Mahesh Kumar Goud (imagecredit:twitter)
తెలంగాణ, హైదరాబాద్

Mahesh Kumar Goud: టీజేఎస్‌ మద్దతు కోరుతూ టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ లేఖ

Mahesh Kumar Goud: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో మద్దతు ఇవ్వాలని జనసమితి(Janasamithi) వ్యవస్థాపక అధ్యక్షుడు కోదండరామ్‌(Kodandaram)కు పీసీసీ చీఫ్​ మహేశ్​ కుమార్ గౌడ్(PCC Mahesh kumara Goud) లేఖ రాశారు. ఇప్పటికే ఎంఐఎం(MIM), సీపీఎం(CPM), సీపీఐ(CPI) పార్టీలు సపోర్ట్ చేశాయని వెల్లడించారు. కాంగ్రెస్(Congress) అభ్​యర్థి నవీన్ యాదవ్(Naveen Yadav) విజయానికి దోహదపడాలని కోరారు. ప్రజా పాలనలో అన్ని వర్గాలు క్షేమంగా, సంతోషంగా ఉన్నాయని వివరించారు. అందుకే మద్దతు ఇవ్వాలని కోరారు.

మహేశ్ గౌడ్ స్ట్రాంగ్ కౌంటర్.. 

ఇక, ఏఐసీసీ(AICC)పై కేటీఆర్(KTR) చేసిన ఆరోపణలపై మహేశ్ గౌడ్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. కేటీఆర్ చేసిన ‘ఆల్ ఇండియా కరప్షన్ కమిటీ(All India Corruption Committee) ’వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ఆయన ముందుగా తమ కుటుంబ అవినీతి చరిత్రను ఆకళింపు చేసిన తర్వాతనే నీతులు చెప్పాలని నొక్కి చెప్పారు. కేటీఆర్(KTR) అవినీతి గురించి మాట్లాడడం అంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్టే అవుతుందని ఎద్దేవా చేశారు. కల్వకుంట్ల కుటుంబానికి అవినీతికి అవినాభావ సంబంధం ఉన్నదని అన్నారు.

Also Read: Telangana Tourism: తెలంగాణ పర్యాటక రంగం కొత్త వ్యూహం.. బుద్ధవనానికి ఇంటర్నేషనల్ లుక్

భ్రష్టాచార రక్షణ సమితి.. 

దేశంలోనే అత్యంత ఖరీదైన, అవినీతి ప్రాజెక్టుగా నిలిచిన కాళేశ్వరం(Kaleshwaram) నుంచి ఫార్ములా రేస్, మద్యం, భూ స్కాముల(Land Scam) వరకు ప్రతి అవినీతి దోపిడీ వెనుక కేసీఆర్(KCR) కుటుంబ సభ్యుల హస్తం ఉన్నదని తీవ్రంగా విమర్శించారు. కేటీఆర్ సోదరి కవిత(Kavitha) స్వయంగా గతంలో కేసీఆర్ పడ్డ కష్టాల గురించి వివరించారని గుర్తు చేశారు. వేల కోట్లకు ఎలా ఎదిగారు అంటూ ప్రశ్నించారు. అలాంటి మీరు దళిత నాయకుడు నడిపిస్తున్న పార్టీని విమర్శించడం సిగ్గుచేటని కేటీఆర్‌పై మండిపడ్డారు. బీఆర్ఎస్(BRS) అంటే భ్​రష్టాచార రక్షణ సమితి అంటూ మహేశ్ గౌడ్ విమర్శించారు.

Also Read: Ponguleti Srinivasa Reddy: గ‌త ప్రభుత్వం చేసిన తప్పులు సరిదిద్దుతున్నాం: మంత్రి పొంగులేటి

Just In

01

Minister Konda Surekha: స్వేచ్ఛ ఎఫెక్ట్.. దేవాదాయశాఖపై మంత్రి కొండా సురేఖ సమీక్ష!

Rashmika Mandanna: సౌత్ ఇండియాలో రష్మికా మందాన టాప్ హీరోయిన్ ఎలా అయ్యారో తెలుసా.. రీజన్ ఇదే..

Election Commission: జూబ్లీహిల్స్‌లో సోదాలు ముమ్మరం.. అభ్యర్థుల వెనక షాడో టీమ్‌లు

Intermediate Exams: ఈసారి ఇంటర్ పరీక్షలు యథాతథం.. వచ్చే సంవత్సరం నుంచి మార్పులు

Satish Shah passes away: ప్రముఖ వెటరన్ నటుడు సతీశ్ షా కన్నుమూత..