Nambi Waterfall: చత్తీస్ ఘడ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లాలో ప్రకృతి ఒడిలో జలపాతాన్ని ఒలికిస్తూ పచ్చని ఎత్తైన గుట్టల మధ్యలో నుంచి ధారపోతగా పాలనూరుగాలంటే వరద నీటిని చిమ్ముతున్న నంబిజలపాతం(Nambi Waterfall) ప్రకృతి, పర్యాటకుల మదిని దోచేస్తున్నాయి. బీజాపూర్ జిల్లా(Bijapur District)లోని పచ్చని ప్రకృతి దృశ్యాలతో లోతుగా ఉన్న నంబి జలపాతాలు దాదాపు 700 అడుగుల ఎత్తులో నుండి ఉత్కంఠ భరితమైన సహజ అద్భుతంతో పాల నురగ లాంటి నీటిని అటవీ ప్రాంతంలో కురిపిస్తుంది. నంబి జలపాతం ఛత్తీస్గడ్ లో అత్యంత ఎత్తైన జలపాతాలలో ఒకటిగా పేరుగాంచింది. ఉసూర్ బ్లాక్ లోని గల్గాం గ్రామపంచాయతీ పరిధిలోని ప్రశాంతమైన నంబి గ్రామంలో ఉన్న ఈ మారుమూల గమ్యస్థానం శతాబ్దాలుగా ఎవరూ కూడా తాకబడకుండా ప్రకృతి హోయలను ప్రకృతి ప్రేమికులకు పంచుతుంది. ఈ నంబి జలపాతం బీజాపూర్ జిల్లాలోని అతి కొద్ది మంది పూర్వీకులకు మాత్రమే అందుబాటులో ఉంది.
నంబిజలపాతం ప్రత్యేకత
చత్తీస్గడ్(Chhattisgarh) రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లాలో ప్రకృతి ఒడిలో నిక్షిప్తమై ఉన్న నంబి జలపాతం ఎత్తు 700 అడుగుల పైగానే ఉంటుంది. సహజ సిద్ధమైన ప్రకృతి ఒడిలో ఉన్న నంబి జలపాతం తాకడానికి అలవికానంత ఎత్తులో ఉండి పర్యాటకులను కనువిందు చేస్తుంది. కమ్యూనిటీ పరంగా, పర్యాటక రంగ పరంగా ప్రకృతి సౌందర్య ఆతిథ్యం కోసం వచ్చే పర్యాటకులకు ప్రత్యేక శిక్షణతో కూడిన స్థానిక యువత భాగస్వామ్యంతో భద్రత కట్టుదిట్టం చేస్తూ పర్యాటకులకు గైడ్ చేస్తారు. సాహసం, సంస్కృతి కలిపిన ట్రెక్కింగ్ టైల్స్, ప్రామాణికమైన గిరిజన వంటకాలు లీనమయ్యే గ్రామ అనుభవాలు పర్యాటకులకు అత్యంత ప్రకృతి ఆనవాళ్లను ఆకర్షిస్తూ అందమైన, ఆహ్లాదకరమైన వాతావరణన్ని పర్యాటకులకు పంచుతుంది.
అనుకూలమైన సమయం..
జూన్(Jun) నుండి ఫిబ్రవరి(Feb) వరకు, జలపాతం పూర్తి ప్రవాహంతో ఉంటూ వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. నంబి జలపాతం వద్ద ఫోటోలు, ప్రకృతి ఆనవాళ్లు బంధించడానికి ఈ సమయం పర్యాటకులకు అనుకూలంగా ఉంటుంది. ఈ సమయంలో 300 అడుగుల నుండి 350 అడుగుల ఎత్తులో పాల నురగ లాంటి నీటి జల్లు కొండలపై నుంచి కిందకి జాలువారుతుంది. ఈ సమయంలో అక్కడి దృశ్యాలు అత్యంత ఆకర్షణీయంగా, ఆహ్లాదకరంగా పర్యాటకులకు కనువిందు చేస్తాయి. ఉప్పొంగుతున్న నీరు మంచు లాంటి పొగ మంచు సృష్టిస్తూ సందర్శకులను ప్రకృతి హొయలలో మైమరపింప చేస్తుంది.
Also Read: Bhadrachalam: భద్రాచలం ఎమ్మెల్యే పిఏ నవాబ్ ఆగడాలు.. రూ.3.60 కోట్లు ఇవ్వాలని డిమాండ్!
సహజ సిద్ధమైన అడవులు
బీజాపూర్ జిల్లాలోని ఉసూర్ బ్లాక్ లోని గల్గాం గ్రామపంచాయతీ పరిధిలో ప్రకృతి సౌందర్యంతో ఉట్టి పడేలా, ఎత్తయిన కొండలపై నుంచి పచ్చని సహజ సిద్ధమైన చెట్ల నడుమ నుంచి జాలువారుతున్న మంచు తెరలాంటి నీటి ప్రవాహం పర్యాటకులను అత్యంత మైమరిపింప చేస్తుంది. దీంతో కేంద్ర ప్రభుత్వం ఈ ప్రాంతాన్ని పర్యాటక రంగంగా తీర్చిదిద్ది స్థానిక యువతకు జీవనోపాధి కల్పించడమే ధ్యేయంగా ప్రణాళిక రచిస్తోంది. ఈ జలపాతం చుట్టూ ఉన్న ప్రాంతం ప్రకృతి ప్రేమికులకు స్వర్గధామంగా ఉంటుంది. దట్టమైన అడవుల పచ్చదనం, శ్రావ్యమైన పక్షుల కిలకిల రావాలు, వర్షం కురుస్తున్న సమయంలో ఉరుములతో కూడిన గర్జనలు మరుపురాని ఇంద్రియ అనుభవాన్ని ఈ ప్రాంతం పర్యాటకులకు ఎంతగానో ఆకట్టుకుంటుంది. పూర్తిగా ఈ జలపాతాన్ని పర్యాటకులు ఏమాత్రం తాకేందుకు అవకాశం లేకుండా ప్రకృతి, ప్రశాంతమైన ప్రకంపనలలో మునిగిపోవడానికి కూడా పుష్కలమైన అవకాశాలను అందిస్తుంది.
ప్రకృతి సంపదపై కేంద్ర ప్రభుత్వ దృష్టి
చత్తీస్గడ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లా ఉసూర్ బ్లాక్ లోని గల్గాం గ్రామపంచాయతీ పరిధిలో సహజసిద్ధమైన నంబి జలపాతం ప్రాంతాన్ని, ఆ ప్రాంతంలో నిక్షిప్తమైన సహజ సిద్ధమైన ప్రకృతి సంపదపై కేంద్రం దృష్టి సారిస్తోంది. పర్యాటక రంగంగా పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసి స్థానిక యువతకు జీవనోపాధి కల్పించడమే లక్ష్యంగా ప్రణాళికలు చేస్తోంది. నంబి జలపాతం ప్రయాణం సాహస యాత్రను ప్లాన్ చేసుకునే వారికి సహజ సౌందర్యం, సంస్కృతిక సారాంశం, ఉత్కంఠ భరితమైన అన్వేషణలను మిళితం చేసే అనుభవాన్ని ఈ ప్రాంతం పర్యాటకులకు ప్రత్యేకంగా అందిస్తుంది. విస్తారమైన అటవీ భూభాగంతో చుట్టుముట్టబడి ఉన్న ఈ ప్రకృతి సౌందర్య ప్రాంతం సాహస యాత్రికులకు అనుకూలమైన, అనువైన గమ్యంగా మారడంతో కేంద్ర ప్రభుత్వ దృష్టి ఈ ప్రాంతం పై నిలిచింది. అత్యంత ప్రకృతి ధర్మంగా పర్యాటకులకు ఆకర్షించే ఈ ప్రాంతాన్ని ప్రపంచంలోనే అత్యంత మెరుగైన పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు చత్తీస్గడ్ రాష్ట్ర ప్రభుత్వంతో పాటు కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించి ప్రత్యేక ప్రణాళికలు రచించింది.
నంబి జలపాతం కర్రెగుట్టల్లో..
చత్తీస్గడ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లాలో నిక్షిప్తమై ఉన్న నంబి జలపాతం కర్రెగుట్టల ప్రాంతానికి అత్యంత సమీపంలో ఉంటుందని అక్కడి స్థానికుల ద్వారా తెలుస్తోంది. ఇప్పటికే కర్రెగుట్టల ప్రాంతాన్ని ప్రపంచంలోనే అత్యంత పర్యాటక రంగంగా తీర్చిదిద్దేందుకు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళిక రచించిన విషయం విధితమే. అయితే కర్రెగుట్టల ప్రాంతంలో ఉన్న నంబి జలపాతం బేసిక్ చేసుకునే ఈ పరిసర ప్రాంతాలన్నింటిని పర్యాటక రంగంగా తీర్చిదిద్దేందుకు కేంద్ర ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉన్నట్లుగా తెలుస్తోంది.
Also Read: Group 1 Controversy: గ్రూప్-1 వ్యవహారంలో సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి ఊరట
