YS Jagan Trolled: ఏపీలో పొలిటికల్ ట్రోలింగ్స్ ఏ స్థాయిలో ఉంటాయో కొత్తగా చెప్పే పనేమీలేదు. రాజకీయ నాయకుల పండుగల సెలబ్రేషన్ల నుంచి తినే తిండి వరకు, ఆఖరికి ధరించే దుస్తులపై సైతం ట్రోలింగ్ జరుగుతూనే ఉంటాయి. అధికార కూటమి పార్టీలకు చెందిన కూటమి సోషల్ మీడియా కార్యకర్తలు తాజాగా మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ధరించిన షూస్‌ను టార్గెట్ చేశారు. దీపావళి పర్వదినం సోమవారం నాడు వైఎస్ జగన్, తన సతీమణి వైఎస్ భారతితో కలిసి బెంగళూరులోని తమ నివాసంలో దివాళీ సెలబ్రేషన్ జరుపుకున్నారు. ఈ సందర్భంగా క్రాకర్స్ కూడా కాల్చారు. అందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు వైరల్ అయ్యాయి. ఇక్కడవరకు అంతా బాగానే ఉంది గానీ, క్రాకర్స్ కాల్చిన సందర్భంలో జగన్ వేసుకున్నది ‘లేడీస్ షూస్’ (YS Jagan Trolled) అని మీమ్స్ పేలుతున్నాయి.
ఏసిక్స్ షూస్
జగన్ ధరించిన షూస్‌ను పరిశీలించగా, అవి ఏసిక్స్ (ASICS) కంపెనీకి చెందినవిగా స్పష్టమవుతోంది. ఆయన ధరించినది స్పోర్ట్స్ లేదా క్యాజువల్ స్నీకర్స్ (Casual Sneakers) కేటగిరికి చెందినవిగా అర్థమవుతోంది. ఏసిక్స్ బ్రాండ్ ఉత్పత్తులు నాణ్యతతో పాటు సౌకర్యవంతంగా ఉంటాయి. జగన్ ధరించిన ఈ షూస్ ధర దాదాపు రూ.8 వేల నుంచి రూ.12 వేల వరకు ఉండవచ్చు. ఆన్‌లైన్‌లో డిస్కౌంట్లు, ఆఫర్లను బట్టి రేట్లు అటుఇటుగా మారుతుంటాయి.
Read Also – Draupadi Murmu: షాకింగ్… రాష్ట్రపతి ముర్ము హెలీకాప్టర్ ల్యాండవ్వగానే కుంగిన హెలీప్యాడ్.. తప్పిన పెనుప్రమాదం
నిజంగా మహిళల షూసేనా?
ఏసిక్స్ షూస్‌కు సంబంధించిన మరిన్ని వివరాలను ఆన్‌లైన్ సెర్చ్ చేయగా, జపాన్‌కు చెందిన ప్రముఖ స్పోర్ట్స్ వస్తువుల తయారీ కంపెనీ ‘ఏసిక్స్’ (ASICS) వీటిని విక్రయిస్తోంది. ప్రధానంగా రన్నింగ్ షూస్, ఇతర స్పోర్ట్స్ ఫుట్‌వేర్‌ను ఈ కంపెనీ తయారు చేస్తోంది. మరి, జగన్ ధరించింది నిజంగా లేడీస్ షూసేనా? అంటే దాదాపుగా కాదనే చెప్పాలి. ట్రోలింగ్ చేస్తున్న ఫొటోలపై ఉన్న ఏసిక్స్ జెల్ నింబస్ 26 ( ASICS GEL-NIMBUS 26) అనే కోడ్ ఒక మోడల్‌ను సూచిస్తుంది. ఈ మోడల్ షూస్ మగవాళ్లతో పాటు మహిళలకు కూడా వేర్వేరు సైజులలో మార్కెట్లలో లభిస్తాయి. పురుషుల వెర్షన్ షూస్ బ్లాక్, గ్రాఫైట్ గ్రే రంగుల్లో అందుబాటులో ఉంటాయి. ఇక, లేడీస్ వెర్షన్ కూడా అదే పేరుతో అందుబాటులో ఉంటుంది. ఇక, ప్రత్యేకంగా చెప్పాలంటే జగన్ ధరించిన నలుపు/గ్రాఫైట్ గ్రే వెర్షన్‌ను సాధారణంగా మెన్స్ కేటగిరిలోనే విక్రయిస్తుంటారు.
ట్రోలింగ్ అందుకేనా
జగన్ ధరించింది లేడీస్ షూస్ అని ట్రోలింగ్ చేయడానికి ప్రధాన కారణం, ఆ షూస్ డిజైన్ కారణం కావొచ్చు. కొన్ని యాంగిల్స్ నుంచి చూసినప్పుడు, లేదా ఫొటోల్లో గమనిస్తే డిజైన్ స్లిమ్ ఫిట్‌గా అనిపిస్తోంది. ఇలాంటి లక్షణాలు సాధారణంగా మహిళలు ధరించే రన్నింగ్, లేదా క్యాజువల్ షూస్‌ను పోలి ఉంటాయి. బహుశా, అందుకే ట్రోలింగ్ చేస్తున్నారేమో!. అధికార పక్ష పార్టీల సోషల్ మీడియా కార్యకర్తల ట్రోలింగ్‌కు వైసీపీ వాళ్లు కూడా కౌంటర్లు ఇస్తున్నాయి. అవి మెన్స్ ధరించేవేనని పోస్టులు పెడుతున్నారు. మెన్స్ అని ఉండాల్సిన చోట, ఉమెన్స్ అని మార్ఫింగ్ చేశారని వాదిస్తున్నారు.
ఏదేమైనా, రాజకీయ ట్రోలింగ్‌లో వ్యూహంలో షూస్ ఏంటి.. గతంలో వాటర్ బాటిల్స్, స్లిప్సర్స్‌పై కూడా తెగ డిబేట్లు, ట్రోలింగ్స్ నడిచిన విషయం తెలిసింద.
Read Also- BRS Social Media: బీఆర్ఎస్ సోషల్ మీడియా టార్చర్ చేస్తోంది.. చచ్చిపోతా.. ఆశాప్రియా వరుస ట్వీట్ల కలకలం
Dedicated to the meme pages run by the P….? batch
Akka chadvuko English rakapothe babu garini adugu#memesdaily #YSJagan #TDP #Janasena pic.twitter.com/rPPreI2yzB— RAVAN REDDY YSJ💙KURNOOL (@RavanReddy436) October 21, 2025
That's it, That's the Tweet 😍😍🤌🏻🥰 https://t.co/BL5ez0tlJV pic.twitter.com/FhapMKczhP
— Sandy Papa YSCRP 🇱🇸 (@PapalakeyPapa) October 21, 2025
షూ నుండి స్టార్ట్ చేసి పైన ఎండ్ చేయమని దీని ఆరాటం
ఎవరైనా కోరిక ఉంటే పిలుస్తుంది వెళ్ళండి#Ysjagan https://t.co/0KkYluVRTE— చిలకలూరిపేట వేటగాడు😎 (@CHILAKALURIPET_) October 22, 2025
