Gutkha Stains In Metro: బిహార్ రాజధాని పట్నాలో కొత్తగా మెట్రో సేవలు ప్రారంభమయ్యాయి. ప్రారంభోత్సవం సందర్భంగా ఎంతో అందంగా దర్శనమిచ్చిన మెట్రో స్టేషన్లు.. కొందరు ప్రయాణికుల దెబ్బకు అధ్వాన్నంగా మారిపోయాయి. మెట్రో సేవలు మెుదలైన 3 రోజులకే ఓ స్టేషన్ లో గుట్కా మరకలు దర్శనమిచ్చాయి. మెట్రో గోడలు, రైలు నడిచే ట్రాక్ ఇలా ఎక్కడ చూసిన గుట్కా మరకలతో నిండిపోయాయి. ఇందుకు సంబంధించిన దృశ్యాలు వైరల్ కావడంతో.. నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు.
వీడియోలో ఏముందంటే?
బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ చేతుల మీదగా అక్టోబర్ 6న పట్నాలో మెట్రో రైలు ప్రారంభమైంది. అక్టోబర్ 7 నుంచి ప్రజల రాకపోకలకు అనుమతి ఇచ్చారు. అయితే కొందరు ప్రయాణికులు బాధ్యతారాహిత్యంగా వ్యవహరించి మెట్రోను మూడు రోజులకే భ్రష్టుపట్టించారు. తాజాగా వైరల్ అవుతున్న ఒక వీడియోను పరిశీలిస్తే.. ఒక వ్యక్తి పట్నాలోని ఓ మెట్రో స్టేషన్ లో ఉన్న వాస్తవ పరిస్థితి కళ్లకు కట్టాడు. అందులో మెట్రో స్టెప్స్ పక్కన ఉన్న గోడలపై గుట్కా మరకలు కనిపించాయి. అదే సమయంలో రైల్వే ట్రాక్ మీద కూడా కొందరు ప్రయణికులు పాన్ మసాలా తిని ఉమ్మి వేయడం స్పష్టంగా కనిపించింది.
पटना मेट्रो के शुरू हुए 4, 5 दिन ही हुए लेकिन गुटका गैंग सक्रिय हो गए है इसको रंगीन बनाने के लिए। सरकार को इसपर ध्यान देना चाहिए। pic.twitter.com/D2npWQy7J3
— छपरा जिला 🇮🇳 (@ChapraZila) October 9, 2025
గుట్కా గ్యాంగ్‌పై ఆగ్రహం
మెట్రో స్టేషన్ ను అపరిశుభ్రంగా మార్చిన గుట్కా గ్యాంగ్ పై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒక యూజర్ స్పందిస్తూ ‘అలా చేసిన వారితోనే ఆ గుట్కా మరకలు తుడిపించాలి. మనం రోడ్లు, మెట్రో కావాలి అంటాం. ప్రభుత్వం నిర్మిస్తే.. మనమే వాటిపై ఉమ్మేస్తాం. ఇది ఎంత సిగ్గుచేటు’ అని మండిపడ్డారు. మరొకరు స్పందిస్తూ.. ‘సర్కార్ అన్ని పాన్ మసాలా, గుట్కా కంపెనీలను పూర్తిగా నిషేధించాలి’ అని విజ్ఞప్తి చేశారు. ఇంకొకరు ‘దేశం మొత్తం గుట్కా గ్యాంగ్ వల్ల బాధపడుతోంది. గుట్కాపై పూర్తిగా నిషేధం అవసరం’ అని రాసుకొచ్చారు. మరో యూజర్ అయితే ఏకంగా ఇలా గుట్కా ఉమ్మే వారిని ఎన్ కౌంటర్ చేయాలని పేర్కొన్నారు.
Also Read: Jawan Sucide: జీవితంపై విరక్తి చెందా.. అమ్మ నాన్నలను బాగా చూసుకోండి.. జవాన్ బలవన్మరణం
పట్నా మెట్రో ప్రథమ దశ వివరాలు
పట్నాలో ప్రస్తుతం ఫస్ట్ ఫేజ్ మెట్రో సేవలు మాత్రమే అందుబాటులోకి వచ్చాయి. నగరంలో ప్రధానమైన ఐస్‌బీటీ (Inter State Bus Teminal), జీరో మైల్, భూతనాథ్ రోడ్ అనే ప్రాంతాలను కనెక్ట్ చేస్తూ 16.2 కి.మీ మేర బ్లూలైన్ మెట్రో సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఇందులో 5 ఎలివేటెడ్ స్టేషన్లు, 7 అండర్‌గ్రౌండ్ స్టేషన్లు ఉన్నాయి. పట్నా జంక్షన్, ఆకాశవాణి, గాంధీ మైదాన్, పీఎంసీహెచ్, పట్నా యూనివర్శిటీ, మొయిన్ ఉల్ హక్ స్టేడియం, రాజేంద్ర నగర్, మలాహీ పక్రీ, ఖేమ్ని చక్, భూతనాథ్, జీరో మైల్, న్యూ ఐస్‌బీటీ స్టేషన్ల గుండా మెట్రో నడుస్తోంది.
