Garib Rath Catches Fire: శనివారం ఉదయం (అక్టోబర్ 18) అమృత్‌సర్ నుంచి బీహార్‌లోని సహర్సాకు వెళ్తున్న గరిబ్ రథ్ ఎక్స్‌ప్రెస్ అగ్నిప్రమాదానికి (Garib Rath Catches Fire) గురైంది. సిర్హింద్ రైల్వే స్టేషన్‌కు సమీపంలో ఒక కోచ్‌లో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఒక కోచ్ మంటల్లో తగలబడిపోయింది. మరో రెండు కోచ్‌లు కూడా ప్రభావితం అయ్యాయి. అంబాలాకు అర కిలోమీటర్ దూరంలో జరిగిన ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని రైల్వే అధికారులు వెల్లడించారు. ఒక కోచ్ నుంచి పొగలు వస్తున్నట్లు గమనించిన వెంటనే రైలు ఆపివేశారని, దీంతో ఘోరప్రమాదం తప్పిపోయిందని వివరించారు.
Read Also- Kavitha: బీసీ రిజర్వేషన్లపై చట్టం చేసేవరకు జాగృతి పోరాటం చేస్తాం.. కవిత స్పష్టం!
ఒక వ్యక్తి స్వల్పంగా గాయపడ్డాడని, అతడికి చికిత్స అందుతోందని వెల్లడించారు. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగారని, మంటలను అదుపులోకి తీసుకొచ్చారని సిర్హింద్ జీఆర్‌పీ ఎస్‌హెచ్‌వో రతన్ లాల్ తెలిపారు. ప్యాసింజర్లు సమయానికి కిందకు దిగేయడంతో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని తెలిపారు. ముందుగా పొగలు రావడాన్ని గమనించారని, వెంటనే అక్కడే రైలుని నిలిపివేశారని చెప్పారు. ఫైర్‌ఫైటర్లు తక్కువ సమయంలో మంటలను అదుపులోకి తీసుకొచ్చారని చెప్పారు. అయితే మూడు కోచ్‌లు మంటల్లో దెబ్బతిన్నాయని, మంటలు చెలరేగడానికి కారణం ఏంటో గుర్తించేందుకు దర్యాప్తు మొదలుపెట్టామని రైల్వే అధికార వర్గాలు వివరించాయి. మంటలను ఆర్పివేసిన తర్వాత రైలు గమ్యస్థానం వైపు కదిలివెళ్లిందని చెప్పారు.
ఈ ప్రమాదంపై రైల్వే మంత్రిత్వ శాఖ కూడా స్పందించింది. పంజాబ్‌లోని సిర్హింద్ స్టేషన్ వద్ద శనివారం ఉదయం ఈ ప్రమాదం జరిగిందని, 12204 నంబర్ అమృత్‌సర్-సహర్సా ట్రైన్‌లోని కోచ్‌లో మంటలు చెలరేగాయని తెలిపింది. ఎవరికీ గాయాలు కాలేదని, మంటలను ఆర్పివేశారని వివరించింది.
Read Also- Afghan Cricketers Died: పాకిస్థాన్ వైమానిక దాడులు.. ముగ్గురు ఆఫ్ఘనిస్థాన్ క్రికెటర్లు మృతి
A fire broke out in the Garib Rath Express travelling from Amritsar to Saharsa. pic.twitter.com/oZ2Tef333d
— Bhai of Total's (@BhaiOfTotla) October 18, 2025
