Israel-Hamas
అంతర్జాతీయం, లేటెస్ట్ న్యూస్

Hostage Release: బందీలను విడిచిపెట్టిన హమాస్.. ఇజ్రాయెల్‌లో సంబరాలు.. టెల్‌అవీవ్‌లో ప్రత్యక్షమైన డొనాల్డ్ ట్రంప్

Hostage Release: దాదాపు రెండేళ్ల తర్వాత ఇజ్రాయెల్ – హమాస్‌ మధ్య యుద్ధం ముగిసింది. ఇటీవలే ఖరారైన గాజా కాల్పుల విరమణ ఒప్పందం ప్రకారం, తమ చెరలో ఉన్న ఇజ్రాయెల్ బందీలను  హమాస్ సోమవారం విడుదల (Hostage Release) చేసింది. ప్రాణాలతో ఉన్న 20 మంది ఇజ్రాయెల్ పౌరులను రెడ్ క్రాస్‌ సంస్థకు అప్పగించింది. రెండు దశల్లో ఈ 20 మందిని అప్పగించారు. మొదటి దశలో సోమవారం ఉదయం ఏడుగురిని, రెండవ దశలో మిగిలిన 13 మందిని ఒకేసారి విడుదల చేశారు. దీంతో, రెండేళ్లపాటు బందీగా ఉన్నవారికి విముక్తి లభించింది. వారంతా త్వరలోనే ఇళ్లకు చేరుకోబోతున్నారు.

విడుదలకు ముందు కొంతమంది బందీలు తమ కుటుంబ సభ్యులతో వీడియో కాల్‌ ద్వారా మాట్లాడారు. ఆ సంభాషణలు చాలా భావోద్వేగభరితంగా సాగాయి. రెండేళ్ల తర్వాత తమవారు కనిపించడంతో కుటుంబ సభ్యులు కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. మరోవైపు, బందీల విడుదల నేపథ్యంలో, ఇజ్రాయెల్ వ్యాప్తంగా సంబరాల వాతావరణం నెలకొంది. దేశ జాతీయ పతాకాన్ని చేతబట్టుకొని పౌరులు వీధుల్లో సెలబ్రేషన్లు జరుపుకున్నారు. శాంతి ఒప్పందంలో భాగంగా 20 మంది ఇజ్రాయెల్ బందీలను హమాస్ విడిచిపెట్టాల్సి ఉండగా, తమ దేశ జైళ్లలో ఉన్న 1,900 మందికి పైగా పాలస్థీనా ఖైదీలను ఇజ్రాయెల్ విడుదల చేయనుంది.

Read Also- Nandamuri Balakrishna: బాలకృష్ణకు ‘మంత్రి పదవి డిమాండ్’.. చంద్రబాబు ఒప్పుకోగలరా?.. సమీకరణలు ఇవేనా?

ఇజ్రాయెల్‌లో ట్రంప్

బందీల అప్పగింత నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇజ్రాయెల్ రాజధాని టెల్‌అవీవ్‌లో ప్రత్యక్షమయ్యారు. గాజా కాల్పుల విరమణ ఒప్పందానికి మధ్యవర్తిగా వ్యవహరిస్తున్న ఆయన, గాజా శాంతి ఒప్పంద సదస్సులో పాల్గొనేందుకు ఈజిప్ట్ వెళ్లాల్సి ఉంది. అటు వెళ్లడానికి ముందుగా ఇజ్రాయెల్‌కు వెళ్లారు. ‘‘యుద్ధం ముగిసిపోయింది. ఇదొక గొప్ప రోజు. ఇది నూతన ప్రారంభం’’’ అని ట్రంప్ వ్యాఖ్యానించారు. కాల్పుల విమరణ ఒప్పందానికి స్వాగతంగా ఈ వ్యాఖ్యలు చేశారు. అదేవిధంగా, ఆయుధాలకు దూరంగా ఉండాలనే నిబంధనను హమాస్ నిర్వాహకులు కట్టుబడి ఉంటారని, ఆ విషయంలో తనకు నమ్మకం ఉందని ట్రంప్ దీమా వ్యక్తం చేశారు.

ఇజ్రాయెల్ పార్లమెంట్‌లో డొనాల్డ్ ట్రంప్‌కు స్టాండింగ్ ఓవేషన్ లభించింది. శాంతి ఒప్పందంలో కీలక పాత్ర పోషించడంతో పాటు ఇజ్రాయెల్‌కు అన్ని విధాలా మద్దతు ఇచ్చినందుకు చట్టసభ్యులు ఈ విధంగా తమ గౌరవాన్ని తెలియజేశారు.

Read Also- DDA Recruitment 2025: ఢిల్లీ డెవలప్‌మెంట్ అథారిటీలో 1732 ఉద్యోగాలు.. వెంటనే, అప్లై చేయండి!

తర్వాత ఏంటి?

గాజా శాంతి ఒప్పందం ప్రకారం, ఇజ్రాయెల్ పౌరులకు సంబంధించిన కనీసం 28 మంది బందీల మృతదేహాలను కూడా అప్పగించాల్సి ఉంటుంది. కానీ, అందుకు అవకాశాలు దాదాపు లేవు. మృతదేహాలు అప్పగించని పరిస్థితుల్లో, మృతదేహాలను గుర్తించేందుకు ఒక అంతర్జాతీయ బృందం పనిచేస్తుంది. ఇజ్రాయెల్ బందీలు ఏమయ్యారనేది నిర్ధారిస్తుంది. మరోవైపు, ఇజ్రాయెల్ జైళ్లలో ఉన్న పాలస్థీనా ఖైదీలను ఎప్పుడు విడుదల చేస్తారనే సమయం ఇంకా ప్రకటించలేదు. ఖైదీల జాబితాలో ఉన్నవారిలో 250 మంది ఇజ్రాయెల్ పౌరులపై దాడి చేసిన కేసుల్లో జీవిత ఖైదు అనుభవిస్తున్నారు. మిగతావారు యుద్ధ సమయంలో పట్టుబడినవారు. ఇలాంటివానే 1700 మంది వరకు ఉంటారు. వీరిని వెస్ట్ బ్యాంక్, గాజాకు తిరిగి పంపించనున్నారని సమాచారం.

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!