Shocking Video: రోడ్డు ప్రమాదాల సంఖ్య రోజు రోజుకు గణనీయంగా పెరిగిపోతోంది. అతివేగం కారణంగా కొందరు అర్ధాంతరంగా ప్రాణాలు కోల్పోతున్నారు. తమ కుటుంబానికి తీరని శోకాన్ని మిగిలిస్తున్నారు. రోడ్డుపై ప్రయాణించేటప్పుడు ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్న భారీ మూల్యం తప్పదని ఇప్పటికే అధికారులు హెచ్చరిస్తున్నారు. మరోవైపు రోడ్డు ప్రమాదాలను నియంత్రించేందుకు ట్రాఫిక్ పోలీసులు తమ శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నారు. తాజాగా ఓ ట్రాఫిక్ కానిస్టేబుల్ బస్సు కిందపడబోయిన బైకర్ ను సాహసోపేతంగా రక్షించాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు వైరల్ అవుతున్నాయి.
వివరాల్లోకి వెళ్తే..
ఆర్టీసీ బస్సు కింద పడబోయిన ఓ వాహనదారుడి ప్రాణాలను ట్రాఫిక్ కానిస్టేబుల్ కాపాడారు. ఈ ఘటన హైదరాబాద్ జీడిమెట్ల ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. సూరారం సిగ్నల్ వద్ద బాలనగర్ నుంచి మెదక్ వెళ్తున్న ఆర్టీసీ బస్సుకు అత్యంత సమీపంలో ఓ ద్విచక్రవాహనదారుడు అదుపుతప్పి పడిపోయాడు. అక్కడే విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ కానిస్టేబుల్ శివకుమార్ వేగంగా స్పందించి.. వాహనదారుడు బస్సు కిందకు వెళ్లకుండా కాపాడారు. దీంతో అతడికి ప్రాణాపాయం తప్పింది.
కానిస్టేబుల్ పై ప్రశంసలు..
బైకర్ ను కాపాడిన అనంతరం బాధితుడ్ని రోడ్డు పక్కకి కానిస్టేబుల్ తీసుకెళ్లారు. మరోవైపు కింద పడ్డ బైక్ ను సైతం స్వయంగా పైకి లేపి.. ట్రాఫిక్ కు అంతరాయం కలుగకుండా దూరంగా పార్క్ చేశారు. అయితే ఇదంతా గమనించిన స్థానికులు, వాహనదారులు అక్కడకు చేరుకొని.. బాధితుడ్ని పరామర్శించారు. తీవ్రమైన గాయాలు ఏమైనా తగిలాయా?అంటూ ప్రశ్నించారు. బాధితుడికి పెద్దగా గాయాలు కాలేదని తెలుసుకొని అక్కడి వారు ఊపిరిపీల్చుకున్నారు. మరోవైపు చాకచక్యంగా వ్యవహరించిన కానిస్టేబుల్ పై స్థానికులు ప్రశంసలు కురిపించారు. అటు ట్రాఫిక్ ఉన్నతాధికారులు సైతం కానిస్టేబుల్ శివకుమార్ ను ప్రశంసించినట్లు తెలుస్తోంది.
బస్సు కింద పడబోయిన వాహనదారుడు.. కాపాడిన ట్రాఫిక్ కానిస్టేబుల్!
ఆర్టీసీ బస్సు కింద పడబోయిన ఓ వాహనదారుడి ప్రాణాలను ట్రాఫిక్ కానిస్టేబుల్ కాపాడారు. ఈ ఘటన జీడిమెట్ల ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. సూరారం సిగ్నల్ వద్ద బాలనగర్ నుంచి మెదక్ వెళ్తున్న ఆర్టీసీ బస్సుకు అత్యంత… pic.twitter.com/coICDR12QA
— ChotaNews App (@ChotaNewsApp) October 15, 2025
Also Read: Viral Video: అడవి ఏనుగులతో.. ఆకతాయిల వెకిలి చేష్టలు.. నెటిజన్లు ఫైర్
జాగ్రత్తలు తప్పనిసరి..
రోడ్డుపై వెళ్లేటప్పుడు ముందు జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలని అధికారులు సూచిస్తున్నారు. ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు మరింత అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేస్తున్నారు. ఐఎస్ఐ మార్క్ హెల్మెట్, ట్రాఫిక్ నియమాలు పాటించడం, వేగాన్ని నియంత్రించడం, సైడ్ మిర్రర్స్, మెుబైల్ ఫోన్ వినియోగించకపోవడం వంటి జాగ్రత్తలను పాటించాలని చెబుతున్నారు. ఓవర్ టేక్ చేసే సమయంలో మరింత అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.
