Group-1-Supreme-Court
తెలంగాణ, లేటెస్ట్ న్యూస్

Group 1 Controversy: గ్రూప్-1 వ్యవహారంలో సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి ఊరట

Group 1 Controversy

తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ: గ్రూప్​ 1 పోస్టుల భర్తీకి సంబంధించిన వ్యవహారంలో (Group 1 Controversy) రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో భారీ ఊరట​ దక్కింది. హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై స్టే ఇవ్వటానికి అత్యున్నత న్యాయస్థానం మంగళవారం నిరాకరించింది. గ్రూప్-1 నియామకాల్లో అక్రమాలు జరిగాయని పేర్కొంటూ కొందరు అభ్యర్థులు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై సింగిల్ జడ్జి బెంచ్ పిటిషనర్లకు అనుకూలంగా తీర్పు ఇవ్వగా టీజీపీఎస్సీ దానిని డివిజన్​ బెంచ్​‌లో సవాల్ చేసింది. దీనిపై విచారణ సమయంలో ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి వాదనలు వినిపించారు. పిటిషనర్లు ఆరోపించినట్టుగా మెయిన్స్ పరీక్షలు రాసిన వారి పట్ల పక్షపాతం చూపించారనటానికి ఎలాంటి ఆధారాలు లేవని చెప్పారు. 14 ఏళ్ల తర్వాత గ్రూప్-1 నియామకాలు జరుగుతున్నాయని, వాటిని సింగిల్ బెంచ్ రద్దు చేయగా, హైకోర్టు డివిజనల్ బెంచ్ తోసిపుచ్చిన విషయాలను సుప్రీంకోర్టుకు వివరించారు.

Read Also- Landslide tragedy: బస్సుపై విరిగిపడ్డ కొండచరియలు.. భారీగా మృతులు.. హిమాచల్‌ప్రదేశ్‌లో ఘోర విషాదం

మాల్ ప్రాక్టీస్, పేపర్​ లీక్ వంటివి జరిగాయా?, పక్షపాతం చూపించారన్న ఆరోపణలకు ఆధారాలు ఉన్నాయా? అని న్యాయస్థానం ప్రశ్నించింది దీనికి సుదర్శన్ రెడ్డి సమాధానమిస్తూ, ఆరోపణలు చేసిన వారు ఎలాంటి ఆధారాలు చూపించలేకపోయారని తెలిపారు. కోఠి మహిళా విశ్వవిద్యాలయంలో పురుషులకు వాష్​ రూమ్స్ లేకపోవడంతోనే ఈ రెండు కేంద్రాలను మహిళా అభ్యర్థులకు మాత్రమే కేటాయించారని చెప్పారు. ప్రిలిమ్స్, మెయిన్స్ పరీక్షలకు వేర్వేరు హాల్ టిక్కెట్లను జారీ చేయటాన్ని తప్పు పట్టారని ప్రస్తావించారు. అయితే, హాల్ టిక్కెట్లు జారీ చేసే విషయంలో టీజీపీఎస్సీదే పూర్తి అధికారమని తెలిపారు. తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్, జస్టిస్ ఏకే సింగ్​‌లతో కూడిన డివిజనల్ బెంచ్ ఇచ్చిన తీర్పును న్యాయవాది సుదర్శన్ రెడ్డి ప్రస్తావించారు.  సింగిల్ బెంచ్ జడ్జి ఇచ్చిన తీర్పును హైకోర్టు రద్దు చేసిందని గుర్తుచేశారు. కాగా, హైకోర్టు తీర్పు ప్రకారం, టీజీపీఎస్సీ నియామకాలు జరుపుకోవచ్చని న్యాయమూర్తులు స్పష్టం చేశారు. అయితే, తుది తీర్పునకు ఇవి లోబడి ఉంటాయని తెలిపారు. కాగా, హైకోర్టు డివిజన్​ బెంచ్ ఇచ్చిన తీర్పుపై కొందరు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. స్టే ఇవ్వాలంటూ పిటిషన్లు దాఖలు చేశారు. అయితే, హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన తీర్పుపై స్టే ఇవ్వటానికి సుప్రీం కోర్టు నిరాకరించింది. కాగా, హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన తీర్పు నేపథ్యంలో ఇప్పటికే టీజీపీఎస్సీ ఆయా పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల వివరాలను కూడా ప్రకటించింది.

Read Also- Kavitha: ఆదివాసీల హక్కుల కోసం త్వరలోనే కార్యాచరణ ప్రకటిస్తాం.. కవిత కీలక వ్యాఖ్యలు

హైకోర్టుకు తీన్మార్​ మల్లన్న

తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ: తాను కొత్తగా ప్రారంభించిన రాజకీయ పార్టీ గుర్తింపుతో పాటు ఎన్నికల చిహ్నానికి సంబంధించి తీన్మార్ మల్లన్నహైకోర్టులో పిటిషన్​ దాఖలు చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసేందుకు వీలు కల్పించాలని కోరారు. దీనిపై మంగళవారం న్యాయస్థానంలో విచారణ జరిగింది. తీన్మార్ మల్లన్న ఇటీవల తెలంగాణ రాజ్యాధికార పార్టీని ప్రారంభించిన విషయం తెలిసిందే. కాగా, తాను ప్రారంభించిన పార్టీకి గుర్తింపు ఇవ్వటంతోపాటు చిహ్నాన్ని కేటాయించేలా ఉత్తర్వులు ఇవ్వాలంటూ ఆయన హైకోర్టులో పిటిషన్​ వేశారు. దీనిపై మంగళవారం విచారణ జరిపిన న్యాయస్థానం పిటిషనర్ అభ్యర్థనను పరిశీలించి చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలంటూ ఎన్నికల సంఘానికి ఆదేశాలు జారీ చేసింది.

Just In

01

NIMS Hospital: నిమ్స్ ఆసుపత్రిలో అక్రమ నియామకాలు.. శాంతి కుమారి కమిటీ రిపోర్ట్‌లో సంచలనాలు..?

Twitter toxicity: సినిమాలపై ట్విటర్‌లో ఎందుకు నెగిటివిటీ పెరుగుతుంది?.. ట్విటర్ టాక్సిక్ అయిపోయిందా?

Ashanna: మావోయిస్టు పార్టీ ఆరోపణలను ఖండించిన ఆశన్న

Viral Video: అయ్యప్ప మాల దీక్షను తీసుకుని మద్యం సేవించిన స్వామి.. వీడియో వైరల్

Ramchandra Rao: జూబ్లీహిల్స్‌లో రెండు రాష్ట్రాల నేతలు కలిసి పని చేస్తాం..?