Gadwal: గద్వాల పట్టణంలోని జమ్మిచెడు కాలనీలో 417 సర్వే నెంబర్ లో ఒక వెంచర్ అన్ని ప్రభుత్వ నిబంధనలతో వేస్తున్నారు. అయితే అదే గ్రామానికి చెందిన ఒక పెద్దమనిషి కన్ను ఆ వెంచర్ పై పడింది. ఇక ఆలస్యం, అమృత విషం అన్నట్లు వెంటనే తన అనుచరిడితో ఆ వెంచర్ నిర్వాహకుడికి రాయబారం పంపారు. మా ఊరిలో వెంచర్ వేస్తే మాకు 40 లక్షలు మామూళ్లు ఇవ్వాల్సిందే. లేదంటే నీ వెంచర్ ఉండదని బెదిరింపులకు పాల్పడుతూ మొదట వెంచర్ చూట్టు రాళ్ళు పాతారు. చెసేదిలేక సదరు వెంచర్ యజమానులు పోలీస్ స్టేషన్ కు వెళ్లగా పోలీసులు బెదిరించిన వారిని పిలచి ఇలా చెస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించడంతో సదరు గ్రామ పెద్ద అనుచరులు చేసెదిలేక వెనుదిరిగారు. ఇక అంతటితో అయిపోయిందిలే అనుకున్న వెంచర్ యజమానులకు నేడు మళ్ళీ ఇబ్బందులు మొదలెట్టారు గ్రామ పెద్ద, ఆయన అనుచరుడు.
Also Read: Srinivas Goud: బీసీరిజర్వేషన్లుకు చట్టబద్దత కల్పించాలి.. మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కీలక వ్యాఖ్యలు
నా స్వంతానికేమి కాదు.. గ్రామాభివృద్ధికే
గ్రామ అభివృద్ధి కోసమే తన తపన తప్ప నా సొంత ప్రయోజనాల కోసం కాదని ఆ సమీప కాలనీవాసులతో గ్రామ పెద్ద అంటున్నట్లు తెలుస్తోంది. దేవాలయ అభివృద్ధి కోసం నిధుల అవసరమని అందుకోసమే వెంచర్ నిర్వాహకులను డిమాండ్ చేస్తున్నట్లు గ్రామస్తులతో అంటున్నారని సమాచారం.
గ్రామ దేవతల కోసం వదిలిన రోడ్డును తవ్వారు
ఒక నెల క్రితం ఇదే వెంచర్ విషయంలో గ్రామ పెద్ద వెంచర్ నిర్వాహకులను 40 లక్షలు ముట్ట జెప్పాల్సిందేనని హుకుం జారీ చేశాడు. నేడు మరోసారి అర్ధరాత్రి ఎవరు లేని సమయంలో ఆ గ్రామ పెద్ద అతని అనుచరులు మరీ బరితెగించారు..వెంచర్ ముందన్నరొడ్డును దౌర్జన్యంగా జెసిపి పెట్టి అడ్డంగా ఇష్టానుసారం తవ్వారు. అదే రొడ్డు గ్రామదేవతలకు వెళుతుందని గ్రామస్తులు తెలిపారు. కొట్లు ఖర్చు పెట్టి అన్ని నిబంధనలతో మేము వెంచార్ వెస్తే మమల్ని ఇలా ఇబ్బందులకు గురిచేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని సదరు వెంచర్ ఒనర్లు వేడుకుంటున్నారు. ఇప్పటికైన ఈ దౌర్జన్యంకు తెర పడుతుందా లేదో చూడాలి.
Also Read: Gatha Vaibhava: పవన్ కళ్యాణ్ అద్భుతమైన మాట చెప్పారు.. అందుకే తెలుగు నేర్చుకుని వచ్చానన్న హీరో!
