Kavitha: తెలంగాణ జాగృతి యువజన సమాఖ్య కమిటీలను జాగృతి సంస్థ అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (Kavitha) ప్రకటించారు. తెలంగాణ జాగృతి యువజన సమాఖ్య(టీజేవైఎఫ్) రాష్ట్ర కార్యదర్శులుగా సుబ్బారావు విజయ్ రాజ్(డానీ), జల శివయాదవ్, తాడిగొప్పుల మల్లేష్ ను నియమించారు. పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడిగా బొల్లం భూమేష్, యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షుడిగా ఆకుల నరేష్ యాదవ్, మహబూబాబాద్ జిల్లా అధ్యక్షుడిగా సంగెం హర్షిత్, భూపాలపల్లి అధ్యక్షుడిగా చీకటి గణేష్, వనపర్తి జిల్లా అధ్యక్షుడిగా దాసరి విజయ్, మహబూబ్ నగర్ జిల్లా అధ్యక్షుడిగా శాగంటి మనోహర్, నాగర్ కర్నూల్ జిల్లా అధ్యక్షుడిగా ఎలుక పవన్ కుమార్ ను నియమించారు.
Also Read:Kavitha: బీసీ బిల్లు సాధించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వంపై కొట్లాడాలి.. కవిత కీలక వ్యాఖ్యలు
ఎల్ బీనగర్ అసెంబ్లీ నియోజకవర్గ అధ్యక్షుడిగా కొత్త కురువ రాజు
అదే విధంగా హైదరాబాద్ జిల్లా ఉపాధ్యక్షుడిగా అభిలాష్ గౌడ్, మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా ఉపాధ్యక్షుడిగా కనోజియా అర్జున్ దాస్, కామారెడ్డి జిల్లా ఉపాధ్యక్షుడిగా మణి కృపాకాంతరెడ్డి, సంగారెడ్డి ఉపాధ్యక్షుడిగా వడ్ల విష్ణువర్ధన్ చారి, రంగారెడ్డి ఉపాధ్యక్షుడిగా మరిపెద్ది అభిషేక్ రెడ్డి, ఎల్ బీనగర్ అసెంబ్లీ నియోజకవర్గ అధ్యక్షుడిగా కొత్త కురువ రాజు, ఇబ్రహీంపట్నం నియోజకవర్గ అధ్యక్షుడిగా మంచిరెడ్డి కిరణ్ రెడ్డి, మహేశ్వరం నియోజకవర్గ అధ్యక్షుడిగా నర్ర వెంకటేష్ ముదిరాజ్, కూకట్ పల్లి నియోజకవర్గ అధ్యక్షుడిగా చావా సాయి సుదీప్ చౌదరి, శేరిలింగంపల్లి నియోజకవర్గ అధ్యక్షుడిగా పాలమూరు సాయినాథ్ గౌడ్, కాప్రా డివిజన్ అధ్యక్షుడిగా మాలోతు ఉపేందర్ నాయక్, ఏఎస్ రావు నగర్ డివిజన్ అధ్యక్షుడిగా వగల బోయిన అనంత్ తేజ్ గౌడ్, చేరాలపల్లి డివిజన్ అధ్యక్షుడిగా మాలోత్ పవన్ నాయక్ ను నియమించారు.
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత నియామకపత్రాలు
వారికి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత నియామకపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సమాజంలో మార్పు అనేది యువత ద్వారానే సాధ్యమవుతుందన్నారు. ఏదైనా మార్పు కావాలని భావిస్తే అది సాధించే వరకు యువత వదిలిపెట్టదు అన్నారు. తెలంగాణ ఉద్యమంలో గానీ స్వాతంత్ర ఉద్యమంలో గానీ యువతదే కీలక పాత్ర అన్నారు. తెలంగాణలో ఒక మంచి సమాజాన్ని నెలకొల్పేందుకు మేము ప్రయత్నిస్తున్నామన్నారు. అందులో యువతది కీలక పాత్ర ఉండాలని భావిస్తున్నట్లు తెలిపారు. కొత్తగా బాధ్యతలు చేపట్టనున్న వారు మంచి పేరు తెచ్చుకునేలా పనిచేయాలని సూచించారు.
Also Read: Kavitha Vs BRS: కవితతో టచ్‌లో ఉన్నది ఎవరు?.. బీఆర్ఎస్ అధిష్టానం ఆరా?
