Gadwal District: రాష్ట్రవ్యాప్తంగా తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకానికి ఉచిత ఇసుక పంపిణీ చేస్తుండగా (Gadwal District) నడిగడ్డలో మాత్రం అధికార పార్టీకి చెందిన నాయకుల రాజకీయానికి లబ్ధిదారులకు ఇసుక పంపిణీ జరగక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తుంగభద్ర నదిలో తుమ్మిళ్ళ దగ్గర ఇసుక రీచ్ ను దక్కించుకున్న ఏపీ కాంట్రాక్టర్ తన దారికి రాకుండా ఎటువంటి అంతరాయం లేకుండా పథక ప్రారంభంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ఇసుక సరఫరా చేస్తూ వచ్చాడు. అయితే తనను కలవకుండా, వాటా ఇవ్వకుండా ఇసుక రీచ్ పనులను కొనసాగిస్తుండగా రోడ్లు దెబ్బతింటాయనే కారణంతో ఓ మాజీ ప్రజా ప్రతినిధి స్థానిక అనుచరుల చేత టిప్పర్లను నిలిపి వేయించారని ప్రతిపక్ష నాయకులు ఆరోపిస్తున్నారు.
Also Read: Jogulamba Gadwal: ఆ జిల్లాలో మాముళ్ల మత్తులో అధికారులు.. రహదారి పక్కనే సిట్టింగ్‌లు!
7.25 లక్షల మెట్రిక్ టన్నుల ఇసుక
దీంతో ఇసుక రవాణా గత 6 రోజులుగా నిలిచిపోవడంతో లబ్ధిదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇసుకను రవాణా చేసే టిప్పర్లు రాజోలి మండలం తుమ్మిళ్ళ రీచ్ దగ్గరే ఉండిపోవాల్సి వచ్చింది. లబ్ధిదారులు ఆన్లైన్ లో ఇసుకకు బుక్ చేసుకుంటున్నారు. కాంట్రాక్ట్ ఒప్పందం మేరకు 7.25 లక్షల మెట్రిక్ టన్నుల ఇసుకను వివిధ పథకాలు, అవసరాలకు సరఫరా చేసేందుకు సిద్ధమయ్యాడు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ పథకాలకు, ఇతర ఆన్లైన్ బుకింగ్ లకు సరఫరా చేస్తుండగా అధికార పార్టీకి చెందిన ఓ మాజీ ప్రజాప్రతినిధికి మింగుడు పడడం లేదు. కొన్నాళ్లు తమ వారి వాహనాలే వాడాలని కండిషన్ పెట్టగా, అందులో కొన్ని టిప్పర్లకు బిల్లింగ్ లేకుండా అనుమతి ఇవ్వాలని ఒత్తిడి తెచ్చారనే విమర్శలు ఉన్నాయి. నేడు ఏకంగా తన పర్సంటేజ్ కోసం అనేక వాహనాలను నిలిపివేయించాడని టిప్పర్ల యజమానులు వాపోతున్నారు. ఏకంగా నేటికీ ఆరు రోజులు కావడంతో ఇసుకరా సరఫరా చేయాలని కలెక్టర్కు సైతం లబ్ధిదారులు మొరపెట్టుకున్నారు.
ప్రభుత్వ లక్ష్యాలకు మైనింగ్ శాఖ తిలోదకాలు
ప్రభుత్వ పథకాలకు ఎటువంటి అంతరాయం లేకుండా ఇసుక సరఫరా అయ్యేలా చూడాల్సిన మైనింగ్ శాఖ అధికారులు తమకేమీ పట్టనట్లు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. అధికార పార్టీ నేతల ఒత్తిళ్లకు తలొగ్గి ఎస్ బాస్ అనే పరిస్థితిలో కాలం వెళ్ల దీస్తున్నారని లబ్ధిదారులు విమర్శిస్తున్నారు. రాజోలి మండలంలోని పలు గ్రామాలలో అనధికారికంగా ప్రైవేట్ వ్యక్తులు ఇసుక డంపులు నిలువ చేసుకొని టిప్పర్ ఇసుకను స్థానికంగా 20 వేలకు, దూర ప్రాంతాలకు 40 వేలకు పైగా అమ్ముతూ సొమ్ము చేసుకుంటున్నారు. మరికొందరు అనుమతుల పేరుతో ప్రైవేట్ గా అమ్ముకుంటూ అక్రమ దందాతో కొందరు కోట్లకు పడగలెత్తుతున్నారు.
పట్టించుకునే నాథుడే లేడా?
ఈ వ్యవహారమంతా అధికారులకు తమకేమీ పట్టనట్లు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని, ఆ అధికారి సైతం ఎవరికి అందుబాటులో ఉండడని కేవలం కొందరికి మాత్రమే ఫోన్ లో అందుబాటులో ఉంటారనే విమర్శ ప్రజల్లో బలంగా ఉంది. జిల్లా కేంద్రంలో సైతం మొరం టిప్పర్లు యతేచగా ప్రభుత్వ గుట్టలను వ్యతిరేక తవుతున్న పట్టించుకునే నాథుడే లేడని ప్రజలు విమర్శిస్తున్నారు. సహజ వనరులను అధికార పార్టీ ముసుగులో రాజకీయ నాయకుల కనుసన్నలలో కొందరు అక్రమార్కులు మట్టి ఇసుక రవాణా చేస్తున్న బైండింగ్ అధికారులు నిరంతరం పర్యవేక్షణ చేసి అరికట్టాల్సింది పోయి ప్రభుత్వానికి వచ్చే రాయల్టీని సైతం పట్టించుకోకుండా కొందరి రాజకీయ నాయకుల అనుచరులు చేసే దందాను అరికట్టలేకపోతున్నారనే విమర్శలు ఉన్నాయి.
Also Read: Gadwal Collectorate: బుక్కెడు బువ్వ కోసం వృద్దురాలు ఆరాటం.. జన్మనిచ్చిన తల్లి గురువులకు భారమా?
