GHMC (imagecredit:swetcha)
హైదరాబాద్

GHMC: అటు రోడ్డు సేఫ్టీ ఇటు శానిటేషన్.. సత్ఫలితాలను ఇస్తున్న బల్దియా ప్లాన్..!

GHMC: నగరాన్ని మరింత పరిశుభ్రంగా, ఆహ్లాదకరంగా తీర్చిదిద్దేందుకు జీహెచ్ఎంసీ(GHMC) ఇటీవలే మొదలు పెట్టిన శానిటేషన్ స్పెషల్ డ్రైవ్ సత్ఫలితాలనిస్తున్నది. నాలుగో రోజైన గురువారం కూడా గ్రేటర్‌లోని అన్ని ప్రాంతాల్లో పారిశుద్ధ్య పనులు ముమ్మరంగా కొనసాగాయి. ఈ నెల 6వ తేదీ నుంచి మొదలైన శానిటేషన్ స్పెషల్ డ్రైవ్‌లో గడిచిన మూడు రోజుల్లో 695 కాలనీల్లో చెత్త సేకరణ జరిపారు. వెయ్యి 82 మెట్రిక్ టన్నుల చెత్తను సేకరించి, డంపింగ్ యార్డుకు తరలించినట్లు అధికారులు తెలిపారు. ఇందులో 365 మెట్రిక్ టన్నుల సీ అండ్ డీ వ్యర్థాలను తొలగించినట్లు వివరించారు.

శానిటేషన్ డ్రైవ్‌లో నాలుగో రోజైన గురువారం జీహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్(RV Karnan) వెబెక్స్ ద్వారా శానిటేషన్ డ్రైవ్‌, రోడ్ సేఫ్టీ డ్రైవ్ జరుగుతున్న తీరుపై సమీక్ష నిర్వహించారు. ఈయన ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమం ప్రభావవంతంగా జరిగేలా పర్యవేక్షణ చేస్తున్నారు. ఈ క్రమంలో సానిటేషన్ అదనపు కమిషనర్ రఘు ప్రసాద్, జోనల్, డిప్యూటీ కమిషనర్‌లు తమ ఏరియాల్లో జరుగుతున్న డ్రైవ్‌పై కర్ణన్‌కు వివరించారు.

Also Read: Gadwal: గ్రామ పెద్ద దౌర్జన్యం.. 40 లక్షలు ఇవ్వలేదని రోడ్డును తవ్వేశారు.. వెంచర్ యజమానుల ఆవేదన

జోన్ల వారీగా శానిటేషన్ స్పెషల్ డ్రైవ్ వివరాలు

కూకట్‌పల్లి జోన్‌లో 92 కాలనీల్లో 30 టన్నుల సీ అండ్ డీ వ్యర్థాల తొలగించారు. ఎల్‌బీ నగర్ జోన్‌లో 46 కాలనీల్లో 60.5 టన్నుల సాలిడ్ వేస్ట్, 98 టన్నుల సీ అండ్ డీ వ్యర్థాలు తొలగించగా, చార్మినార్ జోన్‌లో 67 కాలనీల్లో 181 టన్నుల చెత్తను సేకరించారు. ఖైరతాబాద్ జోన్‌లోని మెహిదీపట్నం వార్డులో 71 టన్నుల చెత్త సేకరించగా, సికింద్రాబాద్ జోన్ లోని బేగంపేట్, సికింద్రాబాద్ సర్కిల్స్‌లో నిరంతర పారిశుద్ధ్య కార్యక్రమాలు జరుగుతున్నట్లు అధికారులు తెలిపారు.

డ్రైవ్‌లు ముమ్మరం చేయాలి

గ్రేటర్ పరిధిలో వర్షాలు తగ్గుముఖం పట్టినందున శానిటేషన్, రోడ్ సేఫ్టీ డ్రైవ్‌లను ముమ్మరం చేయాలి. వాహనదారులకు ఇబ్బందులు తలెత్తకుండా, ట్రాఫిక్ జామ్‌ లేకుండా చూసేందుకు రోడ్లపై గుంతలను యుద్ధ ప్రాతిపదికన పూడ్చాలి. ఇంజినీరింగ్ అధికారులు చర్యలు తీసుకోవాలి. ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమం ప్రభావవంతంగా జరిగేలా పర్యవేక్షించాలి. అదనపు కమిషనర్(శానిటేషన్), జోనల్ కమిషనర్ చొరవ చూపాలి.

Also Read: BC Reservations: ఇప్పుడేం చేద్దాం?.. బీసీ రిజర్వేషన్లపై ప్రభుత్వ కసరత్తు ప్రారంభం

Just In

01

CCI Cotton Procurement: పత్తి కొనుగోళ్లలో అవకతవకలు జరగొద్దు.. పినపాక ఎమ్మెల్యే

Kavitha Janam Bata: కేసీఆర్‌కు ఆ అవసరం లేదు.. నిజామాబాద్ ప్రెస్‌మీట్‌లో కవిత ఆసక్తికర వ్యాఖ్యలు

Kurnool Bus Accident: కర్నూలు బస్సు ప్రమాద ఘటనలో ట్విస్ట్.. చనిపోయిన వ్యక్తిపై కేసు.. ఏం జరగబోతోంది?

Drinking Culture: మందు బాబులు మద్యం సేవించిన తర్వాత ఎందుకు ఎక్కువగా తింటారో తెలుసా?

Bigg Boss Telugu 9: సంజన నోటికి లాక్.. క్లౌడ్ గేమ్ షురూ.. మేఘం వర్షిస్తేనే సేఫ్, లేదంటే?