Jogulamba Gadwal: జోగులాంబ గద్వాల (Jogulamba Gadwal) జిల్లాను ప్రమాదర రహిత జిల్లాగా మార్చేందుకు జిల్లా పోలీసు యంత్రాంగం అనేక అవగాహాన కార్యక్రమాలు నిర్వహించి ప్రజలను చైతన్యం చేస్తూ మద్యం, గంజాయి,డ్రగ్స్ తదితర వాటిపై అవగాహన కల్పిస్తున్నారు. దీనిలో భాగంగా వాహనదారులకు డ్రంక్ అండ్ర డ్రైవ్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఫలితంగా ప్రమాదాలు జరుగకుండా అధికారులు చర్యలు తీసుకోవడం ఒకరకంగా ప్రజలకు మంచి పరిణామమే.
Also Read: Gadwal Collectorate: బుక్కడు బువ్వ కోసం వృద్దురాలు ఆరాటం.. జన్మనిచ్చిన తల్లి గురువులకు భారమా?
మద్యం విక్రయాలు జోరు
కాని జిల్లాలో గల అంతరాష్ట్ర తెలంగాణ ఆంధ్రప్రదేశ్, మరియు తెలంగాణ కర్ణాటక జాతీయ రహదారిపై రోడ్డు పక్కన ఏర్పాటు చేసుకున్న దాబా హోటళ్లలో నిబంధనలకు వ్యతిరేకంగా మద్యం విక్రయాలు జోరుగా కొనసాగుతున్నాయి. జిల్లాలో ఎటు చూసినా జాతీయ రహదారులు, రాష్ట్ర రహదారుల పక్కన అనేక దాబా హోటళ్లు వెలిశాయి. పగళ్లు, రాత్రి అని తేడా లేకుండా దాబాల్లో హోటళ్లు మందుబాబులతో కిటకిటలాడుతున్నాయి. ఇక్కడ వారు తాగి తందనాలాడటానికి సిటింగ్ ఏర్పాటు ఉండడంతో మందుబాబులకు అడ్డాగా మారాయి. దాబాలలో మద్యం సేవించే వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది.
మాముళ్లు మత్తులో అధికారులు
నిబంధనల ప్రకారం భోజన సదుపాయాలు మాత్రమే కల్పించాల్సిన దాబా హోటళ్లు యథేచ్ఛగా మద్యం సిట్టింగులు చేస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా దాబాల్లో, హోటళ్లలో మద్యం తాగే ఏర్పాటు చేయడం, రాత్రి వరకు హోటళ్లు నిర్వహించడం, మద్యం తాగే వారికి ప్రత్యేక గదులు ఏర్పాటు చేయడం, మందుబాబులకు సిట్టింగ్ ఏర్పాటు చేయడం లాంటివి జరుగుతున్నా ఎక్సైజ్ అధికారులు, పోలీసులు పట్టించుకోవడం లేదని, నెలవారీ మాముళ్లు తీసుకుంటూ వీటిని పోలీసులు ప్రోత్సహిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనికి తోడు అధికార పార్టీ మద్దతు ఉండడంతో దాబా నిర్వాహకులు రెచ్చిపోతున్నారు.
రహదారి పక్కనే సిట్టింగ్ లు
జోగులాంబ గద్వాల జిల్లా కేటిదొడ్డి పోలీస్ స్టేషన్ పరిధిలో కొన్ని నెలల క్రితం కేటిదొడ్డి పోలీసులు వాహనదారులకు డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించారు. ఈ క్రమంలో నందిన్నెలో పోలీసులు డ్రంక్ అండ్ర డ్రైవ్ నిర్వహించి ఇద్దరి వాహనదారులకు కోర్టు తీర్పు ప్రకారం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి ముందు వాహన దారులకు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించాలని తీర్పు ఇవ్వడం పోలీసులు అమలుపరచడం దేశంలోనే సంచలనంగా మారింది.
మద్యం సిట్టింగ్ లు జోరు
కాని ఇదే కేటిదొడ్డి మండలం నందిన్నె గ్రామంలో రోడ్డు పక్కన దాబాలలో మద్యం సిట్టింగ్ లు జోరుగా సాగుతున్న పోలీసులు, ఎక్సైజ్ అధికారులు తమకేమిపట్టన్నట్లు వ్యవహరించడ పట్ల అధికారుల తీరుపై మండల ప్రజలు మండిపడుతున్నారు. దాబాలల్లో సిట్ట్టింగ్ లపై చర్యలు తీసుకోకుండా కేవలం కేసుల కోసం డ్రంక్ ఆండ్ డ్రైవ్ టెస్టులు మాత్రమే నిర్వహించడం వాహనదారులు దుమెత్తిపోస్తున్నారు. అంతరాష్ట్ర రహదారిపై దాబాలలో విచ్చల విడిగా మద్యం సేవించే వారిపై ఎందుకు చర్యలు తీసుకోరని పలువురు విమర్శించారు.
Also Read: Gadwal: గ్రామ పెద్ద దౌర్జన్యం.. 40 లక్షలు ఇవ్వలేదని రోడ్డును తవ్వేశారు.. వెంచర్ యజమానుల ఆవేదన
