Bhatti Vikramarka: విద్యపై రాజీలేదు
అంతర్జాతీయ ప్రమాణాలతో అందిస్తాం
నాణ్యమైన విద్యను అందించడమే మా లక్ష్యం
ఖమ్మం జిల్లా బోనకల్‌లో యంగ్ ఇండియా స్కూల్ నిర్మాణ పనుల పరిశీలన
ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు
ఖమ్మం, మహబూబాబాద్, స్వేచ్ఛ: ‘విద్య అనేది భవిష్యత్తు తరాలకు మనం అందించే ఒక అతిపెద్ద ఆస్తి’ అని రాష్ట్ర డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు వ్యాఖ్యానించారు. తెలంగాణ బిడ్డలకు అంతర్జాతీయ స్థాయిలో నాణ్యమైన విద్యను అందించాలన్న సంకల్పంతో ప్రజా ప్రభుత్వం ఇంటిగ్రేటెడ్ పాఠశాలలకు శ్రీకారం చుట్టిందన్నారు. విద్య విషయంలో ప్రజా ప్రభుత్వం ఎక్కడా రాజీ పడబోదని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు. మధిర నియోజకవర్గం బోనకల్లు మండలం లక్ష్మీపురం గ్రామంలో నిర్మాణ దశలో ఉన్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్‌నుభట్టి విక్రమార్క మల్లు (Bhatti Vikramarka) ఆదివారం పరిశీలించారు. నిర్మాణంలో ఎక్కడా రాజీ పడవద్దని ఈ సందర్భంగా అధికారులకు ఆయన సూచించారు. యంగ్ ఇండియా స్కూల్‌ను అనుసంధానం చేస్తూ నిర్మించే రహదారులపై అధికారులతో ఉప ముఖ్యమంత్రి చర్చించారు.
Read Also- Maoist Surrender: అక్టోబర్ 20 వ తేదీన తెలంగాణ ప్రాంతానికి చెందిన మావోయిస్టుల భారీ లొంగుబాటు
యంగ్ ఇండియా స్కూల్ కోసం సూచించిన ప్లాన్ ప్రకారం నిర్మాణాలు జరగాలని అన్ని వసతులతో కూడిన సౌకర్యాలను ఏర్పాటు చేయాలన్నారు. నిర్మాణం కోసం ఉపయోగించే మెటీరియల్ విషయంలో కూడా ఎక్కడ రాజీ పడొద్దని చెప్పారు. నిర్మాణ పనుల్లో మరింత వేగాన్ని పెంచాలని అందుకు అవసరమైన కూలీలను వెంటనే ఏర్పాటు చేసుకోవాలని గుత్తేదారులకు సూచించారు.
యంగ్ ఇండియా స్కూల్ నిర్మాణ దశలో ఉన్న పునాదులను దగ్గరుండి పరిశీలన చేశారు. ఈ సందర్భంగా యంగ్ ఇండియా స్కూల్ కన్ స్ట్రక్షన్ ప్లాన్ ని పరిశీలన చేశారు. నిర్మాణ దశలో ఉన్న పాఠశాల ప్రాంగణాన్ని కలిగి తిరుగుతూ అధికారులతో కలిసి పరిశీలన చేశారు.
Read Also- Constable Murder Case: కానిస్టేబుల్ హత్య కేసులో వీడిన సస్పెన్స్.. దొరికిన నిందితుడు రియాజ్
