Maoists Letter: మావోయిస్టులు మరో లేఖను విడుదల చేశారు. మావోయిస్టులు రోజుకో కొత్త రకమైన చర్యతో ఇప్పటికీ విభేదిస్తూ వస్తున్న మరో వర్గం మావోయిస్టులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నారు. గడ్చిరోలి, బస్తర్, కాంకేర్, అబూజ్ మడ్, నార్త్ బస్తర్ కు చెందిన మావోయిస్టులు ఆశన్నతో పాటు 210 మంది చతిస్గడ్ సీఎం విష్ణుదేవ్ సాయి(CM Vishnu Dev Sai) ఎదుట లోని పోయారు. ఆ తర్వాత, మావోయిస్టులు ఇప్పుడు గరియాబంద్‌లో సాయుధ కాల్పుల విరమణ ప్రకటించారు. నక్సలైట్లు కాల్పుల విరమణ ప్రకటించాలని నిర్ణయించుకున్నారు. ఉదంటి ఏరియా కమిటీకి చెందిన సునీల్(Snil) ఒక లేఖ రాశారు. ఇతర నక్సలైట్లకు విజ్ఞప్తి చేశారు. దీనిలో సాయుధ పోరాటాన్ని ముగించడం గురించి రాశారు.
మనల్ని మనం రక్షించుకోవాలి..
సాయుధ పోరాటానికి అనుకూలంగా లేని పరిస్థితుల గురించి రాశారు. ముందుగా మనల్ని మనం రక్షించుకోవడం గురించి రాశారు. నక్సలైట్ సునీల్ మనం చాలా మంది ముఖ్యమైన సహచరులను కోల్పోయాము అని రాశారు. కాబట్టి ఇప్పుడు, సోను దాదా(Sonu Dada) మరియు రూపేష్(Rupesh) నిర్ణయాన్ని సమర్ధిస్తూ, అతను తన మొత్తం బృందాన్ని ఆయుధాలతో తీసుకువచ్చాడు. 20వ తేదీ మధ్యాహ్నం 12:30 గంటలకు సెట్‌లో కలుస్తానని హామీ ఇచ్చారు. పోలీసులు లేఖను పరిశీలిస్తున్నారు.
Also Read: Harish Rao: పంచాయతీలు పెంచుకోవడానికే క్యాబినెట్ మీటింగ్: హరీష్ రావు
తుపాకులు మాత్రమే వదిలిపెట్టాం..
తుపాకులు మాత్రమే వదిలిపెట్టాం. ప్రజలను వదిలిపెట్టలేదు. ప్రజా పోరాటాలను వదిలిపెట్టలేదు. మావోయిస్టుల లక్ష్యం కోసం అహర్నిశలు కృషి చేస్తా. మేము భయపడలేదు. త్యాగాలకు వెరవలేదు. భవిష్యత్తులో మా కార్యాచరణను మీరే చూస్తారు. ప్రస్తుత పరిస్థితుల్లో మావోయిస్టుల స్థితిగతుల నేపథ్యంలో ఆయుధాలను విడిచి పెట్టాల్సి వచ్చింది. ప్రజలందరికీ మావోయిస్టుల గురించి తెలుసు. మావోయిస్టుల మధ్య జరుగుతున్న పరిణామాలు నేపథ్యాన్ని ప్రజలు అర్థం చేసుకుంటారని భావిస్తున్నాం. ప్రజలతోటే ఉంటాం. ప్రజల కోసం పోరాటాలు సాగిస్తూనే ఉంటాం. అందరం కలిసే నిర్ణయం తీసుకునే పరిస్థితి వచ్చింది. కానీ కొంతమంది విభేదిస్తూ వస్తున్నారు. మల్లోజుల వేణుగోపాలరావు సహా మేమంతా కలిసి తీసుకున్న నిర్ణయమే ఆయుధాల విరమణ. ఆయుధాలకు విరమణ నేపథ్యంలో తెలంగాణకు వచ్చే అవకాశాలపై ప్రయత్నం చేస్తానని ఆశన్న వివరించారు.
Also Read: Jubilee Hills By Election: బిగ్ బ్రేకింగ్ న్యూస్.. నవంబర్ 11న గవర్నమెంట్ హలీడే.. ఎందుకో తెలుసా..!
