DK Aruna (image credit: swetcha reporter)
నార్త్ తెలంగాణ

DK Aruna: ప్రధాన మంత్రి ధన్‌ ధాన్య కృషి యోజన పథకం రైతులకు వరం.. డీకే అరుణ కీలక వ్యాఖ్యలు

DK Aruna: రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం కొత్తగా ‘ప్రధాన మంత్రి ధన్‌ ధాన్య కృషి యోజన’ పథకాన్ని రూపొందించిందని,ప్రధాన మంత్రి ధన్‌ ధాన్య కృషి యోజన పథకం రైతులకు వరం లాంటిదని మహబూబ్ నగర్ పార్లమెంట్ సభ్యురాలు డికె. అరుణమ్మ (DK Aruna )గారు అన్నారు. గద్వాల పట్టణంలోని డికె. బంగ్లా లో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో డికె. అరుణ మాట్లాడుతూ దేశంలో 100 జిల్లాల్లో ఈ పథకం అమలవుతుందని, ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో గద్వాల జిల్లా , నారాయణపేట, నాగర్‌కర్నూల్ జిల్లాలను ఎంపిక చేశారని తెలిపారు.రైతుల ఆదాయం పెంచేందుకు ప్రధాన మంత్రి ధన్ ధాన్య కృషి యోజన పథకం ఉపయోగపడుతుందన్నారు. ఈ పథకం కింద దేశ వ్యాప్తంగా 100 జిల్లాలు ఎంపిక చేయగాతెలంగాణ రాష్ట్రంలో 4 జిల్లాలకు అవకాశం వచ్చిందన్నారు.

Also Read: Gadwal Collectorate: బుక్కడు బువ్వ కోసం వృద్దురాలు ఆరాటం.. జన్మనిచ్చిన తల్లి గురువులకు భారమా?

గొర్రెలు, కోళ్ల పెంపకంపై దృష్టి పెట్టాలి

మొదటి విడతలో 960 కోట్ల రూపాయలు విడుదల చేయడం జరుగుతుందన్నారు. రైతులకు సులభతర రుణాలు, నీటిపారుదల సౌకర్యాల మెరుగుదల ఈ పథక ప్రధాన లక్ష్యమనన్నారు. రైతులు పాడి పశువులు, గొర్రెలు, కోళ్ల పెంపకంపై దృష్టి పెట్టాలన్నారు. వ్యవసాయ ఉత్పాదకత, నీటిపారుదల, రుణ సౌకర్యాలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టనుందన్నారు. ఈ పథకం ఆరు సంవత్సరాలు పాటు కొనసాగనుంది. రైతుల అభివృధిని దృష్టిలో ఉంచుకుని కేంద్ర వ్యవసాయ మంత్రి చౌహాన్ సింగ్ ఈ పథకానికి ఆమోదముద్ర తెలిపారన్నారు. రైతుల ఆదాయం పెంపు దిశగా కృషి చేస్తున్న ప్రధాని నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. 2047 నాటికి ప్రపంచంలోనే అభివృధి దేశమే లక్ష్యంగా నరేంద్ర మోడీ ముందుకు సాగుతున్నారన్నారు.

Also Read: Gadwal Collector: అన్నదాతలు ఆర్థికంగా ఎదిగేందుకు అధికారులు కృషి చేయాలి : కలెక్టర్ బి. ఎం. సంతోష్

Just In

01

Sujeeth Birthday: సుజీత్ బర్త్‌డే.. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ ట్వీట్ చూశారా?

Bottu Gambling: చిత్తు-బొత్తు ఆడుతున్న ఏడుగురి అరెస్ట్.. ఎంత డబ్బు దొరికిందంటే?

Mega Jathara: అసలైన మెగా జాతర సంక్రాంతి నుంచి మొదలు కాబోతోంది.. మెగా నామ సంవత్సరం!

Pak Targets Salman: సల్మాన్ ఖాన్‌పై పగబట్టిన పాకిస్థాన్.. ఉగ్రవాదిగా ముద్ర వేసేందుకు భారీ కుట్ర!

Hindu Rituals: దేవుడి దగ్గర కొబ్బరికాయను ఇలా కొడితే.. లక్ష్మీదేవి అనుగ్రహం పక్కా?