Ramya Krishnan: ఒక హీరో విలన్ అయితే ఎలా ఉంటుందో చూశారు. ఇప్పుడు విలన్ రియాలిటీ షో కి హోస్ట్ అయితే.. ఎలా ఉంటుందో చూస్తారా? ఆ షో మరేదో కాదు ” జయమ్ము నిశ్చయమ్మురా “. ఈ షో లో జగపతి బాబు చేస్తున్న అల్లరి అంత ఇంతా కాదు. ఇక ఇటీవల కాలంలో సినీ సెలబ్రిటీలు కూడా హోస్ట్ లుగా చేస్తూ తమ సత్తాను చాటుతున్నారు. టీవీ షోలు, ఓటీటీ షోలు చేస్తున్న నేపథ్యంలో హీరో కమ్ జగపతి బాబు కూడా యాంకర్ గా మారిపోయి అదరకొడుతున్నారు. ఒకప్పుడు హీరోగా ఎన్నో హిట్ సినిమాలు చేసిన జగపతి బాబు సెకండ్ ఇన్నింగ్స్ లో విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా దూసుకుపోతున్నారు.
జగపతి బాబు హోస్ట్ గా జయమ్ము నిశ్చయమ్మురా అనే షో చేస్తున్న విషయం తెలిసిందే. ఈ షోకి ఇప్పటికే సెలబ్రిటీలను తీసుకొచ్చి ఇంటర్వ్యూ చేశారు. తాజాగా లేటెస్ట్ ప్రోమో రిలీజ్ అయింది. ఈ ఎపిసోడ్ లో రమ్య కృష్ణ గెస్ట్ గా వచ్చారు. ఈ ఇంటర్వ్యూలో అనేక విషయాలు బయటకు వచ్చాయి.
రమ్య కృష్ణ మాట్లాడుతూ ” మళ్ళీ ఛాన్స్ వస్తే నేను చేసిన ఐటమ్ సాంగ్స్ చేయాలని ఉందని అన్నది. ఇంకా బాహుబలి గురించి మాట్లాడుతూ ” శోబు గారు కాల్ చేసి 40 రోజులు అన్నారు. వామ్మో 40 రోజులు షూటింగ్ చేయాలా నా వల్ల కాదు సారీ అని ఫోన్ వెంటనే పెట్టేశాను. బిగ్ బడ్జెట్ ఫిల్మ్ అని అంతే తెలుసు. బిడ్డను పట్టుకుని అలా కూర్చుంటే అసలు నాకే అసలు రాజా మాత అని అనిపించింది. ఇదే నా మాట .. నా మాటే శాసనం ” అని డైలాగ్ చెప్పగానే అక్కడున్న వారు కూడా షాక్ అయ్యారు.
