Huzurabad News: పత్తి కొనుగోలు చేయాలంటే స్లాట్ బుకింగ్ పక్కా..!
Huzurabad News (imagecredit:swetcha)
నార్త్ తెలంగాణ

Huzurabad News: సీసీఐ ద్వారా పత్తి కొనుగోలు చేయాలంటే స్లాట్ బుకింగ్ తప్పనిసరి

Huzurabad News: పత్తి రైతన్నలకు శుభవార్త. కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (CCI) సంస్థ అక్టోబర్ 22, 2025 నుంచి పత్తి కొనుగోళ్లను ప్రారంభించేందుకు సన్నద్ధమైంది. కొనుగోలు కేంద్రాల ద్వారా రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రక్రియను నిర్వహించేందుకు అధికారులు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారని హుజూరాబాద్ సహాయ వ్యవసాయ సంచాలకులు (ADA) జి. సునీత(Sinitha) తెలిపారు. ముందుగా ‘కిసాన్ కపాస్’ యాప్‌లో వివరాలు సరి చూసుకోవాలి. సీసీఐకి పత్తిని విక్రయించాలని భావించే రైతులు తప్పనిసరిగా తమ వివరాలను ‘కిసాన్ కపాస్’ (Kisan Kapas) యాప్‌లో సరి చూసుకోవాలని అధికారులు కోరుతున్నారు. ఇందుకోసం రైతులు గూగుల్ ప్లే స్టోర్ నుండి ఈ యాప్‌ను తమ స్మార్ట్‌ఫోన్లలో డౌన్‌లోడ్ చేసుకుని, ఇన్‌స్టాల్ చేసుకోవాలి.

లాగిన్ వివరాలు ముఖ్యం

‘రైతు బంధు’ పథకం కోసం వ్యవసాయ శాఖకు గతంలో నమోదు చేసిన మొబైల్ నెంబర్‌తోనే రైతులు ఈ యాప్‌లో లాగిన్ కావాల్సి ఉంటుంది. ఒకవేళ, గతంలో ఇచ్చిన మొబైల్ నెంబర్(Mobile Number) పనిచేయకపోయినా లేదా తప్పుగా నమోదై ఉన్నా, అటువంటి రైతులు వెంటనే సంబంధిత వ్యవసాయ విస్తరణ అధికారి (AEO)ని సంప్రదించి, తమ కొత్త మొబైల్ నెంబర్‌ను తప్పనిసరిగా అప్డేట్ చేయించుకోవాలి. మొబైల్ నెంబర్ అప్డేట్ అయిన తర్వాత మాత్రమే వారు యాప్‌లో లాగిన్ కావడం సాధ్యమవుతుంది.

Also Read: Pankaj Dheer: ఆ సమయంలో సర్వస్వం కోల్పోయిన పంకజ్ ధీర్ కుటుంబం.. ఎందుకంటే?

స్లాట్ బుకింగ్ తప్పనిసరి

సీసీఐ కొనుగోలు కేంద్రాలలో పత్తిని విక్రయించదలచిన రైతులు, పత్తిని కేంద్రానికి తీసుకురావడానికి ముందుగా ‘కిసాన్ కపాస్ యాప్’ నందు తమ మొబైల్ నెంబర్‌తో లాగిన్ అవ్వాలి. ఆ తర్వాత ఏ తేదీన పత్తిని కొనుగోలు కేంద్రానికి తీసుకువెళ్లదలిచారో ఆ తేదీని (డేట్) స్లాట్ బుక్ చేసుకోవడం తప్పనిసరి. స్లాట్ బుక్ చేసుకున్న తర్వాతే పత్తిని కొనుగోలు కేంద్రానికి తీసుకురావాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. రైతు సోదరులు ఈ విషయాన్ని గమనించి, పత్తి అమ్మకంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా ముందుగానే తగు జాగ్రత్తలు తీసుకోవాలని హుజూరాబాద్ సహాయ వ్యవసాయ సంచాలకులు శ్రీమతి జి. సునీత కోరారు.

Also Read: Tollywood: టాలీవుడ్‌లో ఇతర భాషల సినిమాలు బ్యాన్ చేయాల్సిన అవసరం ఉందా?

Just In

01

S Thaman: సినిమా ఇండస్ట్రీలో యూనిటీ లేదు.. టాలీవుడ్‌పై థమన్ ఫైర్

The Raja Saab: ఈసారి బ్యూటీఫుల్ మెలోడీతో.. ప్రోమో చూశారా!

Bigg Boss Buzzz: అబద్దం చెప్పమన్నా చెప్పను.. శివాజీకి షాకిచ్చిన సుమన్ శెట్టి!

Aswini Dutt: 50 సంవత్సరాల వైజయంతి ప్రయాణం.. నిర్మాత అశ్వినీదత్ ఎమోషనల్ లెటర్..!

Dharamshala T20: ధర్మశాల టీ20లో దక్షిణాఫ్రికాపై భారత్ గెలుపు..