Pani Puri: పానీ పూరిని మితంగా తినండి?
pani puri ( Image Source: Twitter)
Viral News

Pani Puri: పానీ పూరి అతిగా తినే వాళ్ళు.. వీటి గురించి తెలుసుకోవాల్సిందే!

Pani Puri: సాయంత్రం అవ్వగానే జనం జంక్ ఫుడ్ కోసం బయటికి పరుగులు తీస్తారు. ఇంట్లో రకరకాల సమోసాలు, స్వీట్లు, స్నాక్స్ ఉన్నా, బయట ఏదోక చిరుతిళ్లు తినకపోతే మనసు కుదుటుగా ఉండదు. బజ్జీలు, బర్గర్లు, పానీపూరీలు.. ఇవే సాయంకాలం సమయంలో జనాల ఫేవరెట్. కానీ వైద్యులు మాత్రం, “బయటి ఆహారం జోలికి పోకండి ఆరోగ్యానికి బెడిసికొడుతుంది, దూరంగా ఉండండి!” అంటూ గట్టిగా హెచ్చరిస్తున్నారు. అయినా, చాలామంది ఈ మాటలను వినకుండా.. రోడ్డు పక్కన స్టాల్స్ దగ్గర క్యూ కడుతుంటారు. ఈ బయటి ఆహారం మంచిది కాదని తెలిసినా కూడా ఎగబడి మరి తింటారు. రోడ్డు పక్కన, డ్రైనేజీల దగ్గర స్టాల్స్ పెట్టి జంక్ ఫుడ్ అమ్ముతుంటారు.

Also Read: Viral Parenting Video: అమ్మాయిలాగా రెడీ అయ్యి.. తన పిల్లలకు ఎలా ఉండాలో నేర్పిస్తున్న కన్న తండ్రి.. వీడియో వైరల్

రోడ్ల పైన ఉండే ఆహారంపై ధూళి, బ్యాక్టీరియా, క్రిములు చేరి, తినేవాళ్లకు అనారోగ్యం తెచ్చిపెడతాయి. ముఖ్యంగా యువతలో పానీపూరీకి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఆ మసాలా చారు, బటానీలు, కొత్తిమీర, ఉల్లిపాయలు కలిపిన పానీపూరీ తినడానికి అంత రుచిగా ఉంటుంది. ఒక్క ప్లేట్‌తో ఆగక, నాలుగైదు ప్లేట్లు ఒకేసారి లాగించేస్తారు చాలామంది. కానీ, వైద్య నిపుణులు చెబుతున్నది వినండి.

Also Read: Mysterious Temple: ఏడాదిలో 15 రోజులు నీరు అదృశ్యం.. ఈ ఆలయం తెలంగాణలో ఎక్కడ ఉందో తెలుసా?

పానీపూరీ తినడం వల్ల ఎన్నో ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని చెబుతున్నారు. ఈ హెచ్చరికలను ఎవరూ పట్టించుకోవడం లేదు, రోజూ స్టాల్స్ దగ్గర జనం కిక్కిరిసిపోతుంటారు. ఇలాంటి క్రమంలోనే ఓ యువకుడు పానీపూరీ తిని ఆసుపత్రి మంచం ఎక్కాడు. ఒక్కసారిగా అతని కళ్లు పసుపు రంగులోకి మారి, వాంతులు, వికారం, నీరసంతో బాధపడ్డాడు.

Also Read: Baba Vanga 2026 Predictions: అతి భయంకరంగా 2026 కాలజ్ఞానం.. ఈ సారి కరోనాకి మించిన రోజులు వస్తాయా?

వైద్యులు రక్తం, మూత్రం పరీక్షలు చేసి, హెపటైటిస్-ఎ సోకినట్లు నిర్ధారించారు. కాలేయ ఎంజైమ్‌లు అసాధారణంగా పెరిగాయని, యాంటీ-హెచ్‌ఏవీ, ఐజీఎం యాంటీబాడీలు పాజిటివ్‌గా ఉన్నాయని తేల్చారు. చికిత్సకు భారీగా ఖర్చు అయింది, అంతేకాదు, అతని అనారోగ్యం తీవ్రతరం కావడంతో ఉద్యోగం కూడా కోల్పోయాడు. ఎన్నో రోజుల చికిత్స తర్వాత అతడు నెమ్మదిగా కోలుకున్నాడు. ప్రస్తుతం అతని ఆరోగ్యం స్థిరంగా ఉందని అతని కుటుంబం తెలిపింది. అయినా, ఈ సంఘటన ఒక గుణపాఠం. రుచి కోసం ఆరోగ్యాన్ని పణంగా పెట్టడం ఎంతవరకు సరైనది? బయటి ఆహారం తినాలనిపిస్తే, శుభ్రతను గమనించి, బయట ఫుడ్స్ ను తినడం మంచిది.

Just In

01

Bigg Boss Telugu 9: భరణి ఇమిటేషన్ అదుర్స్.. ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ లోడింగ్..

KTR Vs Congress: ఉప్పల మల్లయ్య ఇంటికి వెళ్లి.. కేటీఆర్ కీలక వ్యాఖ్యలు

Itlu Arjuna: ‘న్యూ గయ్ ఇన్ టౌన్’ ఎవరో తెలిసిపోయింది.. ‘సోల్ ఆఫ్ అర్జున’ వచ్చేసింది

India Vs South Africa: దక్షిణాఫ్రికాతో మూడో టీ20.. టాస్ గెలిచిన భారత్.. ఏం ఎంచుకుందంటే?

KCR: 19న కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్‌ఎల్పీ భేటీ.. మరో ప్రజా ఉద్యమం!.. కీలక నిర్ణయాలు!