Bhadradri Kothagudem: అధిక వర్షాలతో అన్నదాతల అవస్థలు అనంతం. రాత్రి కురిసిన కుండపోత వర్షానికి దోమలవాగు పొంగి పొర్లడంతో (Bhadradri Kothagudem) బూర్గంపాడు, సోంపల్లి రైతుల పంట పొలాలు పూర్తిగా జలమయం కాగా ఈ ఏడాది ఋతుపవనాలు ఆలస్యంగా మొదలు కావడంతో వర్షాకాలం పంటలకు కొంతచేదు అనుభవం అనే చెప్పాలి. వెనక వర్షాలు వరదలతో ప్రత్తి, వరి రైతుల (Farmers) ఆశలు నీటిపాలే అవుతున్నాయి. ఈ వర్ష ప్రభావంతో ప్రత్తి రైతులు (Farmers) ఎకరానికి ఐదు కింటాలు నష్టపోయినట్లే అని తెలుపుతున్నారు.
Also Read: Bhadradri Kothagudem: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో.. ఆదివాసి అడవి బిడ్డలకు తీరని తిప్పలు
ఒక ఎకరానికి 40 వేల రూపాయల నష్టం
వరి నీట మునగడంతో అపార నష్టం జరిగినట్లు వరి రైతులు(Farmers) తెలుపుతున్నారు. వెనక వర్షాలు అధికంగా పడటంతో కాయలు కుళ్ళిపోయి సుమారు ఒక ఎకరానికి 40 వేల రూపాయల నష్టం వాటిల్లుతున్నట్లు వాపోతున్నారు. సంబంధిత అధికారులు స్పందించి రైతులకు నష్ట పరిహారం చెల్లించాలని రైతులు(Farmers) కోరుతున్నారు.ఓ పక్క ప్రభుత్వాలు ఎరువుల కొరత సృష్టించి రైతువెన్ను విరిచినప్పటికీ పట్టువదలని విక్రమార్కుడిలా పంట పండిస్తుండటంతో ప్రకృతి ఓర్వలేక కన్నెర్ర చేసింది. రైతే రాజు, జై కిసాన్ అనే పదాలలొ ఉన్న వెలుగు వారి జీవితాల్లో లేదు. రైతు విత్తిన విత్తనం దగ్గర నుండి భూతల్లిని,ప్రకృతిని ప్రతిక్షణం మొక్కుతూనే ఉంటాడు.
రైతు గోస ఎవరికి పట్టదు
కానీ రైతు(Farmers) గోస ఎవరికి పట్టదు అతివృష్టి, అనవృష్టి కి నష్టపోయేది రైతే. రైతు ఆరుగాలం కష్టపడితేనే మన ఐదు వేళ్ళు నోట్లోకి వెళతాయి అనేది సత్యం. అటువంటి రైతు అన్ని విధాలుగా నష్టపోతూ జీవనం సాగిస్తున్నాడు. ఒక కొవ్వొత్తి తనను తాను కాల్చుకుంటూ వెలుగునివ్వటంలో మానవాళికి ఎంత తోడ్పడుతుందో, రైతుకూడా తను నష్టపోతు రాష్ట్రంలో ఆకలి కేకలు లేకుండా వ్యవసాయం చేస్తూ ప్రజలకు సాయం చేస్తూన్నాడు.
ఎరువుల కొరతతో తీవ్రంగా నష్టం
అయినప్పటికీ ఓ పక్క ప్రభుత్వాలు మరోపక్క ప్రకృతి రైతును నట్టేట ముంచుతునే ఉన్నాయి. ఆదుకోవాల్సిన ప్రభుత్వాలు రైతును అంటరాని వానిలా చూస్తు ఎరువుల కొరతతో తీవ్రంగా నష్టపరుస్తున్నారు. కష్టపడి పంటను పండిస్తే ఒక్క వర్షంతో వరదల్లో పంటలు కొట్టుకుపోతున్నాయి. రైతు బ్రతికేదెలా రైతును(Farmers) కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క పౌరుడు పై ఉంది. చేయి చేయి కలుపుదాం రైతుకు సాయం చేద్దాం,రైతుని రాజుని చేద్దాం.
