Ponguleti Srinivasa Reddy: దశాబ్దాల తరబడి తీవ్ర అసంతృప్తితో ఉన్న తెలంగాణ రైతాంగానికి లైసెన్స్‌డ్ సర్వేయర్ల నియామకం రూపంలో రాష్ట్ర ప్రభుత్వం దీపావళి కానుకను అందించిందని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి(Ponguleti Srinivass Reddy) పేర్కొన్నారు. శిల్పకళావేదికలో సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ముఖ్యఅతిథిగా హాజరై శిక్షణ పొందిన సర్వేయర్లకు లైసెన్స్‌లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి పొంగులేటి అధ్యక్షత వహించి ప్రసంగించారు.
సర్వే వ్యవస్థ పటిష్టం..
గత ప్రభుత్వం ‘ధరణి’ పేరిట చేసిన తప్పులను తమ ప్రభుత్వం సరిదిద్దే కార్యక్రమాన్ని చేపట్టిందని, దీనిలో భాగంగా 3,456 మందికి లైసెన్స్‌లు మంజూరు చేశామన్నారు. ముఖ్యమంత్రి ఆలోచనల మేరకు నిరుద్యోగ యువతను దృష్టిలోపెట్టుకొని రెవెన్యూలో భాగమైన సర్వే వ్యవస్థను పటిష్టం చేసేందుకు దరఖాస్తులను ఆహ్వానించామన్నారు. బీసీ(BC), ఈబీసీ(EBC), ఎస్సీ(SC), ఎస్టీ(ST) తదితరాలకు చెందిన 10వేల మంది దరఖాస్తు చేసుకోగా ఏడువేల మందికి శిక్షణ ఇచ్చామన్నారు. వీరిలో 3,456 మంది క్షేత్రస్ధాయిలో తర్ఫీదు పొంది ఎంపికయ్యారన్నారు.
Also Read: Maoists Letter: బిగ్ బ్రేకింగ్ న్యూస్.. మరో సంచలన లేఖను విడుదల చేసిన మావోయిస్టులు
సాదాబైనామాల విషయంలో..
గతంలో జీపీవో(GPO) వ్యవస్థ, భూభారతి, సాదాబైనామాల తదితరాల విషయంలో అలక్ష్యం జరగడం వల్ల సుమారు 9.80 లక్షల దరఖాస్తులు వచ్చాయని, వీటిని తమ ప్రజా ప్రభుత్వం దశలవారీగా పరిష్కరిస్తోందని మంత్రి తెలిపారు. చిన్న అవకతవకలు జరగకుండా, ప్రజలకు వ్యతిరేకంగా పనిచేయకుండా, ప్రజా, ప్రభుత్వ ఆలోచనలకు అనుగుణంగా చిత్తశుద్దితో పనిచేయాలని పొంగులేటి సర్వేయర్లను కోరారు. లైసెన్స్‌లు పొంది సంతోషించినట్లే ప్రజలను కూడా మీ పనులతో సంతోషించేలా చేయాలని, తద్వారా ప్రభుత్వానికి పేరు తీసుకురావాలని కోరుతూ లైసెన్స్‌డ్ సర్వేయర్లతో మంత్రి ప్రతిజ్ఞ చేయించారు.
Also Read: CM Revanth Reddy: గుడ్ న్యూస్.. త్వరలో గ్రూప్ 3, 4 ఉద్యోగాలు భర్తీ: సీఎం రేవంత్ రెడ్డి
