Lulu-Mall
ఆంధ్రప్రదేశ్, లేటెస్ట్ న్యూస్

Lulu Mall Controversy: లులూ మాల్‌‌పై పవన్ కళ్యాణ్ కన్నెర్ర..! మద్దతుగా చంద్రబాబు స్పందన!

Lulu Mall Controversy: ఆంధ్రప్రదేశ్‌లో ‘లులూ మాల్’ (Lulu Mall Controversy) పెట్టుబడుల వ్యవహారం మరోసారి హాట్‌ టాపిక్‌గా మారింది. గత ప్రభుత్వం రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టనివ్వకుండా, ఇబ్బందులకు గురిచేసి వెళ్లగొట్టిందంటూ నాడు విపక్షంలో ఉన్న టీడీపీ, జనసేన పార్టీలు తీవ్రంగా విమర్శించాయి. ఎన్నికల్లో ప్రచారాస్త్రంగా కూడా వాడుకున్నాయి. అయితే, గతేడాది కూటమి సర్కారు కొలువుదీరిన తర్వాత లులూ మాల్ తిరిగి ఏపీలో అడుగుపెట్టింది. పెట్టుబడులు పెట్టాలంటూ ఆహ్వానించడంతో పాటు సర్కారు అన్ని విధాలా సహాయ, సహకారాలు అందిస్తోంది. అయితే, ఆహ్వానించిన ప్రభుత్వమే ఇప్పుడు ఒకింత అసహనం వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తోంది. లులూ మాల్ యాజమానం పెడుతున్న కండీషన్లు, ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్న వైఖరే ఇందుకు కారణమని సమాచారం.

Read Also- 120 marks for 100: ఇదేందయ్యా ఇదీ.. 100కి 120 మార్కులు ఇచ్చిపడేసిన యూనివర్సిటీ

గొంతెమ్మ కోర్కెలపై పవన్ ఆగ్రహం!

లులూ మాల్‌ గొంతెమ్మ కోర్కెలు కోరుతోందంటూ కూటమి ప్రభుత్వ పెద్దలు ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం. శుక్రవారం జరిగిన ఏపీ కేబినెట్ సమావేశంలో ఈ మేరకు లులూ మాల్ వ్యవహారశైలిపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్రానికి తాను మాత్రమే అవసరమన్న ధోరణి కనిపిస్తోందని పవన్‌ కల్యాణ్‌ అసహనం వ్యక్తం చేశారు. లులూకు ఇచ్చే భూముల విలువ ఎంత?, అందజేస్తున్న రాయితీలు ఎన్ని?, లులూ ఇచ్చే ఉద్యోగాలు ఎన్ని? అని కేబినెట్ భేటీలో ఆయన ప్రశ్నించారు. పవన్ సందేహాలు, అధికారుల వివరణ విన్నాక  ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా లులూ వ్యవహారంపై అసహనం వ్యక్తం చేసినట్టుగా సమాచారం. కేబినెట్ భేటీలో భారీ పెట్టుబడుల ప్రతిపాదనలపై చర్చ సందర్భంగా ఈ పరిణామం జరిగినట్టు తెలుస్తోంది.

Read Also- Ponguleti Srinivasa Reddy: ‘మాది గేదెలాంటి ప్రభుత్వం’.. మంత్రి పొంగులేటి ఆసక్తికర వ్యాఖ్యలు

లులూ డిమాండ్లు ఇవేనా?.. ఎలా సాధ్యం?

ప్రభుత్వాలు మూడేళ్లకు ఒకసారి 10 శాతం మేర లీజు పెంచుతుంటాయి. కానీ, తమకు 5 సంవత్సరాలకు ఒకసారి కేవలం 5 శాతం మాత్రమే లీజు పెంచాలని లులూ డిమాండ్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అసహనం వ్యక్తం చేయడానికి ఇదే ప్రధాన కారణమని సమాచారం. ప్రభుత్వం ఇచ్చే భూమి, రాయితీలు తీసుకుంటూ పైగా ప్రభుత్వానికి షరతులు విధించడంపై ఆయన గుర్రుగా ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. నిజంగా ఫుడ్ ప్రాసెసింగ్ మాత్రమే నిర్వహిస్తారా?, గోవధ లాంటి పనులేమైనా చేస్తారా? అని ఆయన ఆరా తీయడం, దీనిపై మంత్రులు నాదెండ్ల మనోహర్, మంత్రి అనగాని సత్యప్రసాద్ కల్పించుకొని మాట్లాడడం వంటి ఆసక్తి పరిణామాలు జరిగాయి. మొత్తంగా, లులూ మాల్ షరతులు ఆమోదయోగ్యంగా ఉన్నాయో లేవో పరిశీలిస్తామని మంత్రులు చెప్పడంతో ఈ అంశంపై చర్చను ముగించారట. మరి, లులూ మాల్‌ డిమాండ్లను ప్రభుత్వం సమగ్రంగా పరిశీలించిన తర్వాత ఎలాంటి పరిణామాలు ఉంటాయో చూడాలి.

Just In

01

Swetcha Effect: స్వేచ్ఛ కథనంతో సంచలనం.. రంగంలోకి దిగిన నిఘా వర్గాలు డీఎస్పీ అరాచకాలకు తెర!

Ellamma movie: బలగం వేణు ‘ఎల్లమ్మ’ సినిమాకు సంగీత దర్శకుడు ఎవరంటే?

Liquor License: వైన్​ షాపుల లాటరీకి హైకోర్టు గ్రీన్ సిగ్నల్!

Telugu States Disasters 2025: ప్రకృతి గట్టిగానే హెచ్చరిస్తుందిగా.. లోకంలో పాపాలు ఆపకపోతే ఇలాంటి వినాశనాలు తప్పవా?

Aryan second single: విష్ణు విశాల్ ‘ఆర్యన్’ సెకండ్ సింగిల్ వచ్చేసింది.. చూసేయండి మరి..