునే ఆహారం మనకు ఆరోగ్యం, శక్తిని అందిస్తుంది. అలాంటి స్థలంలోకి బయటి దుమ్ము, ధూళితో నిండిన చెప్పులను తీసుకురావడం అంటే, ప్రతికూల శక్తిని ఆహ్వానించడమే. ఇది కుటుంబ సభ్యుల ఆరోగ్యంపై హానికర ప్రభావం చూపడమే కాక, ఆర్థిక ఇబ్బందులకి కూడా దారితీస్తుంది. అందుకే, వంటగదిలో చెప్పులను ఉంచడం పూర్తిగా నివారించండి.

Also Read: JDCC Recruitment 2025: బీటెక్ పూర్తి చేసిన వాళ్ళకి గుడ్ న్యూస్.. వెంటనే, అప్లై చేయండి!

3. పూజా మందిరం – దైవిక శక్తి కేంద్రం

పూజా మందిరం ఇంట్లో అత్యంత పవిత్రమైన, సానుకూల శక్తి నిండిన ప్రదేశం. ఇక్కడ దేవతలు కొలువై ఉంటారు. చెప్పులతో ఈ స్థలంలోకి ప్రవేశించడం లేదా చెప్పులను ఇక్కడ ఉంచడం వాస్తు శాస్త్రం ప్రకారం దైవానుగ్రహానికి ఆటంకం కలిగిస్తుంది. ఇది మానసిక అశాంతి, ఏకాగ్రత లోపం, ఆందోళనలకు కారణమవుతుంది. కాబట్టి, పూజా మందిరంలో చెప్పులను అస్సలు ఉంచకూడదు.

4. ప్రధాన ద్వారం – లక్ష్మీదేవి ఆగమన మార్గం

వాస్తు శాస్త్రం ప్రకారం, ఇంటి ప్రధాన ద్వారం లక్ష్మీదేవి ప్రవేశ మార్గం. ఈ ద్వారం ముందు చెప్పులు, బూట్లను  ఉంచితే ఐశ్వర్యం, శుభ శక్తులకు అడ్డుపడటమే. ద్వారం ఎప్పుడూ శుభ్రంగా, చక్కగా ఉండాలి. చెప్పులను ద్వారం పక్కన ఒక మూలలో లేదా షూ క్యాబినెట్‌లో నీటుగా సర్దుకోండి.

Just In

01

Swetcha Effect: స్వేచ్ఛ కథనంతో సంచలనం.. రంగంలోకి దిగిన నిఘా వర్గాలు డీఎస్పీ అరాచకాలకు తెర!

Ellamma movie: బలగం వేణు ‘ఎల్లమ్మ’ సినిమాకు సంగీత దర్శకుడు ఎవరంటే?

Liquor License: వైన్​ షాపుల లాటరీకి హైకోర్టు గ్రీన్ సిగ్నల్!

Telugu States Disasters 2025: ప్రకృతి గట్టిగానే హెచ్చరిస్తుందిగా.. లోకంలో పాపాలు ఆపకపోతే ఇలాంటి వినాశనాలు తప్పవా?

Aryan second single: విష్ణు విశాల్ ‘ఆర్యన్’ సెకండ్ సింగిల్ వచ్చేసింది.. చూసేయండి మరి..