Qatar Airways (Image Source: Twitter)
అంతర్జాతీయం

Qatar Airways: 85 ఏళ్ల శాకాహారికి.. నాన్ వెజ్ పెట్టిన విమాన సిబ్బంది.. తర్వాత జరిగింది ఇదే!

Qatar Airways: ఖతార్ ఎయిర్ వేస్ సిబ్బంది చేసిన పొరపాటు ఓ ప్రయాణికుడి మరణానికి కారణమైంది. 2023 జూన్ 30న జరిగి ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. కాలిఫోర్నియాకు చెందిన డాక్టర్ అశోక జయవీర రిటైర్డ్ కార్డియాలజిస్ట్. ఖతార్ ఎయిర్ వేస్ కు చెందిన ఓ విమానం ఎక్కిన ఆయన.. శాకాహారి కావడంతో వెబ్ ఆహారాన్ని ఆర్డర్ ఇచ్చారు. అయితే శాకాహారం అందుబాటులోకి లేదని చెప్పి ఆయనకు మాంసాహారాన్ని ఇచ్చారు. అవసరమైతే మాంసం వరకూ పక్కన పెట్టి.. మిగతా ఫుడ్ తినమని విమాన సిబ్బంది సూచించారు.

మాంసాహారం తిని.. ఊపిరి ఆడక..

ఇక తప్పనిసరి పరిస్థితుల్లో ఆయన ఆహారం తినేందుకు అంగీకరించాడు. భోజనం చేస్తుండగా ఆయనకు ఆహారం గొంతులో ఇరుక్కుపోయింది. దీంతో ఊపిరి ఆడక విమానంలోనే మూర్చపోయారు. ఆయన్ను తిరిగి మామూలు స్థితిలోకి తీసుకొచ్చేందుకు సిబ్బంది ఎంతగా ప్రయత్నించినప్పుటికీ కుదర్లేదు. పైగా ఆరోగ్యం మరింత విషమించింది. దీంతో విమానాన్ని అత్యవసరంగా ఎడిన్‌బర్గ్‌ (స్కాట్లాండ్) లో ల్యాండ్‌ చేశారు. అనంతరం అక్కడి ఆసుపత్రికి తరలించగా 2023 ఆగస్టు 3న ఆయన మరణించినట్లు వైద్యులు ప్రకటించారు.

వైద్యులు ఏం చెప్పారంటే?

85 ఏళ్ల అశోక జయవీర.. అస్పిరేషన్ నిమోనియా (Aspiration Pneumonia) కారణంగా ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు ధ్రువీకరించారు. తిన్న ఆహారం లేదా ద్రవం ఆయన ఊపిరితిత్తుల్లోకి వెళ్లడం వల్ల ఇన్పెక్షన్ కలిగి ప్రాణాలు కోల్పోయినట్లు స్పష్టం చేశారు. అయితే ఆయన కుమారుడు సూర్య జయవీర.. ఖతార్ ఎయిర్ వేస్ పై తాజాగా కేసు వేశారు.  దీంతో ఈ ఘటన వెలుగు చూసింది. విమాన సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే తన తండ్రి ప్రాణాలు కోల్పోయినట్లు ఫిర్యాదులో పేర్కొన్నాడు. అత్యసవర వైద్యం అందించడంలోనూ ఖతార్ ఎయిర్ వేస్ విఫలమైందని మండిపడ్డారు. కాబట్టి తన తండ్రి మరణానికి పరిహారంగా 1,28,821 డాలర్లు (సుమారు రూ.1.08 కోట్లు) పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. డిమాండ్‌ చేస్తున్నారు.

Also Read: IRCTC Tour Package: ఐఆర్‌సీటీసీ బంపరాఫర్.. తక్కువ ఖర్చుతో 7 జ్యోతిర్లింగాల దర్శనం.. డబ్బు లేకున్నా డోంట్ వర్రీ!

మోంట్రియల్ కన్వెన్షన్

అంతర్జాతీయ విమానంలో ప్రయాణిస్తుండగా ఎవరైనా చనిపోతే దానిని ‘మోంట్రియల్ కన్వెన్షన్’ అని అంటారు. ప్రయాణికుల భద్రతకు విమానయాన సంస్థ భరోసా ఇచ్చే ఒప్పందంగా దీన్ని పరిగణిస్తారు. దీని ప్రకారం విమానంలో ఎవరైన మరణిస్తే ప్రతి మరణానికి సుమారు 1,75,000 డాలర్ల వరకు పరిహారం చెల్లించాల్సి ఉంటుంది. గతంలో విమాన ప్రయాణంలో మరణించిన వారి కుటుంబాలకు పలు ఎయిర్ వేస్ సంస్థలు నష్టపరిహారాన్ని చెల్లించాయి.

Also Read: Chalo Bus Bhavan: ఆర్టీసీ క్రాస్ రోడ్స్ వద్ద హైటెన్షన్.. బస్ భవన్‌లోకి కేటీఆర్, హరీశ్‌కు నో ఎంట్రీ.. పలువురు అరెస్ట్

Just In

01

CCI Cotton Procurement: పత్తి కొనుగోళ్లలో అవకతవకలు జరగొద్దు.. పినపాక ఎమ్మెల్యే

Kavitha Janam Bata: కేసీఆర్‌కు ఆ అవసరం లేదు.. నిజామాబాద్ ప్రెస్‌మీట్‌లో కవిత ఆసక్తికర వ్యాఖ్యలు

Kurnool Bus Accident: కర్నూలు బస్సు ప్రమాద ఘటనలో ట్విస్ట్.. చనిపోయిన వ్యక్తిపై కేసు.. ఏం జరగబోతోంది?

Drinking Culture: మందు బాబులు మద్యం సేవించిన తర్వాత ఎందుకు ఎక్కువగా తింటారో తెలుసా?

Bigg Boss Telugu 9: సంజన నోటికి లాక్.. క్లౌడ్ గేమ్ షురూ.. మేఘం వర్షిస్తేనే సేఫ్, లేదంటే?