Gold Rate Prediction: గోల్డ్ ధరలు ఇక తగ్గే అవకాశం ఉందా? లేదా?
Gold Prediction ( Image Source: Twitter)
Viral News, బిజినెస్

Gold Rate Prediction: గోల్డ్ ధరలు ఇక తగ్గే అవకాశం లేదా.. నిపుణులు ఏం చెబుతున్నారంటే?

Gold Rate Prediction: భారత మార్కెట్లో బంగారం ధరలు రోజు రోజుకి పెరుగుతున్నాయి తప్ప తగ్గడం లేదు. పండగ సీజన్ దగ్గరపడుతున్న నేపథ్యంలో 24 క్యారెట్ బంగారం ధర రూ.1.34 లక్షల దాకా చేరింది. అయితే, ఇప్పుడు అందరి మదిలో మెదిలే ఒకే ఒక్క ప్రశ్న ఇక బంగారం ధరలు తగ్గే అవకాశం లేదా? అని. ఎందుకంటే, ఈ ధరలు రోజూ పైపైకి వెళ్తున్నాయి.

బంగారం ర్యాలీకి కారణాలు

నిపుణుల విశ్లేషణ ప్రకారం, గ్లోబల్ స్థాయిలో బంగారం ధరలు పెరగడానికి పలు కారణాలు ఉన్నాయి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో అనిశ్చితి, యుద్ధాల భయం, అమెరికా-చైనా మధ్య వాణిజ్య ఉద్రిక్తతలు వంటివి పెట్టుబడిదారులు బంగారంలోకి మొగ్గుచూపేలా చేశాయి. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు తగ్గించే అవకాశం కూడా ధరల పెరుగుదలకు మద్దతుగా మారింది. డాలర్ బలహీనత, అలాగే దేశీయంగా పండుగల సీజన్, వివాహాల సీజన్ కారణంగా డిమాండ్ భారీగా పెరిగింది.

Also Read: Ramya Krishnan: మళ్లీ ఆ ఐటెమ్ సాంగ్ చేయాలని ఉందన్న రమ్యకృష్ణ.. భయపడ్డ జగపతి బాబు

“తగ్గే అవకాశం చాలా తక్కువే” విశ్లేషకుల అభిప్రాయం

ఇప్పటివరకు భారీగా పెరిగిన బంగారం ధరల్లో తాత్కాలిక స్థిరత్వం లేదా స్వల్ప తగ్గుదల మాత్రమే కనిపించే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. “ప్రస్తుతం బంగారం అతి వేగంగా పెరుగుతుంది. కాబట్టి స్వల్ప కరెక్షన్ రావడం సహజం. కానీ, పెద్ద స్థాయిలో తగ్గుదల కనిపించదు” అని మార్కెట్ నిపుణులు తెలిపారు.

Also Read: Gold Price Today: పండుగ అయిపోవడమే ఆలస్యం.. భారీగా పతనమైన గోల్డ్ రేట్స్?

భారతదేశంలో బంగారం డిమాండ్ ఇంకా బలంగానే ఉంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన బంగారం నిల్వలను $100 బిలియన్ల దాకా పెంచినట్లు ఇటీవల నివేదికలు వెల్లడించాయి. “సెంట్రల్ బ్యాంకులు, సంస్థాగత పెట్టుబడిదారులు బంగారంపై నమ్మకం ఉంచుతున్నంతకాలం దీని విలువ పెద్దగా తగ్గే అవకాశం లేదు.” అని నిపుణులు చెబుతున్నారు.

Just In

01

45 Official Trailer: శివరాజ్ కుమార్, ఉపేంద్రల అరాచకం.. ఎండింగ్ డోంట్ మిస్!

Akhanda 2: ‘అఖండ 2’ సక్సెస్ మీట్‌కు నిర్మాతలు ఎందుకు రాలేదు? భయపడ్డారా?

Suriya46: ‘సూర్య సన్నాఫ్ కృష్ణన్’‌ను తలపిస్తోన్న సూర్య – వెంకీ అట్లూరి మూవీ టైటిల్!

Vishnu Vinyasam: శ్రీ విష్ణు నెక్ట్స్ సినిమా టైటిల్ ఇదే.. టైటిల్ గ్లింప్స్ అదిరింది!

Minister Seethakka: మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని చంపే కుట్ర: మంత్రి సీతక్క