MP Laxman (imagecredit:swetcha)
Politics

MP Laxman: బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్‌కు అపహాస్యం ఎందుకు.. ఎంపీ లక్ష్మణ్ ఫైర్

MP Laxman: రాజ్యాంగం ప్రకారం చేపట్టాల్సిన బీసీ రిజర్వేషన్లను కాంగ్రెస్(Congress) అపహాస్యం చేసిందని, కులాలవారీగా కుట్రలు పెంచి కాంగ్రెస్ లబ్ధి పొందేందుకు ప్రయత్న చేస్తోందని రాజ్యసభ సభ్యుడు లక్​ష్మణ్(MP Laxmana) విమర్శలు చేశారు. నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కేవలం ఎన్డీయే(NDA)కు గండి కొట్టాలనే పన్నాగంలో భాగంగానే ఓట్ల చోరీ, బీసీ రిజర్వేషన్ల పేరుతో కాంగ్రెస్ గందరగోళం సృష్టిస్తోందని మండిపడ్డారు. ఇచ్చిన హామీలు ఎందుకు అమలుచేయలేదో సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

కులగణన వివరాలు..

రిజర్వేషన్లపై రాష్ట్ర ప్రభుత్వానికి అవగాహన ఉందా? అని, ఉంటే ఈ ఒంటెత్తు పోకడల వెనక ఆంతర్యమేంటని ప్రశ్నించారు. ట్రిబుల్ టెస్ట్ విధానాలకు వ్యతిరేకంగా అవగాహన లేకుండా జీవోలు, ఆర్డినెన్స్ లతో గందరగోళం సృష్టిస్తే సరిపోతుందా? అని లక్ష్​మణ్ ఆగ్రహం వ్యక్తంచేశారు. కులగణన వివరాలు పబ్లిక్ డొమైన్ లో ఎందుకు పెట్టలేదని, ఎందుకంత గోప్యత అని నిలదీశారు. బీసీ(BC)లు రాజకీయ, ఆర్థిక, విద్యా, ఉద్యోగ అంశంలో వెనుకబడ్డారని సర్వేలో ఎందుకు నిరూపించలేకపోయారని లక్ష్మణ్ ప్రశ్నల వర్షం కురిపించారు. అనుభవం గల అభిషేక్ మను సింగ్వి(Abhishek Manu Singhvi), అడ్వకేట్ జనరల్ కు ప్రభుత్వం చేసిన సర్వే డేటా గురించి తెలియకపోవడం దేనికి సంకేతమని ప్రశ్నించారు. బీజేపీని విమర్శించే నైతిక విలువ బీఆర్ఎస్ కోల్పోయిందని విమర్శలు చేశారు.

Also Read; CM Revanth Reddy: ఫ్యూచర్ సిటీకి రండి.. చైనా తర్వాత హైదరాబాద్ బెస్ట్.. అమెరికాకు సీఎం పిలుపు

కాకా కాలేకర్ కమిషన్ రిపోర్ట్..

కామారెడ్డి డిక్లరేషన్(Kamareddy Declaration) లో బీసీ సబ్ ప్లాన్ కు చట్టబద్ధత కల్పిస్తామన్నారని, మరి సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)కి ఏ కోర్టులు అడ్డమొచ్చాయో చెప్పాలన్నారు. 42 శాతం రిజర్వేషన్లు దేవుడెరుగని, బీసీ(BC)లకు ఇచ్చిన ఇతర హామీలెందుకు అమలుచేయడం లేదని లక్ష్​మణ్ ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ కు కొత్త అని, కాంగ్రెస్ ది అభివృద్ధి వ్యతిరేక డీఎన్ఏ(DNA) అంటూ పైరయ్యారు. కాకా కాలేకర్ కమిషన్ రిపోర్ట్ ను చెత్త బుట్టలో వేసింది కాంగ్రెస్ ప్రభుత్వం కాదా? అని నిలదీశారు. క్యాస్ట్ సెన్సెస్ చేయడం ద్వారానే అన్ని సామాజిక వర్గాలకు న్యాయం జరుగుతుందన్నారు. రాహుల్ గాంధీ(Rahul Gandhi) కుట్రలన్నీ ప్రజలు భగ్నం చేస్తున్నారని, తెలంగాణ(Telangana) సమాజం వాస్తవాలను గ్రహించి, కాంగ్రెస్ పన్నాగాలను గుర్తించాలని లక్ష్​మణ్​ కోరారు.

Also Read: FUNKY Movie Teaser: ‘ఫంకీ’ టీజర్ రిలీజ్.. విశ్వక్ నోట అనుదీప్ మార్క్ పంచ్‌లు.. హిట్ కొట్టేలాగే ఉన్నారుగా!

Just In

01

Mass Jathara: రవితేజ ‘మాస్ జాతర’ రిలీజ్ మరొక్క రోజు వెనక్కి!.. ఎందుకంటే?

Gold Price Today: తగ్గిన గోల్డ్ రేట్స్.. కొనాలనుకునేవారికీ ఇదే మంచి ఛాన్స్!

Minister Konda Surekha: స్వేచ్ఛ ఎఫెక్ట్.. దేవాదాయశాఖపై మంత్రి కొండా సురేఖ సమీక్ష!

Rashmika Mandanna: సౌత్ ఇండియాలో రష్మికా మందాన టాప్ హీరోయిన్ ఎలా అయ్యారో తెలుసా.. రీజన్ ఇదే..

Election Commission: జూబ్లీహిల్స్‌లో సోదాలు ముమ్మరం.. అభ్యర్థుల వెనక షాడో టీమ్‌లు