Medical Scam (imagecredit:twitter)
హైదరాబాద్

Medical Scam: భాగ్యనగరంలో రూల్స్‌కు విరుద్ధంగా స్పెషాలిటీ క్లినిక్‌లు

Medical Scam: డాక్టర్ టీ ఈ దివ్య మాలిని హైదరాబాద్ లో డాక్టర్ అనందవల్లి న్యూరాలజీ క్లినిక్ పేరిట వైద్యం అందిస్తున్నారు. అయితే ఈ డాక్టర్ ఎండీ బయోకెమిస్ట్రీ(Biochemistry) కోర్సు పూర్తి చేసినట్లు తెలంగాణ మెడికల్ కౌన్సిల్(Telangana Medical Council) లో రిజిస్టర్ అయ్యారు. కానీ న్యూరాలజీ క్లినిక్(Neurology Clinic) నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించిన కోర్సు, కనీసం జనరల్ మెడిసిన్ వంటి పీజీ కోర్సులేవీ చేయలేదు. యథేచ్చగా న్యూరాలజీ పేషెంట్లకు ట్రీట్మెంట్ ఇవ్వడం గమనార్హం. పైగా డిస్ ప్లే బోర్డులో పీజీడీజీఎమ్ (జీరియాట్రిక్స్) అని మెన్షన్ చేశారు. ఈ పీజీ కోర్సుతోనూ సూపర్ స్పెషాలిటీ విభాగానికి చెందిన న్యూరాలజీ కి ట్రీట్మెంట్ చేయడం నిబంధనలకు విరుద్ధం. మెడికల్ ఎథిక్ గైడ్ లైన్స్ ప్రకారం స్పష్టమైన బోర్డు పెట్టాలి. కానీ ఈవేమీ జరగడం లేదు. ఇండియన్ మెడికల్ కౌన్సిల్ రూల్స్ ను కూడా బ్రేక్ చేసినట్లే. ఇలాంటి నిర్లక్ష్యం ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడటమే అని ఎక్స్ పర్ట్స్ చెబుతున్నారు. ఈ క్లినిక్ పై ఇప్పటికే హైదరాబాద్ డీఎమ్ హెచ్ వో(DMHO)కు కంప్లైంట్ కూడా అందినట్లు తెలిసింది.

ప్రజలకు ప్రమాదం…?

ఈ డాక్టర్ ఒక్కరే కాదు.. గ్రేటర్ హైదరాబాద్(Hyderabada)లో చాలా మంది డాక్టర్లు ఈ తరహాలో వైద్యం అందిస్తున్నట్లు మెడికల్ కౌన్సిల్ కు ఫిర్యాదులు అందుతున్నాయి. హైదరాబాద్(Hyderabad), మేడ్చల్(Mrdchel), రంగారెడ్డి(Rangareddy) జిల్లాల్లో ఇలాంటి క్లినిక్ లు పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయి. ఒక కోర్సు చేసి.. మరో విభాగానికి సంబంధించిన వైద్యం అందిస్తున్నారు. పైగా సూపర్ స్పెషాలిటీ విభాగాలకు చెందిన వైద్యం అందించడం గమనార్హం. ఇవి అత్యంత ప్రమాదకరమంటూ సీనియర్ డాక్టర్లు చెప్తున్నారు. ప్రజలను మోసం చేసేందుకు కొందరు డాక్టర్లు ఇలాంటి ట్రిక్ లను ఎంపిక చేసుకోవడం ఆశ్చర్యంగా ఉన్నదంటున్నారు. మెట్రోపాలిటిన్ సిటీలో ఇంత నిర్లక్ష్​యంగా వైద్యం అందించడాన్ని సర్కార్ సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం ఉన్నదని సీనియర్ వైద్యులు కోరుతున్నారు.

Also Read: BC Reservations: ఇప్పుడేం చేద్దాం?.. బీసీ రిజర్వేషన్లపై ప్రభుత్వ కసరత్తు ప్రారంభం

ఆర్ ఎంపీ క్లినిక్ లలో ఎంబీబీఎస్ డాక్టర్లు…?

మెడికల్ కౌన్సిల్ తనిఖీల్లో అధికారులకు విస్తుపోయే అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. కొన్ని ప్రైవేట్ క్లినిక్ లో అర్హత లేని డాక్టర్లు వైద్యం అందిస్తుండగా, మరి కొన్ని హాస్పిటల్స్ లో కోర్సుకు, అందిస్తున్న ట్రీట్మెంట్ కు సంబంధం లేకుండా ఉన్నాయని వివరిస్తున్నారు. ఇప్పటి వరకు దాదాపు 550 హాస్పిటల్స్ కు ఎఫ్​ఐఆర్ లు నమోదు చేసినట్లు తెలిసింది. ఇక కొందరు ఆర్ ఎంపీలు నిర్వహిస్తున్న క్లినిక్ లు ఎంబీబీఎస్(MBBS) డాక్టర్లు వచ్చి వైద్య అందిస్తున్నారు. ఆర్ ఎంపీకి ఇలా సహకరించడం రూల్స్ బ్రేక్ చేయడమే నని కౌన్సిల్ ఆఫీసర్లు తెలిపారు. తాజాగా రంగారెడ్డి(Rangareddy) జిల్లా కందుకూరు మండల కేంద్రంలోని లలిత పాలిక్లినిక్ లో తెలంగాణ మెడికల్ కౌన్సిల్ వైస్ చైర్మన్ డాక్టర్ శ్రీనివాస్(Sriivass) బృందం రెయిడ్స్ నిర్వహించింది. ఆర్ ఎంపీ వెంకటయ్యపై ఎన్ ఎంసీ యాక్ట్ 34,54 ప్రకారం ఎఫ్​ ఐఆర్ నమోదు చేయగా, సహకరించిన ఎంబీబీఎస్ డాక్టర్ కు షోకాజ్ నోటీసులు ఇచ్చారు. అయితే గత కొన్ని రోజుల నుంచి టీజీ కౌన్సిల్ రెయిడ్స్ చేస్తున్నా.. కొన్ని క్లినిక్ లకు ఎలాంటి భయం లేకుండా పోయింది. నిర్లక్ష్యం వహిస్తూనే ఉన్నారు.

Also Read: Gold Rate Today: పండుగ ముందు భారీగా తగ్గిన గోల్డ్ రేట్స్.. ఎంత తగ్గిందో తెలుసా?

Just In

01

Swetcha Effect: స్వేచ్ఛ కథనంతో సంచలనం.. రంగంలోకి దిగిన నిఘా వర్గాలు డీఎస్పీ అరాచకాలకు తెర!

Ellamma movie: బలగం వేణు ‘ఎల్లమ్మ’ సినిమాకు సంగీత దర్శకుడు ఎవరంటే?

Liquor License: వైన్​ షాపుల లాటరీకి హైకోర్టు గ్రీన్ సిగ్నల్!

Telugu States Disasters 2025: ప్రకృతి గట్టిగానే హెచ్చరిస్తుందిగా.. లోకంలో పాపాలు ఆపకపోతే ఇలాంటి వినాశనాలు తప్పవా?

Aryan second single: విష్ణు విశాల్ ‘ఆర్యన్’ సెకండ్ సింగిల్ వచ్చేసింది.. చూసేయండి మరి..