Mallojula Venugopal ( IMAGE CREDIT: TWITTER)
జాతీయం, లేటెస్ట్ న్యూస్

Mallojula Venugopal: మావోయిస్టు పార్టీకి ఎదురుదెబ్బ.. అగ్రనేత మల్లోజుల వేణుగోపాల్ లొంగుబాటు

Mallojula Venugopal: మావోయిస్టు పార్టీ ప్రధాన నేత గత కొంతకాలంగా మావోయిస్టు పార్టీ వీధి విధానాలను వ్యతిరేకిస్తూ లేఖలు రాసిన మల్లోజుల వేణుగోపాల్ (Mallojula Venugopal) అలియాస్ సోనూ తో పాటు 60 మంది మావోయిస్టులు ఆయుధాలను విడిచిపెట్టారు. గత కొంతకాలంగా మావోయిస్టు పార్టీ అంత ఆయుధాల వినమణ చేసి జనజీవన స్రవంతిలో కలవాలని సిపిఐ మావోయిస్టు పోలిట్ బ్యూరో సభ్యుడు మల్లోజుల వేణుగోపాల్ బహిరంగ లేఖలను విడుదల చేశారు.

మావోయిస్టు పార్టీకి పెద్ద దెబ్బ

ఈ పరిణామంతో సిపిఐ మావోయిస్టు పార్టీకి పెద్ద దెబ్బ పడినట్లు అయింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రాష్ట్ర ప్రభుత్వాల నాయకత్వంలో దేశవ్యాప్తంగా పోలీసులు నిర్వహించిన నిరంతర ఆపరేషన్ కారణంగా మావోయిస్టు పార్టీ కకావికలమైంది. సెప్టెంబర్ లో సోనూ దాదా అలియాస్ మల్లోజుల వేణుగోపాల్ ఆయుధాలు విడిచిపెట్టడానికి సూచిస్తూ విడుదల చేసిన పత్రిక ప్రకటన సంచలనం రేపింది. ఛత్తీస్‌గఢ్, దేశంలోని ఇతర ప్రాంతాలలో మావోయిస్టు కార్యకర్తల నుండి మల్లోజుల వేణుగోపాలకు పూర్తి మద్దతు లభించింది.

 Also Read:Maoists: హింస వద్దు.. ఉపాధే ముద్దు.. వనం నుంచి జనంలోకి మావోయిస్టులు!

ఆయుధాలను విడిచిపెట్టి జనజీవన స్రవంతి

దీంతో మల్లోజుల వేణుగోపాల్ తో పాటు 60 మంది మావోయిస్టులు ఆయుధాలను విడిచిపెట్టి జనజీవన స్రవంతిలో కలిసి ఎందుకు సుముఖం వ్యక్తం చేస్తున్నారు. మల్లోతుల ఆయుధాలు విడిచిపెట్టడం మావోయిస్టు పార్టీకి తీరని దెబ్బ గత కొంతకాలంగా మావోయిస్టులకు ప్రజల నుంచి ఎటువంటి సానుభూతిపరమైన అవకాశాలు కలగకపోవడంతో మావోయిస్టు పార్టీలోని మోస్ట్ వాంటెడ్ నేతలు సైతం ఆయుధాల విరమణ చేసేందుకు సంసిద్ధులయ్యారు. ఈ మేరకు వారు విడుదల చేసిన లేఖల ద్వారా స్పష్టమవుతుంది. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం కూడా మావోయిస్టు లొంగిపోవాలి లేదంటే చచ్చిపోవాలని కాన్సెప్ట్ను అమలుపరుస్తూ వస్తున్నారు.

మావోయిస్టులు అమర్చిన ఐఈడి బాంబులు పేలి

అమిత్ షా చెప్పినట్లుగానే అటు  ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం ఇటు కేంద్ర ప్రభుత్వం కూడా మావోయిస్టుల అంతాన్నీ పంతంగా తీసుకొని సాయుధ భద్రత బలగాలు ముందుకు సాగుతున్నాయి. కనిపించిన వారి నల్ల ఏరి వేసే పనిలో భద్రతా బలగాలు నిమగ్నమై పనిచేస్తున్నాయి. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో ఏదో ఒకచోట మావోయిస్టులకు భద్రతా బలగాలకు ఎన్కౌంటర్లు జరగడమో లేదంటే లొంగిపోవడమో ఇంకా కాకపోతే మావోయిస్టులు అమర్చిన ఐఈడి బాంబులు పేలి అటు మావోయిస్టులు, ఇటు భద్రతా బలగాలు మృత్యు చెందడంతోపాటు తీవ్రంగా గాయపడుతున్న ఘటనలు వెళ్లడవుతున్నాయి.

ఇకపై మావోయిస్టులు మల్లోజుల దారిలోనేనా?

దాదాపు 1970 దశాబ్దం నుంచి 55 ఏళ్ల పాటు పోరాటపటిమను ప్రదర్శించిన సిపిఐ మావోయిస్టు పార్టీ మార్చి 31, 2026 వరకు అంతం అయ్యే పరిస్థితిలు ప్రస్ఫుటం అవుతున్నాయి. 1970 దశకం నుంచి 2009 వరకు మావోయిస్టులకు ప్రజల్లో అత్యంత నమ్మకం, సానుభూతి ఉండేది. 2009 నుంచి ఇప్పటివరకు వందల కొద్ది ఉన్న మావోయిస్టుడు పదుల సంఖ్యకు చేరిపోయారు. కొంతమంది ఎన్కౌంటర్లలో మృతిచెందితే, మరి కొంతమంది లొంగిపోయారు, ఇంకొంతమంది అనారోగ్యం పాడిన పడి మృతి చెందారు. ఏదేమైనప్పటికీ మావోయిస్టు పార్టీ తుది అంకానికి చేరిందనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ప్రస్తుత పరిస్థితులను చూస్తుంటే ప్రత్యక్ష లొంగుబాటు తో పాటు ఆయుధాల విరమణ మావోయిస్టు పార్టీ తుది దశకు చేరినట్లుగా అర్థమయిపోతోంది.

 Also Read: Maoist Leader Sujatha Surrenders: పోలీసుల ఎదుట మావోయిస్టు అగ్రనేత సుజాత లొంగుబాటు!

Just In

01

Swetcha Effect: స్వేచ్ఛ కథనంతో సంచలనం.. రంగంలోకి దిగిన నిఘా వర్గాలు డీఎస్పీ అరాచకాలకు తెర!

Ellamma movie: బలగం వేణు ‘ఎల్లమ్మ’ సినిమాకు సంగీత దర్శకుడు ఎవరంటే?

Liquor License: వైన్​ షాపుల లాటరీకి హైకోర్టు గ్రీన్ సిగ్నల్!

Telugu States Disasters 2025: ప్రకృతి గట్టిగానే హెచ్చరిస్తుందిగా.. లోకంలో పాపాలు ఆపకపోతే ఇలాంటి వినాశనాలు తప్పవా?

Aryan second single: విష్ణు విశాల్ ‘ఆర్యన్’ సెకండ్ సింగిల్ వచ్చేసింది.. చూసేయండి మరి..