Mallu Ravi: నాగర్ కర్నూల్ పార్లమెంట్ సభ్యుడు డా. మల్లు రవి (Mallu Ravi)ని గద్వాల్ (Gadwal) సీనియర్ సిటిజన్ ఫోరం జిల్లా అధ్యక్షుడు మోహన్ రావు కలిసి గద్వాల్ అభివృద్ధి కోసం పలు వినతులు చేసారు. ఈ సందర్భంగా జిల్లా అభివృద్ధికి సంబంధించి ఎంపీ డా. మల్లు రవి పలు కీలక అంశాలపై హామీలు ఇచ్చారు. ఇదిలా ఉండగా మండల పునర్విభజనలో బిజ్వారం, పూడూరులను నూతన మండలాలుగా ఏర్పాటు చేయాలని సూచించినట్టు తెలిపారు. అలాగే, దేవాదాయ శాఖ పరిధిలో గద్వాల్ నది అగ్రహారం సమీపంలో ఉన్న పురాతన ఆంజనేయ స్వామి ఆలయాన్ని ఎండోమెంట్ లో విలీనం చేసే చర్యలు తీసుకుంటామని చెప్పారు.
Also Read: Gadwal Collectorate: బుక్కడు బువ్వ కోసం వృద్దురాలు ఆరాటం.. జన్మనిచ్చిన తల్లి గురువులకు భారమా?
రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి ప్రతిపాదనలు పంపుతాం
విద్యా రంగంలో, ఐటీఐ కాలేజీని “అడ్వాన్స్‌డ్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్”గా అభివృద్ధి చేయడానికి కృషి జరుగుతోందని, దీనిని టెండర్ దశకు తీసుకువచ్చిన ఘనత తనదే అన్నారు. అలాగే అర్ధన్తరంగా నిలిచిన ఐటిఐ కాలేజ్ బిల్డింగ్ ను పూర్తి చేస్తామన్నారు.అలాగే, గద్వాల్ మహారాణి ఆదిలక్ష్మి దేవమ్మ డిగ్రీ కళాశాల విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా జిల్లాలో వెటర్నరీ మరియు ఫిషరీస్ కాలేజీలు స్థాపించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి ప్రతిపాదనలు పంపుతామని హామీ ఇచ్చారు. వైద్య రంగంలో, గద్వాల్ ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రస్తుతం హార్ట్ సంబంధిత చికిత్సలకు అవసరమైన 2D ఎకో, అల్ట్రాసౌండ్ మిషన్లకు టెక్నీషియన్, రేడియాలజిస్ట్ లేమి ఉన్నందున, వీరిని కాంట్రాక్ట్ పద్ధతిలో నియమించేందుకు కలెక్టర్ మరియు మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్‌లకు ఆదేశాలు జారీ చేస్తానని తెలిపారు.
ప్రాథమిక సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు తీసుకోవాలి
స్మృతి వనంలో యోగా కేంద్రం, తాగునీటి సదుపాయం, విద్యుత్, వసతి వంటి అన్ని ప్రాథమిక సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ను ఆదేశిస్తానని చెప్పారు. గద్వాల్ కోట పరిరక్షణలో భాగంగా రాజులు నిర్మించిన మెట్ల బావులు యథాతథ స్థితిలో ఉండేలా సంరక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు. అదే విధంగా, గద్వాల్ రైల్వే మిగులు భూమిలో ESI ఆసుపత్రి నిర్మాణం కోసం కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపుతామని, గద్వాల్ రైల్వే జంక్షన్‌గా ఉన్నందున ప్రతీ ఎక్స్‌ప్రెస్ రైలు ఇక్కడ ఆగేలా రైల్వే మంత్రిత్వ శాఖకు విజ్ఞప్తి చేస్తానని, అదనంగా రవాణా సౌకర్యాల కోసం ఓఆర్‌ఆర్ బ్రిడ్జి ప్రతిపాదనను కూడా పంపుతానని పేర్కొన్నారు.
శివారులో 50 ఎకరాల ప్రభుత్వ భూమిలో కృషి
రైతు సంక్షేమం కోసం జిల్లాలో పత్తి మరియు సీడ్ పంటల పరిశోధన కేంద్రం, అలాగే ధరూర్ మండల శివారులో 50 ఎకరాల ప్రభుత్వ భూమిలో కృషి విజ్ఞాన కేంద్రం ఏర్పాటు కోసం కలెక్టర్‌కు ఆదేశాలు ఇవ్వనున్నట్టు తెలిపారు. ఈనెల 16న శ్రీశైలం దేవస్థానం కు పీఎం నరేంద్ర మోడీ రాక సందర్భంగా ఆలంపూర్ నవ బ్రహ్మాలయాలు జోగులాంబ దేవాలయానికి యునెస్కో గుర్తింపు పొందేందుకు కృషి చేస్తానని డా. మల్లు రవి తెలిపారు.
Also Read: Gadwal District: ఇందిరమ్మ ఇళ్ల ఇసుక టిప్పర్ల నిలిపివేత.. కమిషన్ కోసమే అడ్డుకుంటున్నారా?
