Harish Rao: దేశంలోని ఒక్కో రాష్ట్రానికి ఒక్కో నీతి ఉంటుందా అని మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు(Harish Rao) నిలదీశారు. అత్యంత ముఖ్యమైన విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్ళాలని డిమాండ్ చేశారు. తెలంగాణ(Telangana) భవన్లో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. అపెక్స్ కౌన్సిల్ మీటింగ్‌కు వెళ్ళొద్దని చెప్పినా.. సీఎం రేవంత్(CM Revanth) వెళ్ళటం వెనుక ఆంతర్యమేంటి అని నిలదీశారు. కేంద్రమంత్రి రాసిన లేఖ అబద్ధమా? కర్ణాటక(Karnataka), మహారాష్ట్ర(Maharasta) లేఖలు అబద్ధమా? అని ప్రశ్నించారు.
ఖర్గే కోసం కర్ణాటక పోయిన రేవంత్.. ఆల్మట్టి ఎత్తుపై ఎందుకు మాట్లాడలేదని మరో ప్రశ్న సంధించారు. రాష్ట్ర ప్రయోజనాలను కాపాడేది కేసీఆర్(KCR) మాత్రమే అని స్పష్టం చేశారు. తెలంగాణ నీటి హక్కులు కాపాడాలంటే బీఆర్ఎస్‌ను కాపాడుకోవాలన్నారు. కేసీఆర్ మాత్రమే తెలంగాణ హక్కులను కాపాడుతారని వెల్లడించారు. కేసీఆర్ మళ్ళీ అధికారంలోకి వస్తేనే.. తెలంగాణకు ప్రయోజనాలు కాపాడుతారని అన్నారు. కేంద్ర ప్రభుత్వ ప్రాణం ఏపీ ఎంపీల చేతులో ఉందన్నారు. బీఆర్ఎస్‌కు ఎంపీలు ఉండి ఉంటే తెలంగాణ హక్కులపై పార్లమెంట్‌లో కోట్లాడేవారని అన్నారు. ప్రాంతీయ పార్టీల ఎంపీలు ఉంటేనే రాష్ట్రాలకు న్యాయం అని పేర్కొన్నారు.
కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి..
బనకచర్లపై కేంద్రమంత్రి సీఆర్ పాటిల్(CR Patil) లేఖపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించాలని మాజీమంత్రి హరీష్ రావు డిమాండ్ చేశారు. బనకచర్ల ప్రాజెక్టుపై బీఆర్ఎస్(BRS) చెప్పినవన్నీ నిజమవుతున్నాయన్నారు. కమీషన్ల కోసం సీఎం రేవంత్ రెడ్డి బనకచర్లకు సహకరిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రానికి జరుగుతున్న నష్టంపై కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి(Kishan Reddy), బండి సంజయ్(Bandi Sanjay)లు ఎందుకు స్పందించటం లేదని ప్రశ్నించారు. సీడబ్ల్యూసీ(CWC) అనుమతులు లేకుండా.. డీపీఆర్(DPR) ఎలా ఆమోదిస్తారని ప్రశ్నించారు.
Also Read: Hyderabad Collector: తల్లిదండ్రులు మీ పిల్లలు బాగుండాలంటే.. ఈ చుక్కలు తప్పక వేయించాల్సిందే!
ఆల్మట్టి ఎత్తు పెంపు పై మౌనం..
ఇది ఇట్లుంటే.. మొన్న కర్ణాటకకు పోయినవు కదా? పోయి ఏం చేసినవు. ఆల్మట్టి మరిచినవు. ఆల్ ఈజ్ వెల్ అనుకుంట వచ్చినవు. తెలంగాణ ఆత్మ ఉంటే, తెలంగాణ సోయి ఉంటే.. ప్రజల కష్టాల గురించిన పట్టింపు ఉంటే.. అక్కడ ప్రభుత్వ పెద్దలను కలిసి ఆల్మట్టి ఎత్తు పెంచొద్దని అడిగేటోనివి కదా అని హరీష్ రావు అన్నారు. కర్ణాటకలో ఉన్నది మీ పార్టే కదా, మీ సిద్దారామయ్యే కదా, మీ శివ కుమారే కదా.. ఖర్గే తోని ఒక ఫోన్ చేయించకపోతివి. ఆల్ మట్టి ఎత్తు పెంచితే తెలంగాణ ఎడారి అయితదని ఒక మాట చెప్పించకపోయావా అని అన్నారు. పోనీ ఖర్గే ఆరోగ్యం బాగా లేదనుకుంటే నువ్వే పోయి ముఖ్యమంత్రినో, ఉప ముఖ్యమంత్రినో కల్వనుంటివి.
మీ శివకుమారే కదా అక్కడ ఇరిగేషన్ మంత్రి..మీరిద్దరు జాన్ జిగ్రే కదా అంటే ఎద్దవా వేశారు. ఇస్తినమ్మా వాయనం.. పుచ్చుకుంటినమ్మా వాయనం అని మీ మధ్య మూటల మార్పిడి కూడా జరుగుతది కదా ని అన్నారు. మూటల సంగతి పక్కకు పెట్టి, ఆల్ మట్టి ఎత్తు పెంచొద్దని ఒక మాట చెప్పకపోతివని అన్నారు. అయిందానికి, కాని దానికి ఢిల్లీకి పోతరు కదా.. ఢిల్లీ కాంగ్రెస్ తోని కర్ణాటక కాంగ్రెస్ కు ఒక మాట చెప్పియోచ్చు కదా అని అన్నారు. ఎప్పుడు ఢిల్లీకి బ్యాగులు మోసుడే కాదు. అప్పుడప్పుడు ప్రజల బాగోగులు కూడా మొయ్యాలని హరీష్ రావు అన్నారు.
చంద్రబాబు ఓపెన్ ఆఫర్..
కృష్ణా వాటాపై సీఎంకు స్పష్టత లేదు. రాష్ట్ర ప్రయోజనాల పట్ల ముఖ్యమంత్రికి చిత్తశుద్ది కాదు, అసలు చిత్తమే లేదు. ఆయనకు బేసిన్లు తెల్వదు, బేసిక్సు తెల్వదు అనేది అందరికి తెలిసిన విషయమే అని ఎద్దేవా వేశారు. అటువంటి ముఖ్యమంత్రికి నీటి వాటాల గురించి తెలిసే అవకాశం అంతకంటే లేదని అన్నారు. ఒకసారి కృష్ణాలో మాకు 500 టీఎంసీలు ఇచ్చి నువ్వు ఏమన్నా చేసుకో అని చంద్రబాబుకు ఓపెన్ ఆఫర్ ఇస్తారు. ఇంకోసారి 904 టీఎంసీల కోసం కొట్లాడుతున్నా అని అంటారు. ట్రిబ్యునల్ ముందు 763 టీఎంసీలు అంటారు. గంటకో మాట, ఘడియకో లెక్క అన్నారు. మేధావులు ఆలోచించాలి..? సరే ముఖ్యమంత్రికి మూటలు తప్ప ఇంకోటి తెల్వదు కనీసం మంత్రులకైనా సోయి ఉందా. అని అన్నారు. గోదావరి, కృష్ణా నదీ జలాల వాటాలో తెలంగాణ(Telangana)కు శాశ్వత ద్రోహం జరుగుతుంటే కాంగ్రెస్(Congress) మాట్లాడటం లేదు. మేధావులు ఆలోచాంచాలని కోరుతున్నాని, బనకచర్ల అప్రైజల్ కు ఎట్ల వస్తది, కేంద్ర జల మంత్రిత్వ శాఖ ఎట్ల స్వీకరిస్తదన్నారు.
Also Read: Harish Rao: జోర్డాన్ గల్ఫ్ కార్మికులను స్వదేశానికి తీసుకురావాలని హరీష్ రావు డిమాండ్!
