Gadwal News: ఈసారి మద్యం షాప్‌ల ఏర్పాటుకు ఆశించిన మేర దరఖాస్తులు రావడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం ఖజానా నింపుకోవడానికి రెండు నెలల ముందే మద్యం దుకాణాల టెండర్లకు దరఖాస్తులను స్వీకరిస్తున్నది. గతంలో ఉన్న టెండర్ లైసెన్స్‌ల గడువు ముగియక ముందే నోటిఫికేషన్‌ను జారీచేసి దరఖాస్తులు స్వీకరించింది. ఎక్కువ దరఖాస్తులు వస్తే భారీగా ఆదాయం వస్తుందని ప్రభుత్వం అంచనా వేసింది. కానీ, ఆశించిన స్థాయిలో స్పందన రావడం లేదు. గతంలో ఉన్న రూ.2 లక్షల టెండర్ ఫీజును ప్రస్తుతం రూ.3 లక్షల ఫీజుకు(నాన్ రీఫండబుల్)పెంచింది. దీంతో వ్యాపారుల నుంచి స్పందన కరువైంది చెప్పుకోవచ్చు.
ముగిసిన మద్యం టెండర్లు
తెలంగాణలో మద్యం షాపుల దరఖాస్తులకు గడువు శనివారంతో ముగిసింది. జోగుళాంబ గద్వాల జిల్లా(Jogulamba Gadwal District)లో మొత్తం 34 మద్యం దుకాణాలకు చివరి రోజు భారీగా టెండర్లు దాఖలయ్యాయి. మద్యం దుకాణాల దరఖాస్తులకు శనివారం చివరి రోజు కావడంతో దరఖాస్తుదారుల నుంచి భారీ స్పందన వచ్చింది. శుక్రవారం వరకు జిల్లా వ్యాప్తంగా ఉన్న మొత్తం 34 మద్యం దుకాణాలకు 467 దరఖాస్తులు వచ్చాయి. చివరి రోజు ఏకంగా 256 దరఖాస్తులు అందాయని జిల్లా ఎక్సైజ్ శాఖ అధికారులు తెలిపారు. దీంతో మద్యం టెండర్ల ప్రక్రియ ముగిసింది. ఈనెల 23న డ్రా ద్వారా వైన్ షాపులకు లైసెన్స్ లు ఇవ్వనున్నట్లు జిల్లా ఎక్సైజ్ శాఖ అధికారులు తెలిపారు.
Also Read: Karimnagar Crime: కత్తి సురేష్ హత్య.. కూరలో వయాగ్రా టాబ్లెట్స్ కలిపిన భార్య.. ఆపై ఉరేసి ఘాతుకం
భారీగా తగ్గిన దరఖాస్తులు
అయితే రాష్ట్ర వ్యాప్తంగా మద్యం టెండర్లకు అనూహ్యంగా స్పందన తగ్గినట్లు తెలుస్తోంది. గతంలో(2023-2025) జోగుళాంబ గద్వాల జిల్లా వ్యాప్తంగా 36 మద్యం దుకాణాలకు గాను 1179 దరఖాస్తు టెండర్లు దాఖలయ్యాయి. ఈసారి 2025-2027 సంవత్సరానికి జిల్లాలో మొత్తం 34 మద్యం దుకాణాలకు టెండర్లు ఆహ్వానించగా సుమారు 723 దరఖాస్తులు అందాయి. ఆశించిన స్థాయిలో దరఖాస్తులు అందలేదు. దరఖాస్తుల గడువు చివరి రోజున ఆశించిన స్థాయిలో స్పందన రాకపోవడంతో ఎక్సైజ్ శాఖ అధికారులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. దీని కోసం దరఖాస్తులు పెంచేందుకు గాను.. గతంలో లైసెన్సులు పొందిన వారికి స్వయంగా సందేశాలు పంపి మరీ దరఖాస్తు చేసుకోవాలని అధికారులు కోరినట్లు తెలుస్తోంది. జోగుళాంబ గద్వాల జిల్లా సరిహద్దు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మెరుగైన మద్యం పాలసీతో పాటు అన్ని రకాల మద్యం బ్రాండ్ అందుబాటులో తీసుకరావడంతో గద్వాల జిల్లాలో మద్యం దుకాణాలకు తక్కువ స్థాయిలో అందినట్లు తెలుస్తోంది. దీనికి తోడు టెండర్ లో పాల్గొన్నడానికి రూ.3లక్షలు చలాన్ కూడా ఒక్కింత కారణమని చెప్పొచ్చు.
Also Read: Kavitha: బీసీ రిజర్వేషన్లపై చట్టం చేసేవరకు జాగృతి పోరాటం చేస్తాం.. కవిత స్పష్టం!
