GHMC ( IMAGE CREDIT: TWITTER)
హైదరాబాద్

GHMC: రూ.1438 కోట్ల ప్రాపర్టీ ట్యాక్స్ కలెక్షన్.. గతేడాదితో పోల్చితే రూ.103 కోట్లు అధికం

GHMC: రాష్ట్రంలోనే అతి పెద్ద స్థానిక సంస్థగా పేరుగాంచిన జీహెచ్ఎంసీ (GHMC) ప్రధాన ఆర్థిక వనరైన ప్రాపర్టీ ట్యాక్స్ కలెక్షన్ ను వర్తమాన ఆర్థిక సంవత్సరం రికార్డు స్థాయిలో పెంచుకునేందుకు అధికారులు వ్యూహాం సిద్దం చేశారు. గత ఆర్థిక సంవత్సరం (2024-25) లో రూ. 2200 కోట్ల ప్రాపర్టీ ట్యాక్స్ కలెక్షన్ ను లక్ష్యంగా పెట్టుకోగా, చివరి నిమిషం వరకు రూ. 2038 కోట్లు వసూలయ్యాయి. ప్రతి ఆర్థిక సంవత్సరం వసూలైన మొత్తం ప్రాపర్టీ ట్యాక్స్ కు అదనంగా రూ. 200 కోట్ల నుంచి రూ. 300 కోట్ల వరకు టార్గెట్ పెంచుకుని ట్యాక్స్ స్టాఫ్ ట్యాక్స్ కలెక్షన్ చేస్తుండేది. కానీ ఈ వర్తమాన ఆర్థిక సంవత్సరం ఏకంగా రికార్డు స్థాయిలో రూ. 3 వేల కోట్ల ప్రాపర్టీ ట్యాక్స్ ను వసూలు చేసుకోవాలని అధికారులు ప్లాన్ చేస్తున్నారు.

Also Read: Jubilee Hills By-Election: జూబ్లీహిల్స్‌లో ప్రచార సామాగ్రి తొలగింపు.. సభలు, సమావేశాలకు పర్మిషన్ కావాల్సిందే!

రూ. 1348 కోట్ల ప్రాపర్టీ ట్యాక్స్ వసూలు

అంటే గత ఆర్థిక సంవత్సరం రూ. 2038 కోట్లు వసూలు కాగా, ఈ సంవత్సరం ఏకంగా రూ. 962 కోట్ల భారీ టార్గెట్ ను అధికారులు పిక్స్ చేసుకోగా, గత ఏప్రిల్ మాసం నుంచి ఈ నెల 7వ తేదీ సాయంత్రం వరకు రూ. 1348 కోట్ల ప్రాపర్టీ ట్యాక్స్ వసూలు కాగా, గతేడాదితో పోల్చితే రూ. 103 కోట్లు అదనంగా వసూలైనట్లు అధికారులు వెల్లడించారు. లక్ష్యాన్ని చేరేందుకు మిగిలిన రూ. 1652 కోట్ల ట్యాక్స్ వచ్చే మార్చి నెలాఖరు కల్లా వసూలు చేసేలా సిటీలోని 30 సర్కిళ్ల డిప్యూటీ కమిషనర్లకు, ట్యాక్స్ ఇన్ స్పెక్టర్లు, బిల్ కలెక్టర్లకు టార్గెట్లు ఫిక్స్ చేసినట్లు సమాచారం. ఇప్పటి వరకు ప్రతి నెల 30 సర్కిళ్ల నుంచి రూ. వంద కోట్ల వరకు ట్యాక్స్ వసూలు చేయాలన్న నిబంధన ప్రస్తుతం అమల్లో ఉండగా, దీన్ని సవరించి మొత్తం సర్కిళ్ల నుంచి ప్రతి నెల రూ. 200 కోట్ల వరకు ట్యాక్స్ వసూలు చేయాలంటూ మౌఖిక ఆదేశాలు జారీ చేయనున్నట్లు తెలిసింది.

మహా టార్గెట్ ఫలించేనా?

గత ఆర్థిక సంవత్సరం గత ఆర్థిక సంవత్సరం (2024-25) లో రూ. 2200 కోట్ల ప్రాపర్టీ ట్యాక్స్ కలెక్షన్ ను లక్ష్యంగా పెట్టుకోగా, మార్చి నెలాఖరు చివరి రోజు వరకు రూ. 2038 కోట్లు వసూలు చేశారు. అంటే పెట్టుకున్న టార్గెట్ కు చేరువగా కలెక్షన్ చేశారు. ప్రతి సంవత్సరం రూ. 200 కోట్ల నుంచి రూ. 300 కోట్ల వరకు టార్గెట్ పెంచి, సిబ్బందికి వసూళ్ల లక్ష్యాలను ఫిక్స్ చేసేవారు. కానీ ఈ వర్తమాన ఆర్థిక సంవత్సరం ఏకంగా రూ. 962 కోట్ల కు పెంచుకున్న మహా టార్గెట్ ఫలిస్తుందా? అన్నది ట్యాక్స్ స్టాఫ్ లోనే గాక, అధికార వర్గాల్లో కూడా చర్చనీయాంశంగా మారింది. కానీ అధికార వర్గాలు మాత్రం సాధ్యమవుతుందన్న ధీమాతో ఉన్నారు.

సిటీలో దాదాపు 70 వేల భవనాలు

ముఖ్యంగా గత సంవత్సరం జూలై మాసం నుంచి సిటీలోని ప్రాపర్టీలపై నిర్వహిస్తున్న జియోగ్రాఫికల్ ఇన్ఫర్మేషన్ సర్వే (జీఐఎస్) మంచి ఫలితాలనిస్తూ విద్యుత్ శాఖ నుంచి కమర్షియల్ కరెంట్ మీటర్లను వినియోగిస్తూ, జీహెచ్ఎంసీకి రెసిడెన్షియల్ పన్ను చెల్లిస్తున్న సుమారు 93 వేల ప్రాపర్టీలను గుర్తించారు. వీటిని కమర్షియల్ ట్యాక్స్ పరిధిలోకి తీసుకురావటంతో పాటు ఇంకా ట్యాక్స్ చెల్లింపు పరిధిలోకి రాకుండా అసెస్ మెంట్ చేయకుండా సిటీలో దాదాపు 70 వేల భవనాలున్నట్లు, కేవలం వీటి నుంచే రూ. 600 కోట్ల వరకు ట్యాక్స్ వసూలవుతుందని అధికారులు లెక్కలేస్తున్నారు. లక్ష్యం చేరుకునేందుకు మిగిలిన రూ. 362 కోట్లను కమర్షియల్ ట్యాక్స్ పరిధిలోకి తీసుకురానున్న 93 వేల ప్రాపర్టీల నుంచి వసూలవుతుందని అంచనాలున్నాయి.

ట్యాక్స్ కలెక్షన్ లో శేరిలింగంపల్లి టాప్

వర్తమాన ఆర్థిక సంవత్సరం సిటీలోని మొత్తం 30 సర్కిళ్లలో శేరిలింగంపల్లి ఇప్పటి వరకు ఈ నెల 7వ తేదీ సాయంత్రం వరకు రూ. 214 కోట్ల ట్యాక్స్ కలెక్షన్ చేసి, టాప్ వన్ స్థానంలో నిలిచింది. ఆ తర్వాత స్థానంలో జూబ్లీహిల్స్ సర్కిల్ రూ. 125 కోట్లు వసూలు చేయగా, ఖైరతాబాద్ 98 కోట్లు వసూలు చేసినట్లు, ఇక కలెక్షన్ లో చివరి స్థానంలో ఫలక్ నుమా సర్కిల్ ఉన్నట్లు అధికారులు తెలిపారు.

మాల్స్ పై దృష్టి పెట్టాలి

సిటీలోని అన్ని సర్కిళ్లలో నున్న మాల్స్ పై ట్యాక్స్ సిబ్బంది ప్రత్యేక దృష్టి పెట్టాలని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్.వి. కర్ణన్ మంగళవారం సర్క్యులర్ జారీ చేసినట్లు సమాచారం. ముఖ్యంగా సర్కిళ్ల పరిధిలోని డిప్యూటీ కమిషనర్లు, ట్యాక్స్ ఇన్ స్పెక్టర్లు, బిల్ కలెక్టర్లు తమ పరిధిలోని మాల్స్ కు నేరుగా వెళ్లి, మాల్స్ ప్రాపర్టీ ట్యాక్స్ చెల్లిస్తున్నాయా? లేదా? అన్న విషయాన్ని నిర్థారించుకోవాలని, ఒక వేళ ట్యాక్స్ చెల్లింపు పరిధిలో లేని పక్షంలో వెంటనే వాటిని ట్యాక్స్ చెల్లింపు పరిధిలోకి తీసుకురావాలని, ఆ మాల్స్ లోని అన్ని వ్యాపార సంస్థలను కూడా ట్రేడ్ లైసెన్స్ పరిధిలోకి తీసుకురావాలని కమిషనర్ సర్క్యులర్ లో ఆదేశించినట్లు తెలిసింది. మంగళవారం ఆదేశాలిచ్చిన కమిషనర్ డిప్యూటీ కమిషనర్లకు శుక్రవారం సాయంత్రం వరకు గడువు విధించినట్లు తెలిసింది.

Also Read: Warangal Collector: ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి.. అధికారులకు కలెక్టర్ కీలక ఆదేశాలు

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!