BRS Social Media: కొన్నాళ్లక్రితం వరకు బీఆర్ఎస్‌లో, ఆ పార్టీ సోషల్ మీడియా విభాగంలో క్రియాశీలకంగా పనిచేసి, ఆ పార్టీకి దూరమైన ఆశాప్రియ బుధవారం వరుస ట్వీట్లతో కలకలం రేపుతున్నారు. బీఆర్ఎస్ సోషల్ మీడియా (BRS Social Media) తనను వేధింపులకు గురిచేస్తోందని ఆమె ఆరోపిస్తున్నారు. సోషల్ మీడియాలో తననుంచి మళ్లీ పోస్టులు రాకుంటే చచ్చిపోయినట్టుగా భావించాలంటూ ఉదయాన్నే ఆమె వరుసగా ట్వీట్లు పెట్టారు. మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను ట్యాగ్ చేసి.. ‘‘ఏం మనిషిని నువ్వు. నీ మనుషులు ఏం మాట్లాడుతున్నారు నా గురించి. పార్టీలో ఉండే మహిళలతో నీకు సంబంధం ఉందని నాతో అన్నారు. నాతో కాల్ మాట్లాడిన సాక్ష్యాలు బయటపెట్టాలా ఏంటి?. ఏందీ వ్యక్తిత్వ హననం?. ఇవన్నీ ఎవరు చేపిస్తున్నారో నీకు తెలుసు. పిల్ల జమిందార్‌ని పక్కన నిలుచోబెట్టుకొని ఫొటోలు దిగుతున్నావ్.. అంటే నువ్వు ఎంకరేజ్ చేస్తున్నావనే కదా అర్థం’’ అంటూ ఆమె ఒక ట్వీట్‌లో పేర్కొన్నారు. సోషల్ మీడియాలో తనను విమర్శిస్తూ పెట్టిన కామెంట్ల స్క్రీన్ షాట్లను జత చేశారు. కేటీఆర్, కోణతం దిలీప్ వీరిద్దరూ ఇందుకు బాధ్యతలు అవుతారని ఆమె పేర్కొన్నారు.
Read Also- Jubilee Hills By Election: జూబ్లీహిల్స్ ఎన్నికల్లో భారీగా ఈవీఎం వాడకం.. ఎందుకో తెలుసా..!
వరుస ట్వీట్లు ఇవే
‘‘బీఆర్ఎస్ పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తే ఇలాంటి అరాచకాలే జరుగుతాయి. అధికారంలో లేనప్పుడే ఇంత నీచంగా చేస్తున్నారు. అధికారం ఉంటే ఇంకెంత నీచంగా చేస్తారు?. అధికారం కోసం తప్పుడు పనులు చేసే రకాన్ని కాదు నేను. అందుకే ఇన్ని హింసలు’’, ‘‘తెలంగాణ భవన్‌కు వస్తా కేటీఆర్ అన్న. లేదంటే నందినగర్, లేకుంటే జూబ్లీహిల్స్ వచ్చి ఏదో ఒకటి తేల్చుకుంటా’’ అని పోస్టులు పెట్టారు. అంతటితో కూడా ఆగడలేదు. ‘‘నా నుంచి ఇంకొన్ని గంటల్లో ఎలాంటి పోస్ట్ రాకుంటే చచ్చిపోయానని అర్థం. ఆధారాలు నా వాట్సప్ సెల్ఫ్ చాట్‌లో ఉంటాయి. వెనుక నుంచి ఎవరు చేయిస్తున్నారనే దానికి అక్కడ సమాధానం దొరుకుతుంది. అదే నా మరణ వాంగ్మూలం. ఇప్పుడు పోయి కేసు పెట్టినా ఈ బీఆర్ఎస్ పార్టీ హైకోర్టుకు వెళ్లి బెయిల్ తెస్తది. ఒకడు నన్ను ప్రశాంతంగా బతకనీయడు. నా చావుకు కారణం పీజేఎంఆర్, హెచ్ఎస్, కేటీఆర్’’ అని పేర్లను కూడా ప్రస్తావించింది.
Read Also- Mahesh Kumar Goud: టీజేఎస్ మద్దతు కోరుతూ టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ లేఖ
‘‘నా గురించి చాలా తప్పుగా రాశారు అన్నా. ఏం చేశానని బీఆర్ఎస్ సోషల్ మీడియా వాళ్లు ఇలా చేస్తున్నారు. ఎవరు ఎవరి క్యారక్టర్‌ను హననం చేసిండ్రు. నేను కృష్ణుడిని ఆరాధిస్తాను’’ అని మరో ట్వీట్‌లో పేర్కొన్నారు. ‘‘కేటీఆర్ అన్న.. నాకు, పీజేఆర్‌కి మధ్య ఉన్న పంచాయితీని నువ్వు తుంచెయ్. లేకుంటే ఆశ శవాన్ని చూస్తావు. అప్పుడు సెలబ్రేషన్ చేసుకో అన్న. డీప్ డిప్రెషన్ వల్ల మెడిసిన్ వాడితే నన్ను పిచ్చిదానికి చిత్రీకరించారు. తలనొప్పితో మెడిసిన్ వాడుతున్నాను. దీనికి కూడా పిచ్చి అనిపిస్తున్నాడు ఒకడు’’ అని కొందరు పెట్టిన కామెంట్లకు రిప్లైలు ఇచ్చింది.
పోలీసుల్ని పంపించి ఆపారు
‘‘పోలీసులను పంపించి ఇప్పటికి ఆపగలిగారు. చినిపోవాలంటే చాలా మార్గాలు ఉన్నాయి. బీఆర్ఎస్ సోషల్ మీడియా నన్ను టార్చర్ పెడుతోంది. ఆ వెధవల్ని పోలీసులు నాలుగు తంతే, జగన్నాటక సూత్రధారి పేరు బయటకు వస్తది. నేను చచ్చిపోయి అయినా నువ్వేంటే అందరికీ నిరూపిస్తా. పోలీస్ శాఖ సీరియస్‌గా పట్టించుకుంటే ఈ రోజు నోరు తెరిచేవాళ్లు కాదు. నన్ను టార్గెట్ చేయడం ఆపట్లేదు. పోలీసులు పట్టించుకోవడం లేదు. దయచేసి నా సమస్యను రాజకీయాలకు వాడుకోకండి దండం పెడతా’’ అంటూ బుధవారం మధ్యాహ్నం 12.30 గంటల వరకు ఆమె వరుసగా ట్వీట్లు చేస్తూనే ఉన్నారు’’ అని మరిన్ని పోస్టుల్లో ఆమె పేర్కొంది. ఈ ట్వీట్లపై బీఆర్ఎస్ పార్టీ, లేదా కేటీఆర్ స్పందిస్తారా? లేదా అనేది చూడాలి.
