Khata Ramachandra Reddy: 40 సంవత్సరాల ఉద్యమ నాయకుని చరిత్ర ముగిసింది. ప్రభుత్వ ఉద్యోగం వదిలి పీడిత ప్రజలకోసం తుపాకి పట్టి దాదాపు 40 సంవత్సరాలు గా ఉద్యమంలోకి వెళ్లి ఉద్యమ ద్రోహులు పోలీస్ లకు ఉప్పందించడంతో ఇటీవల ఎన్కౌంటర్లో మరణించిన ఖాతా రామచంద్ర రెడ్డి(Khata Ramachandra Reddy) మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు రామచంద్రారెడ్డి మృతదేహం ఎట్టకేలకు శనివారం సిద్దిపేట(Sidhipeta) జిల్లా హుస్నాబాద్(Husnabad) నియోజకవర్గం తిగులకుంటపల్లికి చేరింది. తన తండ్రిది బూటకం ఎన్కౌంటర్ అని రామచంద్రారెడ్డి(Ramachandra Reddy) కుమారుడు కోర్టుకు వెళ్లడంతో పోస్టుమార్టం ఆలస్యమైన విషయం తెలిసిందే. రామచంద్ర రెడ్డి మృతదేహం గ్రామానికి చేరుకోగానే వృద్ద తండ్రి కన్నీటి పర్యంతమయ్యారు.గ్రామం మొత్తం తరలివచ్చింది. బందు మిత్రులు, ఉద్యమ సహచరులు, కవులు, కళాకారులు,గ్రామానికి చేరుకొని ఉద్యమ నేత రామచంద్రారెడ్డి, పార్టివ దేహానికి నివాళులు అర్పించారు. కన్నీటి వీడ్కోలు పలికారు.
ఛత్తీస్ గడ్ హైకోర్టును..
సిద్దిపేట జిల్లా కోహెడ మండలం తీగలకుంటపల్లికి మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు ఖాతా రాంచంద్రారెడ్డి మృతదేహం శనివారం ఉదయం 5 గంటలకు చత్తీస్గడ్ రాష్ట్రం నుండి చేరుకుంది. గత నెల సెప్టెంబర్ 22 న ఛత్తీస్ గడ్ అంబుజ్ మాడ్ ఎన్ కౌంటర్ లో రాంచంద్రారెడ్డి మృతి చెందారు. రామచంద్రారెడ్డిది బూటకపు ఎన్ కౌంటర్ అని మృతదేహానికి రీపోస్టుమార్టం నిర్వహించాలని కుటుంబ సభ్యులు ఛత్తీస్ గడ్ హైకోర్టును ఆశ్రయించారు. అక్కడ జాప్యం జరగడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. హైకోర్టులో విచారణ జరుగుతుండగా తాము జోక్యం చేసుకోలేమని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. దీంతో మృతదేహాన్ని 26 రోజుల తర్వాత స్వగ్రామం తీగలకుంటపల్లికి తీసుకువచ్చి కుటుంబ సభ్యులు దహన సంస్కారాలు నిర్వహించారు.
Also Read: Dude movie review: ప్రదీప్ రంగనాధన్ ‘డ్యూడ్’ ప్రేమ కథ ఫలించిందా?.. తెలియాలంటే?
బూటకపు ఎన్ కౌంటర్..
రాంచంద్రారెడ్డి మృతి దేహానికి సహచర మిత్రులు, కవులు కళాకారులు, బందు మిత్రులు నివాళులర్పించారు. కుటుంబ సభ్యులు అంత్యక్రియలు నిర్వహించారు. ఈ సందర్భంగా రామచంద్రారెడ్డి మృతదేహానికి బిఆర్ఎస్(BRS) ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్(MLC Deshapathi Srinivas), మాజీ ఎమ్మెల్సీ దేవిప్రసాద్(Devi Prasad), కవి రచయిత నందిని సిద్ధారెడ్డి(Nandini Siddha Reddy), ప్రముఖులు నివాళులర్పించారు. రామచంద్రారెడ్డి అంతిమయాత్రలో పౌర హక్కుల సంఘం నేతలు, కవులు, రచయితలు, చిన్ననాటి తోటి ఉపాధ్యాయులు పాల్గొన్నారు. రామచంద్రరెడ్డి భౌతిక కాయానికి రీ పోస్టుమార్టం చేయాలని సుప్రీంకోర్టులో కేసు నడుస్తుండడంతో, రీ పోస్టుమార్టం చేయడానికి అనుగుణంగా మృత దేహాన్ని బాక్స్ లో పెట్టి సమాధి చేశారు. సుప్రీంకోర్టు రీ పోస్టుమార్టం చేసేలా తీర్పునివ్వాలని పౌర హక్కుల సంఘం నేతలు, కుటుంబ సభ్యులు వేడుకుంటున్నారు. బూటకపు ఎన్ కౌంటర్ చేయడం దారుణమని రామచంద్రరెడ్డి భార్య, కుమారుడు ఆరోపించారు.
విప్లవ కవులు పౌరహక్కుల సంఘం నేతలు..
ఈ కార్యక్రమంలో విప్లవ కవులు,పౌరహక్కుల సంఘం నేతలు, పూర్వ ఏపీటీఎఫ్, ప్రస్తుత డిటిఎఫ్ రాష్ట్ర, జిల్లా నాయకులు టీ.లింగారెడ్డి, ఎ.రఘు శంకర్ రెడ్డి, కే.నారాయణరెడ్డి, ఎ.శ్రీనివాస్ రెడ్డి, కవ్వ లక్ష్మారెడ్డి, తిరుపతి రెడ్డి, సిపిఐ జిల్లా కార్యదర్శి మంద పవన్, సిపిఐ నాయకులు కొయ్యడ సృజన్ కుమార్, కొమురయ్య, కొమ్ముల భాస్కర్, రామచంద్రారెడ్డి టిటిసి, సహచర మిత్రులు పేర్యాల రవీందర్రావు, బసవరాజ్ శంకర్,తనతో పని చేసిన ఉపాధ్యాయులు, గ్రామస్తులు, కుటుంబ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.
Also Read: Jubilee Hills Bypoll: నామినేషన్ సమర్పించిన అధికార కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి
