Child Protection: నేడు ఉండవల్లి మండలం మారుమునుగల గ్రామం లోUPS స్కూల్ లో,మహిళ శిశు సంక్షేమ శాఖ వారి జిల్లా బాలల పరిరక్షణ విభాగం ఆధ్యర్యంలో విలేజ్ చైల్డ్ ప్రొటెక్షన్ (Child Protection) కమిటీ మీటింగ్ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికీ ముఖ్య అతిథిగా జిల్లా బాలల సంరక్షణ లీగల్ అధికారిఎత్తం శివ గారు, హాజరై చిన్న వయసు నుండి లక్ష్యం పెట్టుకొని చదవాలని సూచించారు. ఆడపిల్లల పై సోదరాబావం తో ఉండాలని తేలిపారు. బాలల లైంగిక వేధింపుల నిరోధక చట్టం 2012 గురించి తెలియజేస్తూ లైంగిక వేధింపుల నుంచి రక్షణ కల్పించేందుకు ఈ చట్టం రూపొందించారని, ఈ చట్టంలో బాలబాలికలకు సమానమైన రక్షణ లభిస్తుంది.
Also Read: Jogulamba Gadwal: ఆ జిల్లాలో మాముళ్ల మత్తులో అధికారులు.. రహదారి పక్కనే సిట్టింగ్‌లు!
ఏది సురక్షితం ఏది ఆసురక్షితం అనే విషయం తెలుసుకోవాలి
ఇటీవల కాలంలో ప్రతి చోట ఎదురవుతున్న సమస్య లైంగిక వేధింపులు, కుటుంబ సభ్యులు మరియు ఇతర వ్యక్తుల చేతుల్లో బాలలు లైంగిక వేధింపులకు గురవుతున్నారు. కాబట్టి ఎవరైనా ముట్టుకున్నప్పుడు ఏది సురక్షితం ఏది ఆసురక్షితం అనే విషయం తెలుసుకోవాలి. బాలలు ఎవరి నుంచైనా ఇలాంటి వేధింపులకు గురవుతున్నట్లు తెలిస్తే వెంటనే 100 లేదా 1098కి ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలి వారిపై చట్టరీత్యా చర్యలు తప్పవని హెచ్చరించారు.
చిన్న వయసులోనే పెళ్లిలు చేయడం చట్ట రీత్యా నేరం
అదేవిధంగా చిన్న వయసులోనే పెళ్లిలు చేయడం చట్ట రీత్యా నేరం అని చెప్పారు, అయితే ఇలా బాల్య వివాహం చేస్తున్నట్లు తెలిస్తే గ్రామంలో ఉండే బాలల పరిరక్షణ కమిటీ కి లేదా1098 కి ఫోన్ చేసి సమాచారం అందించాలని కోరారు. సామాజిక మద్యమం వల్ల పిల్లలు చెడు అలవాట్లు కు లోనై అవకాశం ఉన్నది కాబట్టి బాలల అందరూ కూడా కేవలం మంచి విషయాల కోసం మాత్రమే ఫోన్స్ ఉపయింగించుకోవలని తెలిపారు. ఈ కార్యక్రమంలో, స్కూల్ HM బుజ్జమ్మ మేడమ్ విలేజ్ సెక్రటరీ అనీష్ కుమార్ , టీచర్స్ రాజేశ్వరి ,బుచ్చన్న ,మదీలేటీ అంగన్వాడీ టీచర్స్ ఏసియాబనా, నాగమ్మ,స్టూడెంట్స్ పాల్గొన్నారు.
Also Read: Gadwal District: గద్వాల జిల్లా కలెక్టరేట్ ముందు ధర్నా చేపట్టిన జిల్లా గ్రంధాలయ చైర్మన్
