Mahabubabad District ( IMAGE credit; swetcha reporter)
నార్త్ తెలంగాణ

Mahabubabad District: ఆ పట్టణ కేంద్రంలో వరుస ప్రమాదాలు.. అధికారుల నిర్లక్ష్యమే కారణమా?

Mahabubabad District:  మహబూబాబాద్ జిల్లా తొర్రూరు ( పట్టణంలో  తెల్లవారుజామున భారీ ప్రమాదం సంభవించింది. గ్రానైట్ రాళ్లను అధిక లోడ్‌తో తరలిస్తున్న లారీ బస్టాండ్ సమీపంలో అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టి బోల్తా పడింది. ఈ ఘటనలో లారీ పూర్తిగా ధ్వంసమవగా, డ్రైవర్, క్లీనర్ తీవ్ర గాయాలతో ప్రాణాపాయ స్థితిలో బయటపడ్డారు.ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు తక్షణమే ఘటనాస్థలానికి చేరుకుని ట్రాఫిక్‌ను నియంత్రించారు.

Also Read:Mahabubabad District: రెచ్చిపోతున్న గంజాయి బ్యాచ్.. అధికారుల నిర్లక్ష్యమా.. అక్రమ వ్యాపారుల చాకచక్యమా..

దీపావళి పండుగ వేళ, అదే రోజు పోలీసు అమరవీరుల దినోత్సవం

భారీ గ్రానైట్ రాళ్లు జాతీయ రహదారిపై చెల్లాచెదురుగా పడటంతో వాహన రాకపోకలు నిలిచిపోయాయి. అనంతరం జూమిలియన్ కంపెనీకి చెందిన క్యూ వై-80వీ అనే 80 టన్నుల సామర్థ్యమున్న క్రేన్ సహాయంతో బండరాళ్లను తొలగించే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. దీపావళి పండుగ వేళ, అదే రోజు పోలీసు అమరవీరుల దినోత్సవం కావడంతో ట్రాఫిక్ క్లియర్ చేయడంలో పోలీసులు క్షణం కూడా విశ్రాంతి తీసుకోకుండా శ్రమిస్తున్నారు. వారిని చూసి పట్టణ ప్రజలు అభినందనలు తెలిపారు. ప్రాథమిక సమాచారం ప్రకారం డ్రైవర్ మద్యం తాగడం, నిద్రమత్తే ప్రమాదానికి కారణమని పోలీసులు స్థానికులు నిర్ధారించారు.

అధికారులు పర్యవేక్షణలో నిర్లక్ష్యం

అయితే, పరిమితికి మించి లోడ్‌తో గ్రానైట్ రాళ్లను తరలిస్తున్న లారీలు నిర్లక్ష్యంగా రోడ్లపై సంచరించడం ప్రజల్లో ఆందోళన రేకెత్తిస్తోంది. సంబంధిత అధికారులు పర్యవేక్షణలో నిర్లక్ష్యం వహించడం ఈ ప్రమాదానికి ప్రధాన కారణమని స్థానికులు ఆరోపిస్తున్నారు. తొర్రూరు పట్టణం డివిజన్ కేంద్రంగా ఉండటంతో పగటి పూట వందల సంఖ్యలో ప్రజలు రాకపోకలు సాగిస్తుంటారు. ఈ ప్రమాదం పగటి వేళ జరిగి ఉంటే ప్రాణ నష్టం తప్పేదే కాదని పలువురు తెలిపారు. అదృష్టవశాత్తు ఎటువంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో పట్టణ ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.

Also Read: Mahabubabad District: నేడు సెలవు అయినా.. ఆగని యూరియా పంపిణీ.. ఎక్కడంటే..?

Just In

01

Huzurabad Gurukulam: గురుకులంలో విద్యార్థులకు టార్చర్?.. ప్రిన్సిపాల్, ఓ పోలీస్ ఏం చేశారంటే?

Sujeeth Birthday: సుజీత్ బర్త్‌డే.. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ ట్వీట్ చూశారా?

Bottu Gambling: చిత్తు-బొత్తు ఆడుతున్న ఏడుగురి అరెస్ట్.. ఎంత డబ్బు దొరికిందంటే?

Mega Jathara: అసలైన మెగా జాతర సంక్రాంతి నుంచి మొదలు కాబోతోంది.. మెగా నామ సంవత్సరం!

Pak Targets Salman: సల్మాన్ ఖాన్‌పై పగబట్టిన పాకిస్థాన్.. ఉగ్రవాదిగా ముద్ర వేసేందుకు భారీ కుట్ర!