Medchal ( IMAGE Credit: swetcha reporter)
హైదరాబాద్

Medchal: బాణసంచా దుకాణాలకు అనుమతులు తప్పనిసరి.. పటాకులు కాల్చే వారు ఈ జాగ్రత్తలు తీసుకోవాలి

Medchal: దీపావళి పండుగ అంటే మనందరికి పటాకులు, దీపాలే గుర్తుకు వస్తాయి. ముఖ్యమంగా చిన్నారులకు, యువతకు అలాంటి దీపావళి పండగను ఎంతో ఇష్టపడుతారు. చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా జరుపుకునే పండుగ అని మన శాస్త్రాలు చెపుతున్నాయి. అలాంటి పండుగను చెడుగా కాకుండా మంచిగా గుర్తుండిపోయేలా జరుపుకోవాలని సంబంధిత ఫార్ డిపార్ట్ మెంట్ అధికారులు సూచిస్తున్నారు. ప్రజల జీవితాల్లో వెలుగునిచ్చే దీపావళి పండుగ ను ఎలాంటి చేదు అనుభవాలు ఎదురవకుండా సంతోషంగా జరుపుకునేలా చూసుకోవాలని సూచిస్తున్నారు. గాలి కాలుష్యం కాకుండా మున్ముందు తరాలకు కూడా కలుషుతం లేని గాలిని అందించేలా దీపావళి పండుగను జరుపుకోవాలని పలువురు తెలుపుతున్నారు.

Also Read: Adluri Laxman vs Ponnam: మంత్రుల మధ్య సయోధ్య.. విభేదాలను చక్కదిద్దిన టీపీసీసీ.. వివాదం ముగిసినట్లే!

ట్రేడ్ లైసెన్స్ లేకుండా పటాకులు అమ్మితే కఠిన చర్యలు

దీపావళి పండుగ సందర్బంగా శామీర్ పేట్, మూడుచింతలపల్లి, మేడ్చల్ (Medchal) మండలాల ప్రజలు దీపావళి వేడుకలను ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా అసిస్టెంట్ డిస్ట్రిక్ ఫైర్ ఆఫీసర్ వి.ధనుంజయ రెడ్డి (Fire Officer V. Dhanunjaya Reddy) సూచించారు. ఈ సందర్భంగా ప్రజలకు, బాణాసంచా దుకాణాల యజమానులకు ధనుంజయ రెడ్డి పలు సూచనలు చేశారు. బాణాసంచా దుకాణాలతో పాటు, పటాకులు కాల్చే ప్రజలకు ఎలాంటి ప్రమాదాలు జరగకుండా మా ఫైర్ డిమార్ట్ మెంట్ నుండి అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతుందని అసిస్టెంట్ డిస్ట్రిక్ ఫైర్ ఆఫీసర్ తెలిపారు. గ్రామాల్లో, పట్టణాల్లో బాణాసంచా దుకాణాలు పెట్టి పటాకులు అమ్మాలనుకునే వారు తప్పనిసరిగా ట్రేడ్ లైన్స్ పొంది ఉండాలని సూచించారు.

ఆ పర్మిషన్ 500 రూపాయలు ఛాలన్ కట్టి తీసుకోవాలి

ఎవరైతే పటాకులు అమ్మాలనుకుంటున్నారో మా వెబ్ సైట్ (fire.telangana.gov.in)ఫైర్.తెలంగాణ.గవర్నమెంట్.ఇన్ లో సిటిజెన్ లాగిన్ లోకి వెల్లి మేయిల్ తో లాగిన్ అయిన తరువాత టెంపరరి షాప్, పర్మినెంట్ షాప్, గోడౌన్ అనే మూడు ఆప్షన్ లో మీరు ఏది పెట్టాలనుకుంటే ఆ పర్మిషన్ 500 రూపాయలు ఛాలన్ కట్టి తీసుకోవాలని సూచించారు. అలా కాదని ఎవరు పడితే వారు ఇష్టానుసారంగా బాణాసంచా దుకాణాలు నడిపిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బాణాసంచా దుకాణాల్లో, పటాకులు కాల్చే ప్రదేశంలో ఫైర్ ఆక్సిడెంట్ జరిగినట్లయితే 101 కు ఫోన్ చేసి సమాచారం ఇస్తే మా ఫైర్ సిబ్బంది వెంటనే స్పందించి ఎలాంటి ప్రమాదాలు జరగకుండా చూసుకుంటారని తెలిపారు.

బాణాసంచా దుకాణాల్లో, పటాకులు కాల్చే వారు జాగ్రత్తలు తప్పనిసరీ

బాణాసంచా దుకాణాలు నడిపించే వారు, పటాకులు కాల్చే వారు పలు జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలని అసిస్టెంట్ డిస్ట్రిక్ ఫైర్ ఆఫీసర్ వి.ధనుంజయ రెడ్డి సూచించారు. బాణాసంచా దుకాణాలు నడిపించే వారు, పటాకులు కాల్చే వారు దగ్గరలో వాటర్ డ్రమ్స్ పెట్టుకోవాలని, ఫైర్ సేఫ్టీ కిట్, బాణాసంచా దుకాణాల్లో ఎట్టిపరిస్తితిలో మైనర్లు ఉద్యోగులుగా పెట్టకూడదన్నారు. పటాకులు కొనుగోలు చేసే వారుషాపు దగ్గరలో కాల్చవద్దని అసిస్టెంట్ డిస్ట్రిక్ ఫైర్ ఆఫీసర్ తెలిపారు. అదేవిదంగా దుకాణా దారులు పెట్టే స్టాల్ ను చుట్టు ప్రక్కల ఎక్కుల గ్యాప్ ఉండేలా చూడాలని, పటాకులు కాల్చే వారు దగ్గర ఉండి కాల్చవద్దని హెచ్చరించారు. పటాకులు కాల్చే వారు దగ్గరలో నీటిని ఉంచడంతో పాటు మిగతా పటాకులను దూరంగా ఉంచాలన్నారు. కాలుష్యం కాకుండా పటాకులు కాల్చాలన్నారు. కాల్చిన పటాకులు చల్లారే వరకు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.

Also Read:Youth Health Issues: యువతలో 65% మందికి అలాంటి సమస్య.. సర్వేలో బయటకొచ్చిన షాకింగ్ నిజాలు

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!