Jubilee Hills By Election: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు ఎక్కువ సంఖ్యలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ల(Electronic voting machines)ను వినియోగించే అవకాశమున్నది. పోటీ చేసే అభ్యర్థుల సంఖ్య 60 దాటితే బ్యాలెట్ పేపర్ వినియోగించాల్సి వస్తుందన్న ప్రచారాన్ని జిల్లా ఎన్నికల అధికారులు తోసిపుచ్చారు. ప్రధాన పోటీ అధికార, విపక్ష పార్టీల మధ్యనే ఉంటుందన్న ప్రచారం జరుగుతున్నా, ఎంతమంది అభ్యర్థులు బరిలో ఉంటారన్నది ఆసక్తికరంగా మారింది.
బడా బాబులకు మేలు చేసేలా..
ఇప్పటి వరకు కొందరు స్వతంత్ర అభ్యర్థులు ట్రిపుల్ ఆర్ భూ బాధితుల తరఫున నామినేషన్లను దాఖలు చేశామని, ఇష్టారాజ్యంగా జరుగుతున్న అలైన్ మెంట్ కేవలం బడా బాబులకు మేలు చేసేలా జరుగుతున్నదని అంటున్నారు. ఫార్మాసిటీ, ట్రిపుల్ ఆర్ భూ బాధితులకు మద్దతుగానే గాక, సుమారు వందకు పైగా స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. నేటి నుంచి పరిశీలన ప్రక్రియ ఉంటుంది. ఇక్కడి నుంచే అసలు కథ మొదలువుతుంది. దాఖలైన నామినేషన్లలో విత్ డ్రా అయ్యే అవకాశాలు తక్కువగా ఉన్నా, టెక్నికల్ లోపాలతో ఎక్కువ రిజెక్ట్ అయ్యే అవకాశాలున్నట్లు సమాచారం.
Also Read: Bhatti Vikramarka: ఖమ్మం జిల్లా పర్యటనలో డిప్యూటీ సీఎం భట్టి కీలక వ్యాఖ్యలు
బరిలో ఎంతమంది ఉన్నా.. ఈవీఎంలే
అభ్యర్థుల సంఖ్య పెరిగితే బ్యాలెట్ పేపర్లను వినియోగించాలన్న నిబంధన ఉన్నట్టు జరుగుతున్న ప్రచారాన్ని ఎన్నికల వింగ్ అధికారులు కొట్టేశారు. బరిలో ఎంత మంది అభ్యర్థులున్నా, ఈవీఎం(EVM)లతోనే ఎన్నిక నిర్వహణ ఉంటుందని, ఈసారి బ్యాలెట్‌లో అభ్యర్థి పేరుతో పాటు కలర్ ఫొటో(Color Photo)ను డిస్ ప్లే చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు. ఒక్కో ఈవీఎం మిషన్‌లో 16 మంది అభ్యర్థులను పొందుపర్చే ఛాన్స్ ఉన్నదని, ఇలా ఎంతమంది అభ్యర్థులు బరిలో ఉన్నా, వారందరి వివరాలను పొందుపరిచేందుకు అవసరమైన సంఖ్యలో ఈవీఎంలను వినియోగిస్తామని అధికారులు పేర్కొంటున్నారు. ప్రతి నాలుగు ఈవీఎంలకు ఓ బ్యాటరీ ఉంటుందని, అభ్యర్థుల సంఖ్యకు తగిన విధంగా ఈవీఎంల సంఖ్య, బ్యాటరీల సంఖ్యను పెంచి ఎన్నికల ప్రక్రియను నిర్వహించేందుకు ఎలక్షన్ వింగ్ సన్నాహాలు చేస్తున్నది.
Also Read: Water Car: అన్‌బిలీవబుల్.. నీళ్లతో నడిచే కారు కనిపెట్టిన ఇరాన్ శాస్త్రవేత్త!.. వీడియో ఇదిగో
