TG Liquor Tenders (imagecredit:twitter)
నార్త్ తెలంగాణ

TG Liquor Tenders: గతంతో పోలిస్తే ఈసారి తక్కువగా మద్యం టెండర్లు.. కారణం అదేనా..!

TG Liquor Tenders: ఎక్సైజ్ శాఖకు టెండర్ దాఖలు చేసే మద్యం వ్యాపారులు ఈసారి షాక్ ఇచ్చారు. ఇప్పటివరకు కొనసాగిన మద్యం నోటిఫికేషన్(Alcohol notification) టెండర్ దాఖలులలో ఎప్పుడూ కూడా దరఖాస్తులు తగ్గలేదు. ప్రభుత్వ ఖజానాకు ఆదాయం తగ్గలేదు. కానీ, ఈసారి మద్యం వ్యాపారులు దరఖాస్తులు వేసేందుకు సరైన మక్కువ చూపలేదు. గత నెల 26వ తేదీ నుంచి దరఖాస్తుల స్వీకరణ మొదలైనప్పటికీ చివరి మూడు రోజులు మాత్రమే ఎక్సైజ్ అధికారులు ఆశించిన మేర దరఖాస్తులు టెండర్ల కోసం వచ్చాయి. విచిత్రం ఏంటంటే శుక్రవారం రోజు పడిన దరఖాస్తులు చివరి రోజు కూడా కొంత మెరుగ్గానే దరఖాస్తులు వచ్చినప్పటికీ మందకోడిగా పరిస్థితి ఎక్సైజ్ టెండర్ల చరిత్రలోనే మొదటిసారి అని అధికారులు చెబుతున్నారు.

చివరి రోజు టార్గెట్..

మద్యం టెండర్లకు ఎక్సైజ్ శాఖ నుంచి నోటిఫికేషన్ జారీ అయినప్పటి నుంచి చివరి తేదీ 18 వరకు దాదాపు 24 రోజులు ఉన్నప్పటికీ మద్యం వ్యాపారులు దరఖాస్తులు వేసేందుకు ఆసక్తి చూపలేదు. గత నెల 26వ తేదీ నుంచి చివరి మూడు రోజుల వరకు 353 దరఖాస్తులు మాత్రమే వచ్చాయి. గురువారం 185 దరఖాస్తులు వచ్చాయి. శుక్రవారం 584, ఇక చివరి రోజు కేవలం 735 దరఖాస్తులు మాత్రమే వచ్చి మద్యం టెండర్ల లో ప్రభుత్వానికి నిరాశ మిగిల్చాయి.

Also Read: Jubilee Hills Bypoll: నామినేషన్ సమర్పించిన అధికార కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి

2023-25 ఎక్సైజ్ టెండర్ లో 2589.. 2025-27 టెండర్లలో 1672 మాత్రమే..

2023-25 ఎక్సైజ్ టెండర్ లలో మహబూబాబాద్ జిల్లాలోని 61 మద్యం షాపులకు 2589 దరఖాస్తులు అందాయి. దీంతో అప్పటి ప్రభుత్వానికి రూ. 51 కోట్ల 78 లక్షల ఆదాయం సమకూరింది. 2025-27 ఎక్సైజ్ టెండర్ లలో కేవలం 1672 దరఖాస్తులు మాత్రమే వచ్చి ప్రభుత్వానికి నిరాశ మిగిల్చింది. రూ. 50 కోట్ల 16 లక్షల ఆదాయం మాత్రమే సమకూరింది. 2023-25 ఎక్సైజ్ సంవత్సరానికి అప్పటి అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అధిక దరఖాస్తులు అందాయి. మద్యం వ్యాపారులు సైతం అసెంబ్లీ ఎన్నికల నేపథ్యాన్ని దృష్టిలో ఉంచుకొని అత్యధికంగా టెండర్లు దాఖలు చేసేందుకు ఉత్సాహం చూపారు. మద్యం వ్యాపారులు అనుకున్న విధంగానే తమకు లాభం చేకూరే విధంగా అసెంబ్లీ ఎన్నికలు రావడంతో మంచి ఆదాయాన్ని పొందారు. ఇక ఈ ఏడాది స్థానిక సంస్థల ఎన్నికల ఆగమ్య గోచారంతో మద్యం వ్యాపారులు సైతం తడబాటుకు గురై టెండర్ దాఖలు చేయడంలో తక్కువ దరఖాస్తులు దాఖలు చేశారు. దీంతో ప్రభుత్వానికి దరఖాస్తులు తగ్గడంతో పాటు ఖజానాకు సైతం ఆదాయం తగ్గిపోయింది.

Also Read: Forest Staff Sports: అటవీ శాఖ రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలు ప్రారంభం

Just In

01

Huzurabad Gurukulam: గురుకులంలో విద్యార్థులకు టార్చర్?.. ప్రిన్సిపాల్, ఓ పోలీస్ ఏం చేశారంటే?

Sujeeth Birthday: సుజీత్ బర్త్‌డే.. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ ట్వీట్ చూశారా?

Bottu Gambling: చిత్తు-బొత్తు ఆడుతున్న ఏడుగురి అరెస్ట్.. ఎంత డబ్బు దొరికిందంటే?

Mega Jathara: అసలైన మెగా జాతర సంక్రాంతి నుంచి మొదలు కాబోతోంది.. మెగా నామ సంవత్సరం!

Pak Targets Salman: సల్మాన్ ఖాన్‌పై పగబట్టిన పాకిస్థాన్.. ఉగ్రవాదిగా ముద్ర వేసేందుకు భారీ కుట్ర!