Jupally Krishna Rao: రైతుల భూ సమస్యల పరిష్కారానికి తహసిల్దార్లు గ్రామాల్లోకి వెళ్లాలని, నవంబర్ 1 నుండి 30 వరకు గ్రామాల వారీగా భూ సమస్యల పరిష్కారం కోసం చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక, సాంస్కృతిక శాఖల, మంత్రి జూపల్లి కృష్ణారావు (Jupally Krishna Rao) అన్నారు. నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టరేట్ లో జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ జిల్లా ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్, జిల్లా అటవీ శాఖ అధికారి రోహిత్ గోపిడి, అచ్చంపేట, కల్వకుర్తి ఎమ్మెల్యేలు డాక్టర్ వంశీకృష్ణ, కసిరెడ్డి నారాయణరెడ్డిలతో కలిసి భూ భారతి రైతు సదస్సుల్లో వివిధ సమస్యలపై వచ్చిన దరఖాస్తుల పరిష్కారం, ప్రభుత్వ భూములు, అసైన్డ్ భూములు ఇనామ్ భూముల పరిష్కారం, రెవిన్యూ అంశాలపై ఆర్డీవోలు తాహసిల్దార్లు లతో మంత్రి జూపల్లి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు.
Also Read: Jupally Krishna Rao: పర్యాటకంలో సుస్థిర అభివృద్ధే లక్ష్యం.. మంత్రి జూపల్లి కీలక వ్యాఖ్యలు
రైతుల సంక్షేమానికి అధిక ప్రాధాన్యత
ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇచ్చేందుకే భూ భారతి చట్టాన్ని అమలులోకి తెచ్చినట్లు తెలిపారు. అందుకు అనుగుణంగా అధికారులు క్షేత్రస్థాయిలో పనిచేయకుంటే ప్రభుత్వంపై ప్రజలకు నమ్మకం పోతుందని, ప్రజలకు నమ్మకం పెంచేలా రెవెన్యూ అధికారులు సమస్యల పరిష్కారానికి అధిక ప్రాధాన్యత ఇచ్చి, ప్రతి సమస్యను పరిష్కారాలకు ప్రత్యేక చొరవ తీసుకోవాలని మంత్రి ఈ సందర్భంగా అధికారులు ఆదేశించారు. వాస్తవాలకు భిన్నంగా ఏ అధికారి ప్రవర్తించిన కఠిన చర్యలు తీసుకుంటామని, రైతులకు సమస్యల పరిష్కారానికి న్యాయపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.
8 గంటలకే గ్రామాల్లో సందర్శించి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలి
భూ భారతి చట్టం అమల్లోకి వచ్చి 6 మాసాలు పూర్తి కావస్తున్నా ప్రభుత్వం ఆశయాలకు అనుగుణంగా ఆశించిన స్థాయిలో రైతులకు పరిష్కారం అందలేదని, సమస్యల పరిష్కారానికి నాగర్ కర్నూలు జిల్లాలో ప్రత్యేకంగా రెవెన్యూ సమస్యల పరిష్కారానికి నవంబర్ 1వ తేదీ నుండి నవంబర్ 30వ తేదీ వరకు తహసిల్దార్లు ప్రతిరోజు ఉదయం 8 గంటలకే గ్రామాల్లో సందర్శించి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని మంత్రి ఆదేశించారు. రెవెన్యూ సదస్సుల్లో గ్రామాల్లోని దరఖాస్తుదారులకు ముందస్తు సమాచారం గా గ్రామాల్లో డప్పు చాటింపు, టాం టాం వేయించాలని, గ్రామంలోని మైకుల ద్వారా ముందస్తు సమాచారం అందజేయాలని, భూ సమస్యలపై వచ్చిన ప్రతి దరఖాస్తుదారుల ఫోన్ నెంబర్ ఆధారంగా వాట్సాప్ గ్రూపులను ఏర్పాటుచేసి ఏ గ్రామానికి ఎప్పుడు వస్తున్నాం అనే విషయాన్ని ప్రతి దరఖాస్తుదారునికి తెలియపరచి సమస్యల పరిష్కారానికి గ్రామస్థాయిలోనే పూర్తి చేయాలని ఆ విధమైన ప్రణాళికలు సిద్ధం చేసుకుని గ్రామాల్లో సందర్శించాలని మంత్రి ఆదేశించారు.
15 వ తేదీ నాటికి 50% దరఖాస్తులను పరిష్కరించాలి
వాస్తవాలకు భిన్నంగా రెవెన్యూ అధికారులు పనిచేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి సందర్భంగా హెచ్చరించారు. పేద ప్రజల న్యాయబద్ధమైన పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యతతో వ్యవహరించి సమస్యల పరిష్కారానికి అధికారులు కృషి చేయాలని మంత్రి సూచించారు. నవంబర్ 1వ తేదీ నుండి ఏ గ్రామంలో తాహసిల్దార్లు సందర్శిస్తారు అనే వివరాలను జిల్లాలోని నియోజకవర్గాల ఎమ్మెల్యేలకు ముందస్తు సమాచారాన్ని చేరవేయాలని మంత్రి సూచించారు. గ్రామస్థాయిలో రైతులతో నిర్వహించే సమావేశానికి స్థానిక పోలీసులు హాజరయ్యేలా చూడాలని, అక్కడ ఎలాంటి గొడవలు జరగకుండా చూడాలని జిల్లా ఎస్పీకి మంత్రి సూచించారు.
నవంబర్ 1వ తేదీ నుండి గ్రామాల్లో సందర్శించి రెవెన్యూ సదస్సులో వచ్చిన భూ సమస్యల పరిష్కారానికి పెండింగ్లో ఉన్న దరఖాస్తులను నవంబర్ 15 వ తేదీ నాటికి 50% దరఖాస్తులను పరిష్కరించాలని, నవంబర్ 30 నాటికి రెవెన్యూ సదస్సులో నిర్వహించిన అన్ని దరఖాస్తులను పెండింగ్లో లేకుండా శాశ్వత పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. కొల్లాపూర్, అచ్చంపేట నియోజకవర్గం పరిధిలోని అటవీ భూములు, దేవాదాయ భూముల పరిష్కారం కోసం రెవెన్యూ, నీటిపారుదల ,అటవీ శాఖల అధికారులతో మంత్రి కులంకషంగా చర్చించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు అమరేందర్ దేవ సహాయం ఆర్డీవో లు, తహసిల్దార్లు, తదితరులు పాల్గొన్నారు.
Also Read: Jupally Krishna Rao: అబద్దాలపై బతకడం కేటీఆర్‌కు అలవాటు.. మంత్రి జూపల్లి కీలక వ్యాఖ్యలు!
